బం చిక్‌ బం చెయ్యి యోగా | 'Trisha' with her pet 'Cadbury Junior'! | Sakshi
Sakshi News home page

బం చిక్‌ బం చెయ్యి యోగా

Published Mon, Jun 12 2017 3:27 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

బం చిక్‌ బం చెయ్యి యోగా - Sakshi

బం చిక్‌ బం చెయ్యి యోగా

బం చిక్‌ బం యోగా శునకానికి కూడా మంచిదేగా..ఏమిటీ పాట అనుకుంటున్నారా? ఇది చెన్నై చిన్నది త్రిష ఆలోచన అండీ. శునకాలంటే నటి త్రిషకు ఎనలేని ప్రేమ అన్న విషయం తెలిసిందే. ఎక్కడనైనా శునకం దీన స్థితిలో కనిపిస్తే చాలు వెంటనే దాన్ని తన వెంట తీసుకొచ్చి పెంచేసుకుంటారీ బ్యూటీ. అలా చాలా శునకాలనే పెంచుకుంటున్నారు. అంతే కాదు తన అభిమానులకు ఇలాంటి సలహానే ఇస్తుంటారు. కాగా పెటా సంస్థకు ప్రచారకర్తగానూ పని చేసిన త్రిషకు ఈ మధ్య జల్లికట్టు పోరాట వ్యవహారంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో తనకూ పెటాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏకంగా ట్విట్టర్‌ నుంచే వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొంత కాలానికి మళ్లీ ట్విట్టర్‌ను ఓపెన్‌ చేసిన త్రిష యోగాసనాలు మనుషులకే కాదు శునకాలకు అవసరం అనేలా వాటికి ఆసనాలు నేర్పిస్తున్నారు.

 తాజాగా తన పెట్టీ డాగ్‌ ‘క్యాడ్‌బెరీ’కి యోగాసనాలు నేర్పిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో వెల్లడిచేశారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. త్రిష యోగాలో నిపుణురాలు. ఆ యోగాలను తన పెట్టీ శునకాలకు నేర్పిస్తున్నారట. తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన క్యాడ్‌బరీ డాగ్‌కు నేర్పిస్తున్న యోగాసనానికి అప్‌వర్డ్‌ డాగీ ఆసన అని పేరు పెట్టారు. ఏమిటీ త్రిష శునక ప్రేమ ఎంత గాఢమో అనిపిస్తుందా‘

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement