
న్యూఢిల్లీ: బ్రిటిష్ రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) ఫేస్‌బుక్‌లో భారతీయుల వివరాలు తస్కరించిందన్న ఆరోపణలపై సీబీఐ బుధవారం ప్రాథమిక విచారణను ప్రారంభించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్‌బుక్ యూజర్ల వివరాలను తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. సీఏ అనుబంధ సంస్థ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీస్ భారత్‌లోనూ పనిచేసింది.