చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ | One year girl child dies fell into water bucket | Sakshi
Sakshi News home page

చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ

Published Sun, May 22 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ

చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ

- నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి
- చూపరులను కంటతడి పెట్టించిన తండ్రి రోదన

 
పాలకొండ రూరల్ : ‘అమ్మా..బంగారం...లేఅమ్మ... నాన్నను వచ్చాను... నా వైపు చూడమ్మా.. నీ కోసం చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ...’ అంటూ ఆ తండ్రి పెట్టిన రోదనలు చూపరులను ఆసుపత్రిలో కంటతడి పెట్టించాయి. వివరాల్లోకి వెళ్తే...వీరఘట్టం మండలం అడారి గ్రామానికి చెందిన వడ్డిపల్లి సంతోష్, సుమతి దంపతుల ఏకైక కుమార్తె రీనా(1) వారి కళ్ల ముందే అప్పటి వరకు శనివారం ఆడుకుంది. పాప కళ్ల ముందే ఉందన్న భ్రమలో తల్లిదండ్రులు ఉండగా మృత్యువు నీళ్ల బకెట్ రూపంలో ముంచుకొచ్చింది. చిన్నారిని చంపేసింది. తమ ముందే అప్పటి వరకు ఆడుకుంటున్న పాపను ఏమరపాటుతో గుర్తించకపోవడంతో పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో రీనా పడిపోయింది.
 
 పనిలో ఉన్న తల్లిదండ్రులు ఆ విషయూన్ని గమనించలేదు. తరచి చూసే సరికి బకెట్లో పడి ఉండడాన్ని చూసి హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే పాపలో చలనం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇంతలోనే చిన్న పిల్లల వైద్యాధికారి జె.రవీంద్రకుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాపకు ఆక్సిజన్ అందించడంతో పాటు గుండెలపై అదిమి బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక్కసారిగా పాప నోటి నుంచి చిన్నపాటి గాలి బయటకు వచ్చింది. రీనా ఊపిరి పీల్చుకుందేమోనని తండ్రి, బంధువులు ఆశగా చూశారు. అప్పటికే రీనా తుది శ్వాస విడిచిందన్న విషయూన్ని వైద్యులు చెప్పడంతో తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. రోదించాడు. ఆయన రోదనలు వైద్యులను, సిబ్బందిని, అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement