trai chairman rs sharma
-
ట్రాయ్ చైర్మన్‌గా వఘేలా
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ పి.డి. వఘేలా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం మూడేళ్ల పాటు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే దాకా (ఏది ముందైతే అది) ఉంటుంది. ప్రస్తుత చైర్మన్ ఆర్ఎస్ శర్మ పదవీకాలం సెప్టెంబర్ 30తో తీరిపోనుంది. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన వఘేలా ప్రస్తుతం ఫార్మా విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో వఘేలా కూడా ఉన్నారు. మరోవైపు, టెలికం రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పదవీ విరమణ చేయనున్న శర్మ తెలిపారు. సర్వీసులకు గట్టి డిమాండ్‌తో పాటు కొత్త మార్పులకు అనుగుణంగా సర్దుకుపోగలిగే సామర్థ్యం టెల్కోలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
ఆధార్ గోప్యతను కాపాడండి
న్యూఢిల్లీ: దమ్ముంటే తన ఆధార్‌ను దుర్వినియోగం చేయాలంటూ ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ గతంలో ఆధార్ నంబర్‌ను బయటకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు హ్యాకర్లు శర్మకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను బయటపెట్టారు. దీంతో ఆధార్ సమాచార గోప్యతపై పౌరులకు సూచనలు చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నిర్ణయించింది. ఇందులోభాగంగా పాన్, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డు తరహాలో కాకుండా ఆధార్ నంబర్ గోప్యతను కాపాడుకోవాలని యూఐడీఏఐ చెప్పనుంది. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో 12 అంకెల ఆధార్ నంబర్‌ను పంచుకోవడంపై హెచ్చరించనున్నట్లు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా ఆధార్ కార్డును వాడుకునేందుకు వీలుగా అనుమానాలను తీర్చడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ విషయంలో ప్రజలకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు, వాటి సమాధానాలను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. బయోమెట్రిక్స్, వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వంటి రక్షణ వ్యవస్థలు ఉన్న ఆధార్‌లో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. ట్రాయ్ చైర్మన్ శర్మ ఉదంతం నేపథ్యంలో 12 అంకెలున్న ఆధార్ నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని యూఐడీఏఐ ప్రజలను హెచ్చరించింది. -
‘ఆధార్’తో నా డేటా బయటికి రాలేదు
న్యూఢిల్లీ: ‘ఆధార్ చాలెంజ్’తో తనకు సంబంధించిన సమాచారమేదీ బహిర్గతం కాలేదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ స్పష్టంచేశారు. కీలకమైన విధానపర నిర్ణయాలను చర్చించేందుకు సోషల్ మీడియా తగిన వేదిక కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వివరాలు బయటపెట్టాలని సవాలు విసురుతూ శర్మ ఆధార్ సంఖ్యను వెల్లడించడం తెల్సిందే. దీంతో ఆయన ఆధార్‌నంబర్ సాయంతో కొందరు నెటిజన్లు శర్మ ఈ మెయిల్ సమాచారాన్ని సంపాదించారు. ట్రాయ్ చైర్మన్‌గా నేడు రిటైర్‌కానున్న శర్మ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్ లేకుండానే తెలుసుకోవచ్చు. ఆధార్ సవాలును నేనే విసిరినట్లు భావిస్తున్నారు. ఒకరు విసిరిన సవాలుకు స్పందించానంతే’ అని అన్నారు. -
ఆధార్’తో నా సమాచారం బయటికి రాలేదు: ఆర్ఎస్ శర్మ
న్యూఢిల్లీ: ‘ఆధార్ చాలెంజ్’తో తనకు సంబంధించిన సమాచారమేదీ బహిర్గతం కాలేదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. కీలకమైన విధానపర నిర్ణయాలను చర్చించేందుకు సోషల్ మీడియా తగిన వేదిక కాదని పేర్కొన్నారు. తన వివరాలు బయటపెట్టాలని సవాలు విసురుతూ శర్మ ఆధార్ సంఖ్యను వెల్లడించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఈ మెయిల్ సమాచారాన్ని సంపాదించినట్లు కొందరు నెటిజెన్లు ప్రకటించగా, అలాంటిదేం లేదని శర్మ కొట్టిపారేశారు. ట్రాయ్ చైర్మన్‌గా నేడు పదవీ విరమణ పొందనున్న శర్మ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆధార్ వల్ల నా వ్యక్తిగత సమాచారమేదీ బయటికి రాలేదు. వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్ లేకుండానే తెలుసుకోవచ్చు. ఆధార్ సవాలును నేనే విసిరినట్లు భావిస్తున్నారు. అది నిజం కాదు. ఒకరు విసిరిన సవాలుకు స్పందించానంతే’అని అన్నారు. -
‘ఆధార్’ షేర్ చేయకండి!
న్యూఢిల్లీ: ఆధార్ సంఖ్యను ఆన్లైన్లో, సోషల్ మీడియాలో బహిరంగంగా ఇతరులతో పంచుకోవద్దని, ఆధార్ సంఖ్య ఆధారంగా తమ వివరాలను వెల్లడించాలని సవాల్ చేయొద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) పౌరులకు సూచించింది. ఇతరుల ఆధార్ సంఖ్యతో లావాదేవీలు చేయడం చట్టవ్యతిరేకమని, దాన్ని నేరంగా పరిగణిస్తామంది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తన ఆధార్ సంఖ్యను బహిరంగంగా వెల్లడించి, దుర్వినియోగం చేయాలంటూ సవాల్ చేసిన విషయం, దాంతో స్పందించిన హ్యాకర్లు ఆయన బ్యాంక్ అకౌంట్ వివరాలు సహా పూర్తి సమాచారాన్ని సంగ్రహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూఐడీఏఐ ఈ సూచన చేసింది. -
ట్రాయ్ చైర్మన్‌కు హ్యాకర్ల షాక్
బెంగళూరు: దమ్ముంటే తన ఆధార్‌ను దుర్వినియోగం చేయాలని ట్విట్టర్లో సవాలు విసిరిన టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) చైర్మన్ ఆర్.ఎస్.శర్మకు ఎథికల్ హ్యాకర్లు మరోసారి షాకిచ్చారు. శర్మకు ఏయే బ్యాంకుల్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో బయటపెట్టిన హ్యాకర్లు.. రూ.1 చొప్పున ఆయన బ్యాంకు ఖాతాలోకి డిపాజిట్ చేశారు. ఈ చెల్లింపులను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా శర్మ గత మూడేళ్లుగా ఓ హిందుత్వ వెబ్‌సైట్‌కు ఎస్బీఐ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తున్న వివరాలను బయటపెట్టారు. లీలాధర్ ఆర్గానిక్స్ సంస్థ పేరుతో 2018, జూలై 2న సేంద్రీయ ఉత్పత్తుల్ని అమ్మిన విషయాన్ని సైతం శర్మ ఆధార్ కార్డు సాయంతో హ్యాకర్లు వెలుగులోకి తెచ్చారు. దీంతో హ్యాకర్లు ఇంటర్నెట్లో పోస్ట్చేసిన వివరాలు వైరల్‌గా మారిపోయాయి. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ సాయంతో భీమ్, పేటీమ్ యాప్‌ల ద్వారా వీరు శర్మ బ్యాంక్ అకౌంట్లోకి నగదును పంపారు. శ్రీకృష్ణ రిపోర్టుతో మొదలైన రగడ ఇటీవల శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికలో పౌరుల వ్యక్తిగత వివరాల పరిరక్షణకు ఆధార్ చట్టాన్ని సవరించాలని సూచించింది. దీంతో తెరపైకొచ్చిన శర్మ ఆధార్ వివరాలు అత్యంత సురక్షితమని స్పష్టం చేశారు. దమ్ముం టే తన ఆధార్ నంబర్ 7621 7768 2740ను దుర్వినియోగం చేసి చూపాలని సవాలు విసిరారు. దీంతో ఎథికల్ హ్యాకర్లు ఇలియట్ అల్డర్సన్, పుష్పేంద్ర సింగ్, అనివర్ అరవింద్, కరణ్ సైనీలు రంగంలోకి దిగారు. సింగ్‌కు సంబంధించిన ఈ–మెయిల్స్, అడ్రస్, ఫోన్ నంబర్లు, పాన్, పుట్టినరోజు, ఓటర్ ఐడీ, డీమ్యాట్ ఖాతా, ఎయిర్ఇండియా కేటాయించిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఐడీ సహా 14 వివరాలను బయటపెట్టారు. కానీ ఇవన్నీ గూగుల్‌లో లభ్యమవుతాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆదివారం చెప్పింది. దీంతో అప్పటికప్పుడు ఆ సంస్థ డేటాబేస్‌ను హ్యాక్ చేసిన పుష్పేంద్ర సింగ్.. శర్మ ఆధార్‌కు అనుసంధానమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ పేరు, కోడ్ తదితర వివరాలను బయటపెట్టి షాకిచ్చాడు. మరోవైపు శర్మకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, కొటక్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఖా తాలున్నట్లు హ్యాకర్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు హ్యాకర్లు శర్మ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి రూ.1 డిపాజిట్ చేశారు. -
ట్రాయ్ చైర్మన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ ట్విట్టర్ అకౌంట్ శనివారం హ్యాంకింగ్ కు గురైంది. శర్మ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఆయన గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ప్రకటన విడుదల చేసిన ట్రాయ్ అధికారులు.. మెసేజ్ లలో ఉన్న సారాంశంపై స్పందించొద్దని కోరారు. శర్మ ప్రస్తుతం అధికారిక పనుల మీద ఫిజి, ఆస్ట్రేలియాల పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. టెలికాం సంస్థల ఆర్ధిక విషయాలపై రెగ్యులేటరీ పాత్ర కాన్ఫరెన్స్ కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలిసింది.