Techcrunch.com
-
వేలమంది ఉద్యోగులపై వేటు,టెక్కీలకు గడ్డుకాలం..వరస్ట్ ఇయర్‌గా 2022
Tech companies fired over 32,000 employees : టెక్ దిగ్గజ కంపెనీ ఉద్యోగులకు భారీ షాకిచ్చాయి. ఒక్క జులై నెలలో సుమారు 32వేల మంది టెక్కీలపై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు 2022 వరస్ట్ ఇయర్‌గా నిలిచిపోనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో గట్టెంకేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ జులై నెలలో అమెరికా సిలీకాన్ వ్యాలీలో కార్యకాలపాలు నిర్వహిస్తున్న ఆయా సంస్థలు మొత్తం 32 వేల మందిని విధుల నుంచి తొలగించాయని వెలుగులోకి వచ్చిన క్రంచ్ బేస్ నివేదిక పేర్కొంది. ఉద్యోగులపై వేటు విధించిన సంస్థల్లో నెట్‌ఫ్లిక్స్, షాఫిఫై, కాయిన్ బేస్‌తో పాటు ఇతర కంపెనీలు వందల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పేర్కొంది. వారం వారం పెరిగిపోతున్నారు. మా దృష్టికి వచ్చింది. సిలికాన్ వ్యాలీలో ఉన్న టెక్ కంపెనీలు వారం వారం ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అందుకే మాకు (క్రంచ్‌బేస్) ఏ ఉద్యోగం స్థిరంగా ఉండడం లేదని అనిపిస్తుంది. స్పష్టమైన కారణం లేకుండానే ఉద్యోగాలు కోల్పోతున్నందున చాలా మందికి 2022 మరో వరస్ట్ ఇయర్‌గా మారుతోంది. కొన్ని టెక్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియను నిలిపివేశాయి. ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు చాలా సంస్థలు ఉద్యోగల్ని తొలగిస్తున్నాయి. అమెరికాలో దాదాపు 64 ప్రముఖ టెక్ కంపెనీలు జూలై నెలలో 32వేల కంటే ఎక్కువ మంది విధుల నుంచి తొలగించాయని క్రంచ్ బేస్ హైలెట్ చేసింది. ►క్రంచ్‌బేస్ సేకరించిన డేటా ప్రకారం..ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ షాఫిఫై గత నెలలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో రిక్రూటింగ్, సపోర్ట్, సేల్స్ విభాగాల ఉద్యోగులున్నారు. ►ట్విట్టర్ తన టాలెంట్ అక్విజిషన్ టీమ్‌లో 30 శాతం మందిని తొలగించింది.పెరుగుతున్న వ్యాపార ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ►మైక్రోసాఫ్ట్ తన 1,80,000 మంది వర్క్‌ఫోర్స్‌లో 1 శాతాన్ని తగ్గించింది, కొన్ని నిర్మాణాత్మక సర్దుబాట్లు, వ్యాపార అవసరాలను తీర్చాలని యోచిస్తోంది. ►టిక్‌టాక్ కంపెనీ పునర్నిర్మాణం పేరుతో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించిందని,100 కంటే తక్కువ మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని వైర్డ్ నివేదిక పేర్కొంది. ►హూప్ వంటి ఇతర స్టార్టప్‌లు 15 శాతం మంది సిబ్బందిని తొలగించాయి. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ విమెమో (Vimeo) 72 మంది ఉద్యోగులను తొలగించింది. ►కేవలం రెండు నెలల్లో, నెట్‌ఫ్లిక్స్ మొత్తం 450 మంది పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది. సబ్స్క్రైబర్లు తగ్గడం, అదే సమయంలో ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ►కాయిన్‌బేస్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు 1100 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. కంపెనీ సీఈవో బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదట ఉద్యోగుల తొలగింపుకు ఆర్ధిక పరిస్థితులేనని అన్నారు. ఆపై అవసరానికి మించి ఉద్యోగుల్ని హయ్యర్ చేసుకుందని మాట మార్చారు. -
41 కోట్ల యూజర్ల వివరాలు లీక్
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్బుక్ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా 41.9 కోట్ల మంది యూజర్ల వివరాలు బయటకు పొక్కాయని టెక్ క్రంచ్ అనే మీడియా సంస్థ తెలిపింది. ఇందులో 13.3 కోట్ల మంది అమెరికన్లు ఉండగా, 5 కోట్ల మంది వియత్నామీలు, 1.8 కోట్ల మంది బ్రిటిషర్లు ఉన్నారని వెల్లడించింది. ఈ ఘటనలో యూజర్ల ఫోన్ నంబర్లు, లింగం, నివాస ప్రాంతం తదితర వివరాలు బయటకు వచ్చేశాయని పేర్కొంది. సంబంధిత ఫేస్బుక్ సర్వర్‌కు పాస్వర్డ్ రక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందనీ, దీనివల్ల ఎవరైనా ఈ సర్వర్ నుంచి యూజర్ల పూర్తివివరాలను తీసుకునేందుకు వీలుకలిగిందని చెప్పింది. ఈ విషయాన్ని తాము ఫేస్బుక్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపింది. మరోవైపు ఈ విషయమై ఫేస్బుక్ స్పందిస్తూ.. దాదాపు 20 కోట్ల యూజర్ల వివరాలు బయటపడ్డాయనీ, ఈ సమాచారమంతా చాలా పాతదని వివరణ ఇచ్చింది. -
మరో ఆధార్ డేటా లీక్ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ గోప్యతపై వినియోగదారుల్లో ఆందోళన కొనసాగుతుండగానే భారీ ఎత్తున ఆధార్ డేటా లీక్ అయిందన్న వార్త ఇపుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ గ్యాస్ (ఇండేన్) కంపెనీ వినియోగదారులకు షాకిచ్చే నివేదికను టెక్ క్రంచ్ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. టెక్ క్రంచ్. కాంం అందించిన నివేదిక ప్రకారం 67 లక్షల ఆధార్ సభ్యుల వివరాలు లీక్ అయ్యాయి. దేశీయ గ్యాస్ పంపిణీ కంపెనీ ఇండేన్ నుంచి ఆధార్ వినియోగదారులు ఫోన్ నెంబర్లు, చిరునామా, తదితర వివరాలు లీక్ అయ్యాయని టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు ఇండేన్ వెబ్సైట్ లోకి ఎవరైనా చొరబడి లాగిన్ వివరాలను తస్కరించడంతోపాటు, భారీ డాటాబేస్‌కు కూడా యాక్సెస్ సాధించవచ్చని పేర్కొంది. పేరు చెప్పడానికి ఇష్టపడని సెక్యూరిటీ పరిశోధకుడు డేటాబేస్‌ను కొనుగొన్నట్టు వెల్లడించింది. ఇలా ఇండేన్ కెందిన 11వేల డీలర్ల వద్ద, వినియోగదారుల ఆధార్ నెంబర్ సహా, ఇతర వ్యక్తిగత వివరాలను కనుగొన్నట్టు టెక్ క్రంచ్ నివేదించింది. మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)కి చెందిన వంటగ్యాస్ పంపిణీ సంస్థ ఇండేన్ గ్యాస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు లక్షలాది మంది కస్టమర్ల డేటా లీకైందని ఎథికల్ హ్యాకర్ ఎలియాట్ ఆల్డర్సన్ చెబుతున్నారు. స్థానిక డీలర్లు ఆథెంటికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్ నెంబర్లు లీక్ అయ్యాయని ఆయన వాదిస్తున్నారు. ఆధార్ డేటా లీక్ అంశాన్ని ఫిబ్రవరి 10న దీన్ని గుర్తించామని, ఇదే విషయాన్ని ఫిబ్రవరి 16న గ్యాస్ కంపెనీ దృష్టి కి తీసుకెళ్లామని తెలిపింది. అయితే కంపనీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దీన్నినేడు (ఫిబ్రవరి 19న బహిర్గతం చేసినట్టు చెప్పింది. అటు ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) కూడా ఎలాంటి స్పందన రాలేదని టెక్ క్రంచ్ స్పష్టం చేసింది. ఈ నివేదికపై అటు ఇండేన్ కంపెనీగానీ, ఇటు యుఐడీఏఐ గానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
ఎస్బీఐ ఖాతాదారుల డేటా లీక్ సంచలనం
సోషల్ మీడియా అకౌంట్ల డేటా లీక్ వార్తలు వినియోగదారులకు షాకిస్తోంటే...తాజాగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతా దారుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త ఇది. ఎస్బీఐకు చెందిన లక్షలాది ఖాతాదారుల డాటా భద్రతకు సంబంధించి టెక్ క్రంచ్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని, ఇప్పటికే లక్షలాది కస్టమర్ల ఫోన్ నెంబర్లు, బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలు, తదితర వివరాలు లీకయ్యాయని ప్రకటించింది. దీంతో ఎస్బీఐ కస్టమర్లలో కలకలం రేగింది. మిస్డ్ కాల్ ద్వారా బ్యాంకింగ్ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకునే సదుపాయమే 'ఎస్బీఐ క్విక్'. ముంబైలోని సర్వర్ డేటా సెంటర్‌కు పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేదని, తద్వారా హ్యాకర్లు ఎవరైనా చాలా సులువుగా లక్షలాదిమంది కస్టమర్ల డేటాను యాక్సెస్ చేయొచ్చని టెక్ క్రంచ్ పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా ఎస్బీఐ కున్న సుమారు 42 కోట్లకు పైగా ఖాతాలకు సంబంధించిన డేటా భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్మార్ట్ఫోన్లు ఉపయోగించని కస్టమర్లు ఎస్బీఐ క్విక్ ద్వారా కస్టమర్లు టెక్స్ట్ మెసేజ్‌లతో వివరాలను తెలుసుకునే సదుపాయం. ఎస్బీఐ సూచించిన కీవర్డ్స్ఆధారంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్నుంచి ఈ సమాచారాన్ని ఖాతాదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యగా బ్యాలెన్స్ ఎంక్వైరీ, చివరి ఐదు లావాదేవీలు, ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం, గృహ, వాహనరుణాలకు సంబంధించిన సమాచారం పొందొచ్చు. ఇలా ఎస్బీఐ క్విక్‌కు రోజూ మెసేజ్‌లు బట్వాడా అవుతాయనీ, అయితే పాస్వర్డ్ లేని డేటాబేస్కు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని చెబుతోంది. పేరు చెప్పడానికి సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఒక్క సోమవారం రోజే ఇలాంటి దాదాపు 30లక్షల నకిలీ మెసేజ్‌లు ఎస్బీఐ కస్టమర్లకు అందాయని టెక్ క్రంచ్ ఆరోపించింది. గత రెండు నెలల కాలంలో హ్యాకర్లు కస్టమర్లకు భారీ నష్టాన్ని కలిగించి వుండవచ్చని అంచనా వేసింది. ఎస్బీఐ వివరణ అయితే దీనిపై ఎస్బీఐ ట్విటర్ ద్వారా స్పందించింది. అత్యున్నత విలువలతో సేవలందిస్తున్న ఎస్బీఐ వినియోగదారుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. అలాగే డాటాలీక్పై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. In light of the recent news item, regarding an alleged data incident, please find below our statement: pic.twitter.com/mu4xn12QgL — State Bank of India (@TheOfficialSBI) January 31, 2019 -
ఎఫ్బీ మొబైల్ యాప్ యూజర్లకు షాక్!
మీరు ఫేస్బుక్ మొబైల్ యాప్ వాడుతున్నారా? ప్రత్యేకంగా మెసెంజర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా అప్పుడప్పుడు మొబైల్ యాప్‌లోనే మీరు మెసెజ్‌లు పంపిస్తున్నారా? అయితే మీకు ఇది షాక్ కలిగించే న్యూస్. ఇక ఎఫ్బీ మొబైల్ యాప్‌లోనే మెసెజ్‌లు పంపుకొనే సదుపాయం ఉండబోదట. ఎఫ్బీకి చెందిన మెసెంజర్ యాప్‌లోనే సందేశాలు పంపించుకోవాలట. మెసెంజర్ యాప్ డౌన్లోడ్లను పెంచుకోవడానికి ఫేస్బుక్ ఈ ఎత్తు వేసినట్టు తాజాగా టెక్‌క్రంచ్.కామ్ వెల్లడించింది. ఇప్పటికే ఈ మేరకు ఫేస్బుక్ తన యూజర్లు చాలామందికి సమాచారం కూడా ఇచ్చిందని, ' యాప్‌లోని మీ సంభాషణలను మెసెంజర్‌కు బదిలీ చేసినట్టు' తెలియజేసిందని ఆ వెబ్సైట్ తెలిపింది. ఈ సమాచారాన్ని పట్టించుకోకపోతే.. మెసెంజర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని ఫేస్బుక్ యూజర్లను నేరుగా అడిగే అవకాశముందని పేర్కొంది. సందేశాలు పంపేవిషయంలో ఉత్తమమైన సేవలు అందుకోవాలంటే అందుకు మెసెంజర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందేనని ఫేస్బుక్ పేర్కొన్నట్టు ఆ సైట్ ఓ కథనంలో తెలిపింది. అయితే, చాలామంది మొబైల్ ఫోన్లలో తగినంత మెమరీ సామర్థ్యం లేకపోవడంతో మొబైల్ యాప్ లేదా మెసెంజర్ ఏదొ ఒక్కటే డౌన్లోడ్ చేసుకొని వాడుతున్న సంగతి తెలిసిందే. ఇక యూజర్లు పెట్టే పోస్టులను విశ్లేషించేందుకు 'డీప్ టెక్స్ట్' పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఫేస్బుక్ ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఆ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే దాదాపు 20 భాషల్లో పోస్టులను కచ్చితంగా విశ్లేషించే అవకాశముంటుందని ఫేస్బుక్ తెలిపింది.