అనంతపురం జిల్లాలోని పెనుకొండలో గత అర్థరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు.
అనంతపురం జిల్లాలోని పెనుకొండలో గత అర్థరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ, పలు ఫర్టిలైజర్స్ దుకాణాల్లో దొంగలు చోరికి యత్నించారు. అయితే వారికి అయా దుకాణాల్లో ఎటువంటి నగదు లభ్యం కాలేదు. దాంతో దొంగలు కోపంతో దుకాణాల్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దీంతో ఇండియాన్ గ్యాస్, ఫర్టిలైజర్స్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.