121-year-old Cadbury chocolates to be sold at auction - Sakshi
Sakshi News home page

వేలానికి 121 ఏళ్ల క్యాడ్‌బరీ చాక్లెట్‌.. నాటి తీయని వేడుకకు గుర్తుగా..

Published Mon, Jul 17 2023 8:53 AM | Last Updated on Mon, Jul 17 2023 9:14 AM

121 year old cadbury chocolates to be sold auction - Sakshi

121 ఏళ్ల పురాతన క్యాడ్‌బరీ చాక్లెట్‌ వేలానికి వెళుతోంది. చాలామందికి క్యాడ్‌బరీ కంపెనీ చాలా పురాతనమైనదనే విషయం తెలియదు. 1902లో ఒక చిన్నారికి స్కూలులో ఈ క్యాడ్‌బరీ చాక్లెట్‌ ఇవ్వగా, ఆమె జాగ్రత్తగా దానిని దాచిపెట్టుకుంది. 

విశేష సమయాల కోసం ప్రత్యేకంగా..
వివరాల్లోకి వెళితే 1902లో ఇంగ్లండ్‌ కింగ్‌ ఎడ్వర్డ్‌-VII, క్వీన్‌ అలగ్జాండ్రాల పట్టాభిషేకం సందర్భంగా ఈ ప్రత్యేకమైన చాక్లెట్‌ తయారుచేశారు. నాటి రోజుల్లో ఇంత ఖరీదైన చాక్లెట్లు పిల్లలకు అంత సులభంగా లభించేవికాదు. నాటి రోజుల్లో చదువుకుంటున్న 9 ఏళ్ల మేరీ ఎన్‌ బ్లాక్‌మోర్‌కి లభ్యమైన ఈ చాక్లెట్‌ను తినకుండా, మహారాజుల పట్టాభిషేకానికి గుర్తుగా జాగ్రత్తగా దాచుకుంది. 

దశాబ్దాల తరబడి ఆ కుటుంబం దగ్గరే..
ఈ వెనీలా చాక్లెట్‌ మేరీ కుటుంబం దగ్గర కొన్ని దశాబ్ధాలుగా భద్రంగా ఉంది. అయితే ఇప్పుడు మేరీ మనుమరాలు దీనిని వేలం వేసేందుకు నిర్ణయించుకున్నారు. మేరీ మనుమరాలు జీన్‌ థమ్సన్‌కు ఇప్పుడు 72 సంవత్సరాలు. జీన్‌ ఈ చాక్లెట్‌ను తీసుకుని హెన్సన్‌కు చెందిన వేలందారుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు ఈ చాక్లెట్‌ అస్తిత్వాన్ని పరిశీలించారు. 

‘చాక్లెట్‌ను చిన్నారి తాకనైనా లేదు’
హెన్సన్‌ వేలందారులలో సభ్యుడైన మార్వెన్‌ ఫెయర్లీ మాట్లాడుతూ ‘ఆ సమయంలో ఇది ఎంతో అమూల్యమైన కానుక. ఈ చాక్లెట్‌ చిన్నారులకు అంత సులభంగా లభ్యమయ్యేది కాదు. ఇది ఎంతో ప్రత్యేకమైనది కావడంతోనే నాడు ఆ చిన్నారి కనీసం తాకకుండా కూడా భద్రపరిచింది’ అని అన్నారు. కాగా ఈ చాక్లెట్‌ డబ్బాపై కింగ్‌, క్వీన్‌ల చిత్రాలు ముద్రితమై ఉన్నాయి. 

వేలంలో లభించనున్న అత్యధిక మొత్తం
ఈ చాక్లెట్‌ వేలం హెన్సన్‌లో జరగనుంది. వేలంలో దీని ధర కనీసంగా £100 నుంచి £150 (సుమారు రూ. 16 వేలు)వరకూ పలకనుందని అంచనా. ఇంతకు మంచిన ధర కూడా పలకవచ్చని, ఎందుకంటే ఒక్కోసారి చాలామంది చారిత్రాత్మక వస్తువులకు అధ్యధిక విలువ ఇస్తుంటారని మార్వెన్‌ ఫెయర్లీ  పేర్కొన్నారు. 

డబ్బా తెరవగానే సువాసనలు
రాజ కుటుంబానికి చెందిన పురాతన వస్తువులపై అందరికీ అమితమైన ఆసక్తి ఉంటుంది. ఈ 121 ఏళ్ల పురాతన చాక్లెట్‌ ఎప్పుడో ఎక్స్‌పైర్‌ అయిపోయింది. తినేందుకు ఏమాత్రం యోగ్యమైనది కాదు. దీనిని ఎవరూ తినలేరు కూడా. అయినా ఈ టిన్‌ తెరవగానే సువాసనలు వస్తున్నాయని ఫెయర్లీ తెలిపారు.
ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకుంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement