indane gas agency
-
2 గంటల్లో సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. బుకింగ్ చేసిన రెండు గంటల్లో బండ ఇంటికొచ్చేస్తుంది. ‘ఇండేన్ తత్కాల్ సేవ’ పేరిట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఈ తరహా సేవలను ప్రారంభించింది. దేశంలోనే పైలెట్ ప్రాజెక్ట్‌గా తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల రోజుల వ్యవధిలో హెచ్‌పీ గ్యాస్ కూడా ఈ తరహా సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘ప్రియారిటీ’ సర్వీస్ పేరిట కస్టమర్ కోరిన సమయంలో గ్యాస్ డెలివరీ సేవలను భారత్ గ్యాస్ దశాబ్ధ క్రితం నుంచే అందిస్తుంది. ►సింగిల్ సిలిండర్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు సిలిండర్ బుకింగ్ చేశాక.. డెలివరీ కోసం ఎందుకు ఎదురుచూడాలనే ప్రశ్నకు సమాధానమే ‘తత్కాల్ సేవ’. పాలు, కూరగాయల తరహాలోనే వంట గ్యాస్ కూడా అత్యవసర సర్వీసే. సాధారణంగా గ్యాస్ డెలివరీకి 48–72 గంటల సమయం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువే అవుతుంది. గంటల వ్యవధిలోనే సిలిండర్‌ను డెలివరీ చేయాలన్న లక్ష్యంతో తత్కాల్ సేవను ప్రారంభించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఏపీ, తెలంగాణ హెడ్ శ్రవణ్ ఎస్ రావు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 15.20 లక్షల ఇండేన్ గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లో 6.15 లక్షలు సింగిల్ బాటిల్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 62 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తత్కాల్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. బుకింగ్ చేసేది ఇలా.. ►ఐవీఆర్ నంబర్ 77189 55555, సీఎక్స్.ఇండియ న్ ఆయిల్.ఇన్, ఇండియన్ఆయిల్ వన్ యాప్ వీటిల్లో ఏ మాద్యమం ద్వారా అయినా తత్కాల్ సేవను వినియోగించుకోవచ్చు. ►ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 4 గంట ల మ«ధ్య పని దినాల్లో మాత్రమే బుకింగ్ చేయా ల్సి ఉంటుంది. ►సింగిల్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. తత్కాల్ సేవకు సిలిండర్ ధరతో పాటు అదనంగా రూ.25 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ►తత్కాల్ సేవలో గ్యాస్ బుకింగ్ కాగానే.. ఐఓసీ డెలివరీ పర్సన్ అప్లికేషన్‌కు ఆర్డర్ నోటిఫికేషన్ వెళుతుంది. వెంటనే ఆర్డర్ డెలివరీ కోసం ప్రాసెస్ అవుతుంది. ►సిలిండర్ డెలివరీ నిమిషం ఆలస్యమైనా .. గ్యాస్ బండను కస్టమర్‌కు అందించి.. తత్కాల్ కింద చెల్లించిన రూ.25 చార్జీ కస్టమర్‌కు తిరిగి ఇస్తారు. నెల రోజుల్లో హెచ్‌పీ కూడా.. ఇండేన్ తత్కాల్ సేవ ఫీడ్ బ్యాక్‌ను విశ్లేషించి.. ఇంకా మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్‌పీ గ్యాస్ సన్నాహాలు ప్రారంభించింది. కస్టమర్ సౌకర్యార్థం, అదరపు చార్జీల వసూలు చేసి గంటల వ్యవధిలోనే సిలిండర్‌ను డెలివరీ చేస్తామని హెచ్‌పీ గ్యాస్ హైదరాబాద్ హెడ్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో హైదరాబాద్‌తో పాటూ మరో నగరంలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ లో 35 లక్షల హెచ్‌పీ కనెక్షన్లు ఉండగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 15 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ఎల్పీజీ మార్కెట్లో హెచ్‌పీ కంటే ఐఓసీఎల్ వాటా 5 శాతం ఎక్కువగా ఉంటుంది. భారత్ గ్యాస్ ‘ప్రియారిటీ’ సేవలు.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన ఎల్పీజీ విభాగం భారత్ గ్యాస్... 15 ఏళ్ల క్రితమే ప్రియారిటీ సర్వీసెస్‌ను ప్రారంభించింది. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగులుగా ఉన్న కుటుంబాలు ప్రియారిటీ సేవలను వినియోగించుకోవచ్చు. అంటే ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 6 తర్వాత కస్టమర్ కోరిన సమయంలో గ్యాస్ సిలిండర్‌ను డెలివరీ సమయాన్ని ఎంపిక చేసుకునే వీలుంటుందన్నమాట. ప్రియారిటీ సర్వీసెస్‌కు సిలిండర్ మీద రూ.15–25 చార్జీ ఉంటుందని భారత్ గ్యాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తెలంగాణలో 28 లక్షల భారత్ గ్యాస్ కనెక్షన్లుండగా.. వీటిల్లో 14.4 లక్షల కనెక్షన్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్లు ఆయన వివరించారు. -
గ్యాస్ అయిపోయిందని టెన్షన్ వద్దు !.. అరగంటలో మరో సిలిండర్ ?
గ్యాస్ సిలిండర్ అయిపోయిందంటే దాదాపుగా ఇంటి పని సగం ఆగిపోతుంది. ఇంటిల్లిపాది మరో సిలిండర్ కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆ చింత అక్కర్లేదు. వేగంగా గ్యాస్ సిలిండర్ అందించేందుకు తత్కాల్ పథకం అందుబాటులోకి తెచ్చారు. అది కూడా పైటల్ ప్రాజెక్టుగా మన హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ పథకం అమలుచేస్తున్నారు. తత్కాల్ స్కీం ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ అయిపోతే గ్యాస్ ఏజెన్సీ వెళ్లడం, ఆన్లైన్ బుక్ చేయడం లేదా ఫోన్లో ఐవీఆర్ఎస్ పద్దతిలో ఇంకో సిలిండర్ బుక్ చేయాల్సి వచ్చేది. ఫుల్ సిలిండర్ ఇంటికి వచ్చేందుకు కనీసం ఆరు గంటల నుంచి ఆరు రోజుల వరకు సమయం పట్టేది. సామాన్యులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను తీర్చేందుకు తత్కాల్ స్కీమ్ అమలు చేయాలని గ్యాస్ ఏజెన్సీలు నిర్ణయించాయి. ముందుగా ఇంధన్ దేశం మొత్తం మీద 28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో 14 కోట్ల కనెక్షన్లు ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్నాయి. దీంతో తత్కాల్ స్కీమ్‌ను ముందుగా ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్న ఇంధన్ సిలిండర్లకు అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నగరాన్ని ఎంపకి చేశారు. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ డివిజన్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. బుకింగ్ ఇలా రెగ్యులర్‌గా గ్యాస్ బుక్ చేసే ఐవీఆర్ఎస్, ఇండియన్ ఆయిల్ వెబ్సైట్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్‌లలో తత్కాల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి తత్కాల్ పద్దతిలో సిలిండర్ బుక్ చేయగానే.. సదరు ఏజెన్సీకి వెంటనే పుష్ మెసేజ్ వెళ్లిపోతుంది. వారు అక్కడి నుంచి డెలివరీ బాయ్‌కి ఆ మెసేజ్‌ని చేరవేస్తారు. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ బుక్ అవుతుంది.. డెలివరీకి రంగం సిద్ధమవుతుంది. అరగంటలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గరిష్టంగా 2 గంటలలోపు ఫుల్ సిలిండర్‌ను అందిస్తారు. అందుకు గాను గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సర్వీసులను ప్రస్తుతం సింగిల్ సిలిండర్ ఉన్న ఇళ్లకే అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఈ తత్కాల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా దేశమంతటా, అందరు వినియోగదారులకు తత్కాల్ సేవలు అందివ్వనున్నారు. చదవండి: రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన -
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్
గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై పేటీఎం భారీ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు అందుబాటులో ఉంది. దేశంలో 14 కిలోల గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.808-850 వరకు ఉంది. అయితే పేటిఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ. 10 నుంచి రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. మీకు కనుక అదృష్టం ఉంటే గ్యాస్ ఉచితంగానే లభించవచ్చు. అయితే, ఈ ఆఫర్ మొదటి సారి పేటీఎం నుంచి గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. పేటీఎం ద్వారా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్ పొందాలంటే మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మొదట మీరు మీ మొబైల్ ఫోన్లో పేటీఎం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్, ఇండెన్ గ్యాస్ ఆప్షన్ లలో మీ డీలర్ షిప్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వంట గ్యాస్ ప్రొవైడర్, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ నంబర్లను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లావాదేవీల కోసం వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత 48 గంటలోపు స్క్రాచ్ కార్డు లభిస్తుంది. స్క్రాచ్ కార్డు ఓపెన్ చేసి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మొదటి సారి గ్యాస్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే అని మరిచిపోవద్దు. మీకు రూ.10 నుంచి రూ.800 వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావొచ్చు. మీరు స్క్రాచ్ కార్డును వారం రోజులోగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కార్డు ఎక్స్పైరీ అవుతుంది. -
7718955555
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: నవంబర్ 1 నుంచి ఇండేన్ గ్యాస్ వినియోగదారులు దేశంలో ఎక్కడ నుంచి అయినా 7718955555 నంబర్ ద్వారానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్ ఆయిల్ డీజీఎం (ఎల్పీజీ) ఎల్పీ ఫులిజిలే తెలిపారు. ఆయన విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డీలర్ల వద్ద నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ల నుంచి ఎస్ఎంఎస్ లేదా ఐవీఆర్ విధానంలో సిలిండర్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. మొబైల్ నంబర్లు నమోదు చేసుకోని వారు 16 అంకెల గ్యాస్ కనెక్షన్ నంబర్ నమోదు చేయడం ద్వారా బుక్ చేసుకోవాలన్నారు. అలాగే 75888 88824 నంబర్‌కు వాట్సాప్ ద్వారా రీఫిల్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు తెలిపారు. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా కూడా గ్యాస్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్ సేవలు పొందవచ్చన్నారు. -
మరో ఆధార్ డేటా లీక్ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ గోప్యతపై వినియోగదారుల్లో ఆందోళన కొనసాగుతుండగానే భారీ ఎత్తున ఆధార్ డేటా లీక్ అయిందన్న వార్త ఇపుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ గ్యాస్ (ఇండేన్) కంపెనీ వినియోగదారులకు షాకిచ్చే నివేదికను టెక్ క్రంచ్ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. టెక్ క్రంచ్. కాంం అందించిన నివేదిక ప్రకారం 67 లక్షల ఆధార్ సభ్యుల వివరాలు లీక్ అయ్యాయి. దేశీయ గ్యాస్ పంపిణీ కంపెనీ ఇండేన్ నుంచి ఆధార్ వినియోగదారులు ఫోన్ నెంబర్లు, చిరునామా, తదితర వివరాలు లీక్ అయ్యాయని టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు ఇండేన్ వెబ్సైట్ లోకి ఎవరైనా చొరబడి లాగిన్ వివరాలను తస్కరించడంతోపాటు, భారీ డాటాబేస్‌కు కూడా యాక్సెస్ సాధించవచ్చని పేర్కొంది. పేరు చెప్పడానికి ఇష్టపడని సెక్యూరిటీ పరిశోధకుడు డేటాబేస్‌ను కొనుగొన్నట్టు వెల్లడించింది. ఇలా ఇండేన్ కెందిన 11వేల డీలర్ల వద్ద, వినియోగదారుల ఆధార్ నెంబర్ సహా, ఇతర వ్యక్తిగత వివరాలను కనుగొన్నట్టు టెక్ క్రంచ్ నివేదించింది. మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)కి చెందిన వంటగ్యాస్ పంపిణీ సంస్థ ఇండేన్ గ్యాస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు లక్షలాది మంది కస్టమర్ల డేటా లీకైందని ఎథికల్ హ్యాకర్ ఎలియాట్ ఆల్డర్సన్ చెబుతున్నారు. స్థానిక డీలర్లు ఆథెంటికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్ నెంబర్లు లీక్ అయ్యాయని ఆయన వాదిస్తున్నారు. ఆధార్ డేటా లీక్ అంశాన్ని ఫిబ్రవరి 10న దీన్ని గుర్తించామని, ఇదే విషయాన్ని ఫిబ్రవరి 16న గ్యాస్ కంపెనీ దృష్టి కి తీసుకెళ్లామని తెలిపింది. అయితే కంపనీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దీన్నినేడు (ఫిబ్రవరి 19న బహిర్గతం చేసినట్టు చెప్పింది. అటు ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) కూడా ఎలాంటి స్పందన రాలేదని టెక్ క్రంచ్ స్పష్టం చేసింది. ఈ నివేదికపై అటు ఇండేన్ కంపెనీగానీ, ఇటు యుఐడీఏఐ గానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
పెనుకొండలో దొంగలు హల్చల్
అనంతపురం జిల్లాలోని పెనుకొండలో గత అర్థరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ, పలు ఫర్టిలైజర్స్ దుకాణాల్లో దొంగలు చోరికి యత్నించారు. అయితే వారికి అయా దుకాణాల్లో ఎటువంటి నగదు లభ్యం కాలేదు. దాంతో దొంగలు కోపంతో దుకాణాల్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఇండియాన్ గ్యాస్, ఫర్టిలైజర్స్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.