cyber breach
-
‘క్లిక్ చేస్తే ఖల్లాస్’.. ప్రపంచంలోనే భారీ డేటా చోరీ!
ఇంటర్నెట్ యూజర్లకు, అమెరికాతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరస్తులు షాకిచ్చారు. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన డేటాను చోరీ చేశారు. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 26 బిలియన్ల యూజర్ల డేటా చోరీకి గురైనట్లు డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థలకు చెందిన రీసెర్చర్లు నిర్ధారించారు. సైబర్ నేరస్తులు సేకరించిన డేటా మొత్తం ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే అన్ సెక్యూర్ పేజీలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా లీకైన ఈ డేటాను చైనా మెసేజింగ్ జెయింట్ టెన్సెంట్, వైబో, అడోబ్, కాన్వా, లింక్డిన్, ఎక్స్.కామ్, టెలిగ్రాం ద్వారా సేకరించినట్లు తమ పరిశోధనల్లో గుర్తించినట్లు రీసెర్చర్లు అన్నారు. ఇక యూజర్ల డేటాతో పాటు అమెరికా, ప్రపంచంలోని ఆయా దేశాల ప్రభుత్వ డేటా సైతం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లినట్లు తేల్చారు. డేటాతో ఏం చేస్తారంటే? ఇక సైబర్ నేరస్తులు( థ్రెట్ యాక్టర్స్) తస్కరించిన డేటాను ఉపయోగించి భారీ మొత్తంలో సైబర్ దాడులు, యూజర్ల బ్యాంక్ అకౌంట్లతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం, ఫిషింగ్ స్కామ్స్, కొన్ని సంస్థల్ని లేదంటే, కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకుని వాటిపై సైబర్ దాడులు చేసేందుకు వీలుగా ఉపయోగిస్తారని రీసెర్చర్లు వెల్లడించారు. ఆ ధీమా వద్దు అయితే, డేటా చోరీతో సైబర్ నేరగాళ్లు ఏమి చేస్తారులే’ అనే ధీమాతో కాకుండా దొంగిలించిన డేటాతో ఏం చేయొచ్చు? ఒకవేళ వినియోగిస్తే వాటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎస్ఈటీ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్మూర్ అన్నారు. ఫోన్, మెయిల్స్, వాట్సాప్ ఆడియోకాల్స్ తో పాటు ఇతర అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని, అలాంటి లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. గతాన్ని గుర్తు చేసిన రీసెర్చర్లు ఈ సందర్భంగా ఇదే తరహాలో సైబర్ నేరస్తులు 2019లో వెరిఫికేషన్.ఐఓ తయారు చేసిన ఎలాంటి భద్రత లేని డేటాబేస్ నుంచి దాదాపు వన్ బిలియన్ రికార్డులు డేటా లీకైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో, ఇదే అతిపెద్ద, అత్యంత హానికరమైన లీకేజీల్లో ఒకటిగా పేరొందింది. ఈ డేటా చౌర్యం మైస్పేస్ (360 మిలియన్లు), ట్విటర్ (281 మిలియన్లు), లింక్డిన్ (251 మిలియన్లు), అడల్ట్ఫ్రెండ్ఫైండర్ (220 మిలియన్లు) వంటి సోషల్ నెట్ వర్క్ యూజర్లదని డిస్కవరీ, సైబర్ న్యూస్ రీసెర్చర్లు స్పష్టం చేశారు. -
యాహూ వెల్లడించిన షాకింగ్ న్యూస్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రకటించింది. యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. ఈ సమాచారాన్ని మొత్తాన్నీ కంపెనీ నెట్ వర్క్ నుంచి 2014లో దొంగిలించారని ఒక ప్రకటనలో తెలిపారు. యాహూ ఆన్ లైన్ ఖాతాదారులు తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని యాహూ ఒక ప్రకటనలో కోరింది. భద్రతా ప్రశ్నలకు సమాధానాలివ్వాలని సూచించింది. అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయొద్దని, డోన్ లోడ్లు చేయొద్దని హెచ్చరించింది. పేర్లు, ఈ మెయిల్ చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు, పాస్‌వర్డ్‌లతో పాటు ఎన్‌క్రిప్ట్, అన్ ఎన్క్రిప్డ్ ప్రశ్నలు, సమాధానాలు కూడా హ్యాకింగ్‌కు గురైన వాటిలో ఉన్నాయని బాబ్ లార్డ్ చెప్పారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అని ఆరోపించిన ఆయన, హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే విచారణలో వెల్లడైన సమాచారం మేరకు.. హ్యాకింగ్‌కు గురైన వాటిలో అన్ప్రొటెక్టెడ్ పాస్వర్డ్లు, పేమెంట్ కార్డ్ డాటా, బ్యాంకు అకౌంట్ సమాచారం తదితరాలు లేవని స్పష్టం చేశారు. పేమెంట్ కార్డ్ డేటా, బ్యాంక్ అకౌంటులకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకింగ్‌కు గురైన సిస్టంలో భద్ర పరచలేదని చెప్పారు. హ్యాకింగ్ చేసిన వారు యాహూ నెట్ వర్క్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్న వారు కాదని తమ విచారణలో వెల్లడైందన్నారు. మరోవైపు ఇదే అతి పెద్ద సైబర్ ఉల్లంఘనగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే 2014 నుంచి పాస్ వర్డ్ లను మార్చని యూజర్లను మార్చుకోవాల్సిందిగా కోరుతోందని షేప్ సెక్యూరిటీ అధికారి తెలిపారు. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ లో ఆధునిక ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించే అవకాశ ఉందనీ, ఈనేపథ్యంలో 4.8 బిలియన్ డాలర్ల యాహూ వెరిజోన్ కీలక అమ్మకంపై ప్రభావితం చేసే అవకాశం ఉందని మరో టెక్ నిపుణుడు హెచ్చరిచారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్ల ఈ మెయిల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని, హ్యాకర్లు జీమెయిల్, హాట్ మెయిల్, యాహూ అకౌంట్లు హ్యాక్ చేసి పాస్ వర్డ్స్, ఇతర సమాచారం దొంగిలించారని, ఈ సమాచారాన్ని రష్యాలోని క్రిమినల్ అండర్ వరల్డ్‌కు విక్రయించినట్లుగా గతంలో అందోళను చెలరేగిన సంగతి తెలిసిందే.