
మాలిక దువా(ఎడమ వైపు), శ్యామ్ (కుడి వైపు)
సాక్షి, న్యూఢిల్లీ : శ్యామ్ రంగీల ప్రముఖ మిమిక్రీ కళాకారుడు. అక్షయ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ది గ్రేట్ ఇండియన్ లాటర్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రాజకీయ నేతలను అనుకరించటం ఇతని ప్రత్యేకత. అయితే అనూహ్యంగా అతన్ని షో నుంచి ఎలిమినేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు ప్రోగ్రాంలో ఎడిటింగ్‌లో చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో... అసలు విషయం జనాలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో రంగీల స్పందించాడు.
మోదీ-రాహుల్‌లను నేను బాగా ఇమిటేట్ చేస్తాను. అయితే షో నిర్వాహకులు మాత్రం తనను కేవలం రాహుల్‌ను మాత్రమే అనుకరించాలని చెప్పారు. ఆ జోకులు బాగా పేలాయి. కొన్ని రోజుల తర్వాత ఎందుకనో రాహుల్ గొంతును కూడా చెయొద్దంటూ చెప్పారు. ఇలా పొలిటికల్ సెటైర్లు కాకుండా.. కొత్త స్కిట్‌లతో రావాలని నన్ను సూచించారు. కానీ, నేను ఇచ్చిన ప్రదర్శన వాళ్లకి నచ్చలేదు. అందుకే వాటిని ప్రదర్శించకుండానే.. నన్ను ఎలిమినేట్ చేశారు అని రంగీలా చెప్పాడు.
వీడియో ద్వారా వైరల్ కావటం సంతోషంగానే ఉన్నప్పటికీ అది ఎవరు చేశారో తనకు తెలీదని అన్నాడు. వివాదాల్లో ఇరుక్కోవటం ఇష్టం లేకనే తాను మౌనంగా బయటకు వచ్చేశానని చెప్పాడు. మరోవైపు ప్రదర్శన సందర్భంగా రంగీలాను అభినందిస్తూ షో మెంటర్ మాలిక దువా బెల్ మోగిస్తాననటం.. దానికి జడ్జి అక్షయ్ కుమార్ ఆమెతో నీ గంట మోగిస్తానంటూ వ్యాఖ్యలు చేయగా... మాలిక్ తండ్రి, జర్నలిస్ట్ వినోద్ దువా తన ఫేస్‌బుక్‌లో ఆ కామెంట్లను పోస్ట్ చేసి, ఆపై డిలేట్ చేశారు. అయితే అప్పటికే అది వైరల్ అయ్యి వివాదాస్పదంగా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment