Chocklate
-
మొక్కజొన్న పిండితో బిస్కెట్లు.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
కార్న్ – చాక్లెట్ కుకీస్ తయారీకి కావల్సినవి: బటర్ – 125 గ్రాములు, పంచదార – 150 గ్రాములు, నూనె – 80 మిల్లీ లీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత, వనిలిన్ పౌడర్ – పావు టీ స్పూన్(మార్కెట్లో దొరుకుతుంది), మొక్కజొన్న పిండి – 80 గ్రాములు శనగపిండి – 350 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 6 గ్రాములు తయారీ విధానమిలా: ►ముందుగా బటర్, పంచదార, నూనె వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా కలుపుకోవాలి. ► అందులో గుడ్లు, ఉప్పు, మొక్కజొన్న పిండి వేసుకుని మళ్లీ కలుపుకోవాలి. ► అనంతరం వనిలిన్ పౌడర్, శనగపిండి, బేకింగ్ పౌడర్ వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ► తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్‌లో ఉండ చేసుకుని.. దాన్ని బిస్కట్లా ఒత్తుకుని.. పైభాగంలో నచ్చిన షేప్‌ని ప్రింట్ చేసి.. బేక్ చేసుకోవాలి. ► అభిరుచిని బట్టి రెండేసి కుకీస్ తీసుకుని.. మధ్యలో చాక్లెట్ క్రీమ్ పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా..
121 ఏళ్ల పురాతన క్యాడ్బరీ చాక్లెట్ వేలానికి వెళుతోంది. చాలామందికి క్యాడ్బరీ కంపెనీ చాలా పురాతనమైనదనే విషయం తెలియదు. 1902లో ఒక చిన్నారికి స్కూలులో ఈ క్యాడ్బరీ చాక్లెట్ ఇవ్వగా, ఆమె జాగ్రత్తగా దానిని దాచిపెట్టుకుంది. విశేష సమయాల కోసం ప్రత్యేకంగా.. వివరాల్లోకి వెళితే 1902లో ఇంగ్లండ్ కింగ్ ఎడ్వర్డ్-VII, క్వీన్ అలగ్జాండ్రాల పట్టాభిషేకం సందర్భంగా ఈ ప్రత్యేకమైన చాక్లెట్ తయారుచేశారు. నాటి రోజుల్లో ఇంత ఖరీదైన చాక్లెట్లు పిల్లలకు అంత సులభంగా లభించేవికాదు. నాటి రోజుల్లో చదువుకుంటున్న 9 ఏళ్ల మేరీ ఎన్ బ్లాక్మోర్కి లభ్యమైన ఈ చాక్లెట్‌ను తినకుండా, మహారాజుల పట్టాభిషేకానికి గుర్తుగా జాగ్రత్తగా దాచుకుంది. దశాబ్దాల తరబడి ఆ కుటుంబం దగ్గరే.. ఈ వెనీలా చాక్లెట్ మేరీ కుటుంబం దగ్గర కొన్ని దశాబ్ధాలుగా భద్రంగా ఉంది. అయితే ఇప్పుడు మేరీ మనుమరాలు దీనిని వేలం వేసేందుకు నిర్ణయించుకున్నారు. మేరీ మనుమరాలు జీన్ థమ్సన్కు ఇప్పుడు 72 సంవత్సరాలు. జీన్ ఈ చాక్లెట్‌ను తీసుకుని హెన్సన్‌కు చెందిన వేలందారుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు ఈ చాక్లెట్ అస్తిత్వాన్ని పరిశీలించారు. ‘చాక్లెట్‌ను చిన్నారి తాకనైనా లేదు’ హెన్సన్ వేలందారులలో సభ్యుడైన మార్వెన్ ఫెయర్లీ మాట్లాడుతూ ‘ఆ సమయంలో ఇది ఎంతో అమూల్యమైన కానుక. ఈ చాక్లెట్ చిన్నారులకు అంత సులభంగా లభ్యమయ్యేది కాదు. ఇది ఎంతో ప్రత్యేకమైనది కావడంతోనే నాడు ఆ చిన్నారి కనీసం తాకకుండా కూడా భద్రపరిచింది’ అని అన్నారు. కాగా ఈ చాక్లెట్ డబ్బాపై కింగ్, క్వీన్ల చిత్రాలు ముద్రితమై ఉన్నాయి. వేలంలో లభించనున్న అత్యధిక మొత్తం ఈ చాక్లెట్ వేలం హెన్సన్లో జరగనుంది. వేలంలో దీని ధర కనీసంగా £100 నుంచి £150 (సుమారు రూ. 16 వేలు)వరకూ పలకనుందని అంచనా. ఇంతకు మంచిన ధర కూడా పలకవచ్చని, ఎందుకంటే ఒక్కోసారి చాలామంది చారిత్రాత్మక వస్తువులకు అధ్యధిక విలువ ఇస్తుంటారని మార్వెన్ ఫెయర్లీ పేర్కొన్నారు. డబ్బా తెరవగానే సువాసనలు రాజ కుటుంబానికి చెందిన పురాతన వస్తువులపై అందరికీ అమితమైన ఆసక్తి ఉంటుంది. ఈ 121 ఏళ్ల పురాతన చాక్లెట్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. తినేందుకు ఏమాత్రం యోగ్యమైనది కాదు. దీనిని ఎవరూ తినలేరు కూడా. అయినా ఈ టిన్ తెరవగానే సువాసనలు వస్తున్నాయని ఫెయర్లీ తెలిపారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకుంటే.. -
చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ
- నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి - చూపరులను కంటతడి పెట్టించిన తండ్రి రోదన పాలకొండ రూరల్ : ‘అమ్మా..బంగారం...లేఅమ్మ... నాన్నను వచ్చాను... నా వైపు చూడమ్మా.. నీ కోసం చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ...’ అంటూ ఆ తండ్రి పెట్టిన రోదనలు చూపరులను ఆసుపత్రిలో కంటతడి పెట్టించాయి. వివరాల్లోకి వెళ్తే...వీరఘట్టం మండలం అడారి గ్రామానికి చెందిన వడ్డిపల్లి సంతోష్, సుమతి దంపతుల ఏకైక కుమార్తె రీనా(1) వారి కళ్ల ముందే అప్పటి వరకు శనివారం ఆడుకుంది. పాప కళ్ల ముందే ఉందన్న భ్రమలో తల్లిదండ్రులు ఉండగా మృత్యువు నీళ్ల బకెట్ రూపంలో ముంచుకొచ్చింది. చిన్నారిని చంపేసింది. తమ ముందే అప్పటి వరకు ఆడుకుంటున్న పాపను ఏమరపాటుతో గుర్తించకపోవడంతో పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో రీనా పడిపోయింది. పనిలో ఉన్న తల్లిదండ్రులు ఆ విషయూన్ని గమనించలేదు. తరచి చూసే సరికి బకెట్లో పడి ఉండడాన్ని చూసి హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే పాపలో చలనం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇంతలోనే చిన్న పిల్లల వైద్యాధికారి జె.రవీంద్రకుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాపకు ఆక్సిజన్ అందించడంతో పాటు గుండెలపై అదిమి బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక్కసారిగా పాప నోటి నుంచి చిన్నపాటి గాలి బయటకు వచ్చింది. రీనా ఊపిరి పీల్చుకుందేమోనని తండ్రి, బంధువులు ఆశగా చూశారు. అప్పటికే రీనా తుది శ్వాస విడిచిందన్న విషయూన్ని వైద్యులు చెప్పడంతో తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. రోదించాడు. ఆయన రోదనలు వైద్యులను, సిబ్బందిని, అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.