భారత సంతతికి చెందిన ట్విటర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ మరోసారి టెక్ వ్యాపార ప్రపంచంలో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. మస్క్ బాస్‌గా ట్విటర్‌లోకి అడుగు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలో ఆ సంస్థ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత పరాగ్ అగర్వాల్ పేరు ఎక్కడా వినపడలేదు. అయితే ఇన్నాళ్లకు పరాగ్ అగర్వాల్ పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నట్లు?
పరాగ్ అగర్వాల్ చాట్‌జీపీటీ తరహాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇన్వెస్టర్ల నుంచి 30 మిలియన్ డాలర్లల నిధులను సేకరించినట్లు తెలుస్తోంది.
ట్విటర్ మాజీ సీఈఓ నెలకొల్పబోయే వెంచర్లో గతంలో చాట్‌జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ఏఐకి అండగా నిలిచిన ఖోస్లా వెంచర్స్ పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఖోస్లో వెంచర్స్‌తో పాటు ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ కేపిటల్‌లు సైతం పెట్టుబడులు పెట్టాయి.
పరాగ్ స్థాపించనున్న కంపెనీ పేరేంటి ?, ఎలాంటి ప్రొడక్ట్‌ను తయారు చేయనున్నారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, పరాగ్ స్టార్టప్‌తో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం చాట్‌జీపీటీ తరహాలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌పై పనిచేస్తున్నట్లు తెలిపారు.
పరాగ్ తొలగించడానికి కారణం
ఎలాన్ మస్క్ రూ.3.37లక్షల కోట్లు వెచ్చించి మరి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అనంతరం బాస్ అడుగు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలో ట్విటర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను తొలగించారు.
ఆ తర్వాత కొద్ది కాలానికి పరాగ్ చాలా మంచి వ్యక్తి.. సీఈఓగా కొనసాగాలంటే అదొక్కటి ఉంటే సరిపోదు. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పరాగ్ అగర్వాల్ అందుకు సరిపోరు’ అని ఎలన్ మస్క్ అన్నారట. ఇదే విషయాన్ని ఎలన్ మస్క్‌పై బయోగ్రఫీ రాసిన రైటర్ వాల్టర్ ఇసాక్సన్ రాసిన ఎలాన్‌మస్క్ పుస్తకంలో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment