ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉద్యోగులను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న భాస్కర్, ఫణి, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్‌లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కుందన్‌బాగ్‌లోని హైకోర్టు జడ్జి నివాసం వద్దకు వారిని తీసుకువచ్చారు. వారితో పాటు తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నివాస్ కూడా హాజరైయారు. ఇదిలావుండగా తమ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ ఉద్యోగులు కనిపించడంలేదంటూ సంస్థ డైరెక్టర్ అశోక్ కోర్టును ఆశ్రయించారు.