సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ గోప్యతపై వినియోగదారుల్లో ఆందోళన కొనసాగుతుండగానే భారీ ఎత్తున ఆధార్ డేటా లీక్ అయిందన్న వార్త ఇపుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ గ్యాస్ (ఇండేన్) కంపెనీ వినియోగదారులకు షాకిచ్చే నివేదికను టెక్ క్రంచ్ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది.
టెక్ క్రంచ్. కాంం అందించిన నివేదిక ప్రకారం 67 లక్షల ఆధార్ సభ్యుల వివరాలు లీక్ అయ్యాయి. దేశీయ గ్యాస్ పంపిణీ కంపెనీ ఇండేన్ నుంచి ఆధార్ వినియోగదారులు ఫోన్ నెంబర్లు, చిరునామా, తదితర వివరాలు లీక్ అయ్యాయని టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు ఇండేన్ వెబ్‌సైట్ లోకి ఎవరైనా చొరబడి లాగిన్ వివరాలను తస్కరించడంతోపాటు, భారీ డాటాబేస్‌కు కూడా యాక్సెస్ సాధించవచ్చని పేర్కొంది.
పేరు చెప్పడానికి ఇష్టపడని సెక్యూరిటీ పరిశోధకుడు డేటాబేస్‌ను కొనుగొన్నట్టు వెల్లడించింది. ఇలా ఇండేన్ కెందిన 11వేల డీలర్ల వద్ద, వినియోగదారుల ఆధార్ నెంబర్ సహా, ఇతర వ్యక్తిగత వివరాలను కనుగొన్నట్టు టెక్ క్రంచ్ నివేదించింది.
మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)కి చెందిన వంటగ్యాస్ పంపిణీ సంస్థ ఇండేన్ గ్యాస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు లక్షలాది మంది కస్టమర్ల డేటా లీకైందని ఎథికల్ హ్యాకర్ ఎలియాట్ ఆల్డర్సన్ చెబుతున్నారు. స్థానిక డీలర్లు ఆథెంటికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్ నెంబర్లు లీక్ అయ్యాయని ఆయన వాదిస్తున్నారు.
ఆధార్ డేటా లీక్ అంశాన్ని ఫిబ్రవరి 10న దీన్ని గుర్తించామని, ఇదే విషయాన్ని ఫిబ్రవరి 16న గ్యాస్ కంపెనీ దృష్టి కి తీసుకెళ్లామని తెలిపింది. అయితే కంపనీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దీన్నినేడు (ఫిబ‍్రవరి 19న బహిర్గతం చేసినట్టు చెప్పింది. అటు ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) కూడా ఎలాంటి స్పందన రాలేదని టెక్ క్రంచ్ స్పష్టం చేసింది. ఈ నివేదికపై అటు ఇండేన్ కంపెనీగానీ, ఇటు యుఐడీఏఐ గానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment