‘ఆధార్‌’తో నా డేటా బయటికి రాలేదు | No information was discovered about me on account of Aadhaar | Sakshi
Sakshi News home page

‘ఆధార్‌’తో నా డేటా బయటికి రాలేదు

Published Thu, Aug 9 2018 5:29 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

 No information was discovered about me on account of Aadhaar - Sakshi

న్యూఢిల్లీ: ‘ఆధార్‌ చాలెంజ్‌’తో తనకు సంబంధించిన సమాచారమేదీ బహిర్గతం కాలేదని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ స్పష్టంచేశారు. కీలకమైన విధానపర నిర్ణయాలను చర్చించేందుకు సోషల్‌ మీడియా తగిన వేదిక కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వివరాలు బయటపెట్టాలని సవాలు విసురుతూ శర్మ ఆధార్‌ సంఖ్యను వెల్లడించడం తెల్సిందే. దీంతో ఆయన ఆధార్‌నంబర్‌ సాయంతో కొందరు నెటిజన్లు శర్మ ఈ మెయిల్‌ సమాచారాన్ని సంపాదించారు. ట్రాయ్‌ చైర్మన్‌గా నేడు రిటైర్‌కానున్న శర్మ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్‌ లేకుండానే తెలుసుకోవచ్చు. ఆధార్‌ సవాలును నేనే విసిరినట్లు భావిస్తున్నారు. ఒకరు విసిరిన సవాలుకు స్పందించానంతే’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement