cadbury
-
వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా..
121 ఏళ్ల పురాతన క్యాడ్బరీ చాక్లెట్ వేలానికి వెళుతోంది. చాలామందికి క్యాడ్బరీ కంపెనీ చాలా పురాతనమైనదనే విషయం తెలియదు. 1902లో ఒక చిన్నారికి స్కూలులో ఈ క్యాడ్బరీ చాక్లెట్ ఇవ్వగా, ఆమె జాగ్రత్తగా దానిని దాచిపెట్టుకుంది. విశేష సమయాల కోసం ప్రత్యేకంగా.. వివరాల్లోకి వెళితే 1902లో ఇంగ్లండ్ కింగ్ ఎడ్వర్డ్-VII, క్వీన్ అలగ్జాండ్రాల పట్టాభిషేకం సందర్భంగా ఈ ప్రత్యేకమైన చాక్లెట్ తయారుచేశారు. నాటి రోజుల్లో ఇంత ఖరీదైన చాక్లెట్లు పిల్లలకు అంత సులభంగా లభించేవికాదు. నాటి రోజుల్లో చదువుకుంటున్న 9 ఏళ్ల మేరీ ఎన్ బ్లాక్మోర్కి లభ్యమైన ఈ చాక్లెట్‌ను తినకుండా, మహారాజుల పట్టాభిషేకానికి గుర్తుగా జాగ్రత్తగా దాచుకుంది. దశాబ్దాల తరబడి ఆ కుటుంబం దగ్గరే.. ఈ వెనీలా చాక్లెట్ మేరీ కుటుంబం దగ్గర కొన్ని దశాబ్ధాలుగా భద్రంగా ఉంది. అయితే ఇప్పుడు మేరీ మనుమరాలు దీనిని వేలం వేసేందుకు నిర్ణయించుకున్నారు. మేరీ మనుమరాలు జీన్ థమ్సన్కు ఇప్పుడు 72 సంవత్సరాలు. జీన్ ఈ చాక్లెట్‌ను తీసుకుని హెన్సన్‌కు చెందిన వేలందారుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు ఈ చాక్లెట్ అస్తిత్వాన్ని పరిశీలించారు. ‘చాక్లెట్‌ను చిన్నారి తాకనైనా లేదు’ హెన్సన్ వేలందారులలో సభ్యుడైన మార్వెన్ ఫెయర్లీ మాట్లాడుతూ ‘ఆ సమయంలో ఇది ఎంతో అమూల్యమైన కానుక. ఈ చాక్లెట్ చిన్నారులకు అంత సులభంగా లభ్యమయ్యేది కాదు. ఇది ఎంతో ప్రత్యేకమైనది కావడంతోనే నాడు ఆ చిన్నారి కనీసం తాకకుండా కూడా భద్రపరిచింది’ అని అన్నారు. కాగా ఈ చాక్లెట్ డబ్బాపై కింగ్, క్వీన్ల చిత్రాలు ముద్రితమై ఉన్నాయి. వేలంలో లభించనున్న అత్యధిక మొత్తం ఈ చాక్లెట్ వేలం హెన్సన్లో జరగనుంది. వేలంలో దీని ధర కనీసంగా £100 నుంచి £150 (సుమారు రూ. 16 వేలు)వరకూ పలకనుందని అంచనా. ఇంతకు మంచిన ధర కూడా పలకవచ్చని, ఎందుకంటే ఒక్కోసారి చాలామంది చారిత్రాత్మక వస్తువులకు అధ్యధిక విలువ ఇస్తుంటారని మార్వెన్ ఫెయర్లీ పేర్కొన్నారు. డబ్బా తెరవగానే సువాసనలు రాజ కుటుంబానికి చెందిన పురాతన వస్తువులపై అందరికీ అమితమైన ఆసక్తి ఉంటుంది. ఈ 121 ఏళ్ల పురాతన చాక్లెట్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. తినేందుకు ఏమాత్రం యోగ్యమైనది కాదు. దీనిని ఎవరూ తినలేరు కూడా. అయినా ఈ టిన్ తెరవగానే సువాసనలు వస్తున్నాయని ఫెయర్లీ తెలిపారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకుంటే.. -
‘క్యాడ్ బరీ సిగ్గుపడాలి.. మా మోదీనే అవమానిస్తారా’!
ప్రముఖ చాక్లెట్ తయారీ దిగ్గజం క్యాడ్బరీ ఒకేసారి రెండు వివాదాల్లో చిక్కుకుంది!. జంతువుల నుంచి సేకరించిన జెలటిన్ అనే ప్రొటీన్‌తో చాక్లెట్‌ను తయారు చేస్తుందని.. ఆ సంస్థను భారత్‌లో బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపించాయి. దీంతో ట్విటర్లో ‘బాయ్‌కాట్ క్యాడ్బరీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘మంచిని ఆశిద్దాం తియ్యని వేడుక చేసుకుందాం’ అంటూ దీపావళి సందర్భంగా క్యాడ్బరి సంస్థ ఓ చాక్లెట్ యాడ్‌ను ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ యాడ్ వివాదంగా మారింది. ఆ యాడ్‌లో సంభాషణలు ఇలా జరిగాయి. డాక్టర్: దీపావళి సందర్భంగా ఓ డాక్టర్ ప్రమిదెలు అమ్మే వ్యక్తి కోసం అంగట్లో చూస్తుంటాడు. అదే సమయంలో ప్రమిదెలు అమ్మే వ్యక్తి డాక్టర్‌కు తారసపడడంతో దామోదర్ అని పిలుస్తాడు. ఆ పిలుపుతో ప్రమిదెలు అమ్మే వ్యాపారి : డాక్టర్ సార్ డాక్టర్: ఎక్కడున్నావ్.. రెండు రోజుల నుంచి నీ కోసం చూస్తున్నాను. వ్యాపారీ: అయినా మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నార్ సార్. మీకు ఏమైనా కావాలా? అని అడుగుతాడు. డాక్టర్: కాదు, కాదు నేను మీకు ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నా. అంటూ తన బ్యాగ్‌లో నుంచి క్యాడ్బరీ చాక్లెట్ ప్యాకెట్‌ను వ్యాపారికి అందిస్తాడు. వ్యాపారీ: అందుకు కృతజ్ఞతగా మీకు దీపావళి శుభాకాంక్షలు అని రిప్లయి ఇస్తారు. అంతటితో యాడ్ పూర్తవుతుంది. ఇప్పుడీ యాప్‌పై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి అభ్యంత్రం వ్యక్తం చేశారు. తోపుడు బండిపై ప్రమిదెలు విక్రయించే వ్యక్తి పేరు దామోదర్. ఆ యాడ్‌లో దామోదర్ అనే పేరును వినియోగించడంపై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మండిపడ్డారు. ‘‘మీరు క్యాడ్బరీ చాక్లెట్ యాడ్‌ను పరిశీలించారా? షాపు లేని ఓ నిరు పేద ల్యాంప్ విక్రేత పేరు దామోదర్. ప్రధాని మోదీ తండ్రి పేరును తక్కువ చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ అంశంలో క్యాడ్ బరీ సంస్థ సిగ్గుపడాలి. బాయ్ కాట్ క్యాడ్ బరీ’’ అంటూ సాధ్వి ప్రాచి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. బాయ్‌కాట్ క్యాడ్బరీ అంటూ వరుసగా రీట్వీట్లు చేస్తున్నారు. Have you carefully observed Cadbury chocolate's advertisement on TV channels? The shopless poor lamp seller is Damodar. This is done to show someone with PM Narendra Modi's father's name in poor light. Chaiwale ka baap diyewala. Shame on cadbury Company #BoycottCadbury pic.twitter.com/QvzbmOMcX2 — Dr. Prachi Sadhvi (@Sadhvi_prachi) October 30, 2022 -
పోలీసులే నివ్వెరపోయేలా క్యాడ్బరీ గోడౌన్లో భారీ దోపీడీ
లక్నో: యూపీ,లక్నోలోని చిన్హాట్ ప్రాంతంలో భారీ చోరి జరిగింది. ప్రముఖ బ్రాండ్ క్యాడ్‌బరీకి చెందిన దాదాపు 150 కార్టన్ల చాక్లెట్ బార్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. అందరూ స్వాతంతత్ర్య దినోత్సవ సంబరాల్లో ఉంటే దొంగలు మాత్రం తమ పని తాము చేసుకు పోయారు. ట్రక్కులతో వచ్చి మరీ ఈ చోరీకి పాల్పడ్డారు. చోరీ అయిన చాక్లెట్ల విలువు 17 లక్షల రూపాయలని అంచనా వేశారు. యూపీ రాజధాని పోలీసులంతా ఒకవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీవీఐపీల భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.ఇదే అదునుగా భావించిన దుండగులు ఈ చోరీకి తెగబడ్డారు. అంతే కాదు సాక్ష్యాలు లేకుండా, అక్కడున్న సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా ఎత్తుకు పోవడంతో పోలీసులు సైతం హతాశులయ్యారు. బ్రాండ్ పంపిణీదారు, వ్యాపారవేత్త రాజేంద్ర సింగ్ సిద్ధు ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 7 లక్షల విలువైన చాక్లెట్లున్న 150 డబ్బాలు, కొన్ని బిస్కెట్ల పెట్టెలు కూడా చోరీ అయ్యాయని సిద్ధు పోలీసులకు తెలిపారు. రెండ్రోజుల క్రితమే స్టాక్ వచ్చిందని, నగరంలోని చిల్లర వ్యాపారులకు వీటిని పంపిణీ చేయాల్సి ఉందని వాపోయారు. దీనిపై ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Lucknow, UP | Chocolates worth Rs 17 lakh stolen from a Cadbury godown We've filed an FIR in the Chinhat police station. If anyone has any input, please guide us: Rajendra Singh Sidhu, Cadbury distributor pic.twitter.com/u2JrOSKPtW — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 17, 2022 -
చాక్లెట్లో ‘బీఫ్’ ఆరోపణలు.. క్యాడ్బరి క్లారిటీ
Cadbury Beef Controversy: ‘మంచిని ఆశిద్దాం తియ్యని వేడుక చేసుకుందాం' అంటూ అలరించే క్యాడ్ బరి చాక్లెట్ యాడ్ గురించి మనందరికి తెలిసిందే. ఆ యాడ్ చూసిన వారెవరైనా వెంటనే ఆ చాక్లెట్ కొనుక్కొని తినేయాలనే అనుకుంటారు. అందుకే ఆ చాక్లెట్ అంటే ఇష్టపడని వారుండరు. బాధైనా, సంతోషమైనా ఆ చాక్లెట్ తింటూ ఆ ఫీలింగ్‌ను షేర్ చేసుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఇంత పాపులర్ అయిన ఈ చాక్లెట్‌ను భారత్‌లో బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం క్యాడ్బరీని జంతువుల నుంచి సేకరించిన జెలటిన్ అనే ప్రొటీన్‌తో తయారు చేస్తున్నరంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Is this true @CadburyUK? If yes, Cadbury deserves to be sued for forcing Hindus to consume halaal certified beef products Our ancestors &Gurus sacrificed their lives but didn't accept eating beef. But post "independence"rulers have allowed our Dharma to be violated with impunity pic.twitter.com/Ub9hJmG8gO — Madhu Purnima Kishwar (@madhukishwar) July 17, 2021 దీంతో పలువురు నెటిజన్లు యూకే క్యాడ్ బరీ సంస్థపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే నిజమైతే హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను తినిపించినందుకు క్యాడ్ బరీపై కేసు పెట్టాలని ట్వీట్ చేశారు. బ్రిటిష్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టారు. దీంతో ఈ వివాదంపై క్యాడ్బరీ.. ఆకు పచ్చ చుక్క గుర్తును ఉటంకిస్తూ క్లారిటీ ఇచ్చింది. మాండెలెజ్ / క్యాడ్బరీ ఉత్పత్తులు ప్యూర్ వెజిటేరియన్ అని తెలిపింది. అంతేకాదు క్యాడ్ బరీ చాక్లెట్ ర్యాపర్ పై ఉన్న ఆకు పచ్చ గుర్తు వెజిటేరియన్ అన్న విషయాన్ని సూచిస్తుందంటూ క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. pic.twitter.com/798qgPozsF — Cadbury Dairy Milk (@DairyMilkIn) July 18, 2021 చదవండి : మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి -
క్యాడ్బరీ ఇండియాకు సీబీఐ భారీ షాక్
సాక్షి, ముంబై: ప్రముఖ చాక్లెట్ సంస్థ క్యాడ్బరీ ఇండియాకు భారీ షాక్ తగిలింది. తాజాగా క్యాడ్బరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అవినీతి, మోసం ఆరోపణలతో కేసు నమోదు చేసింది. సంస్థకు చెందిన హరియాణా, హిమాచల్ ప్రదేశ్‌లోని 10 ప్రదేశాలలో బుధవారం సీబీఐ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం దీనిని మోండెలెజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలుస్తారు. అవినీతి, వాస్తవాలను తప్పుగా చూపించడం, రికార్డుల తారుమారు లాంటి ఆరోపణలను సీబీఐ నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డిలో ప్రాంత ఆధారిత పన్ను ప్రయోజనాలను పొందేందుకు వాస్తవాలను తప్పుగా చూపి అవినీతికి పాల్పడిందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. 2009-11 మధ్య క్యాడ్బరీ కేంద్ర ఎక్సైజ్ అధికారులతో కుట్ర పన్నిందని, 5 స్టార్, జెమ్స్ చాక్లెట్‌ను తయారు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లో తన కొత్త యూనిట్ కోసం 241 కోట్ల రూపాయల పన్ను ప్రయోజనాలను పొందారని సీబీఐ ప్రధాన ఆరోపణ. పన్ను మినహాయింపుల కోసం ఎగ్జిక్యూటివ్ బోర్డులోని కొందరు సభ్యులు, ముఖ్య నిర్వాహకులతో కలిసి, రికార్డులను మార్చాలని, మధ్యవర్తుల ద్వారా లంచాలు ఇవ్వడంతోపాటు ఆధారాలను కప్పిపుచ్చారనేది తమ అంతర్గత దర్యాప్తులో బయటపడిందని తెలిపింది. ఇద్దరు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు నిర్మల్ సింగ్, జస్ ప్రీత్ కౌర్ సహా అప్పటి క్యాడ్బరీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ కంప్లైయన్స్) విక్రమ్ అరోరా, దాని డైరెక్టర్లు రాజేష్ గార్గ్, జైల్‌బాయ్ ఫిలిప్స్ సహా మొత్తం 12 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. పన్ను ప్రయోజనాలు పొందటానికి అధికారులకు లంచాలు, తప్పుడు సమాచారం అందించిందని తెలిపింది. ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని తెలిసినా, మోసపూరితంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. అయితే.. దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసుకు సంబంధించి తమకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచార అందలేదని మోండెలెజ్ ఇండియా ప్రతిధి తెలిపారు. -
బం చిక్ బం చెయ్యి యోగా
బం చిక్ బం యోగా శునకానికి కూడా మంచిదేగా..ఏమిటీ పాట అనుకుంటున్నారా? ఇది చెన్నై చిన్నది త్రిష ఆలోచన అండీ. శునకాలంటే నటి త్రిషకు ఎనలేని ప్రేమ అన్న విషయం తెలిసిందే. ఎక్కడనైనా శునకం దీన స్థితిలో కనిపిస్తే చాలు వెంటనే దాన్ని తన వెంట తీసుకొచ్చి పెంచేసుకుంటారీ బ్యూటీ. అలా చాలా శునకాలనే పెంచుకుంటున్నారు. అంతే కాదు తన అభిమానులకు ఇలాంటి సలహానే ఇస్తుంటారు. కాగా పెటా సంస్థకు ప్రచారకర్తగానూ పని చేసిన త్రిషకు ఈ మధ్య జల్లికట్టు పోరాట వ్యవహారంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో తనకూ పెటాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏకంగా ట్విట్టర్ నుంచే వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొంత కాలానికి మళ్లీ ట్విట్టర్‌ను ఓపెన్ చేసిన త్రిష యోగాసనాలు మనుషులకే కాదు శునకాలకు అవసరం అనేలా వాటికి ఆసనాలు నేర్పిస్తున్నారు. తాజాగా తన పెట్టీ డాగ్ ‘క్యాడ్బెరీ’కి యోగాసనాలు నేర్పిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో వెల్లడిచేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రిష యోగాలో నిపుణురాలు. ఆ యోగాలను తన పెట్టీ శునకాలకు నేర్పిస్తున్నారట. తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన క్యాడ్బరీ డాగ్‌కు నేర్పిస్తున్న యోగాసనానికి అప్‌వర్డ్ డాగీ ఆసన అని పేరు పెట్టారు. ఏమిటీ త్రిష శునక ప్రేమ ఎంత గాఢమో అనిపిస్తుందా‘ -
శ్రీసిటీలో క్యాడ్బరీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘క్యాడ్బరీ’ బ్రాండ్ నేమ్‌తో చాక్లెట్స్‌ను ఉత్పత్తి చేస్తున్న మాంటెజ్ ఆసియా పసిఫిక్‌లోనే అతిపెద్ద తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సెజ్‌లో 134 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో క్యాడ్బరీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, క్యాడ్బరీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ మను ఆనంద్ సంతకం చేశారు. తదనంతరం లాంఛనంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మను ఆనంద్ మాట్లాడుతూ ఇది దేశంలో ఏడవ తయారీ కేంద్రమని, 2.50 లక్షల టన్నుల సామర్థ్యంగల ఈ ప్రాజెక్టును 2020కి నాలుగు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశ యూనిట్ 2015 మధ్య నాటికి అందుబాటులోకి వస్తుందని, ఇందుకోసం రూ.1,000 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో క్యాడ్బరీ బ్రాండ్ పేరుమీద అయిదు రకాల ఉత్పత్తులు అందిస్తున్నామని, కాని ఈ యూనిట్ మొదటి దశలో చాక్లెట్స్పైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. చాక్లెట్స్కు ప్రధానముడిసరుకైన ‘కోకా’కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 6,000 మంది రైతులతో కాంట్రాక్టింగ్ పద్ధతిలో కోకా సాగును చేపట్టినట్లు తెలిపారు. నాలుగున్నర లక్షలమంది రైతులకు ఉపయోగం క్యాడ్బరీ చాక్లెట్ తయారీ కేంద్రానికి అవసరమైన పాలు, పంచదార సరఫరా చేయడం ద్వారా నాలుగున్నర లక్షలమంది రైతులు నేరుగా ప్రయోజనం పొందనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే రోజుకి పదిలక్షల లీటర్ల పాలు, 100 టన్నుల పంచదార అవసరమవుతుందన్నారు. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చినట్లు కిరణ్ కుమార్ తెలిపారు. గతేడాది రాష్ట్రం ఎదుర్కొన్న విద్యుత్ సంక్షోభం ఈ ఏడాది నుంచి ఉండదని రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ముఖ్యమంత్రి అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతా రెడ్డి మాట్లాడుతూ త్వరలో మెదక్ జిల్లాలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.