న్యూఢిల్లీ: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్‌ఎల్)లో భాగమైన సీడీఎస్‌ఎల్ వెంచర్స్ (సీవీఎల్) వ్యవస్థలో లోపాల కారణంగా కోట్ల కొద్దీ దేశీ ఇన్వెస్టర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు లీక్ అయ్యాయి. 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు 4.39 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా బైటికి వచ్చినట్లు సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ స్టార్టప్ సంస్థ సైబర్‌ఎక్స్9 వెల్లడించింది. ఈ వివరాలను ఇప్పటికే సైబర్ నేరగాళ్లు చోరీ చేసి ఉంటారని, సీడీఎస్‌ఎల్ వ్యవస్థలో డేటా భద్రతపై ప్రభుత్వం ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment