reena
-
విడాకులైతే కలిసి ఉండొద్దా.. మాదంతా ఒకే కుటుంబం: ఆమిర్ మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగింది. కూతురు ఇష్టపడ్డవాడితోనే దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఆమిర్. ఈ వివాహ వేడుకకు అతడి మాజీ భార్యలు రీనా దత్తా(ఇరా ఖాన్ తల్లి), కిరణ్ రావు హాజరై సందడి చేశారు. అంతా ఒకే కుటుంబంలా కనిపించి కనువిందు చేశారు. తాజాగా కిరణ్.. ఆమిర్, రీనాలతో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'నేను జనాలను ఈజీగా కలుపుకుపోతాను. నా కుటుంబం కూడా ఇరా పెళ్లికి హాజరైంది. అందరం కలిసే ఉంటాం.. దీని గురించి మనం మరీ లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. మేమంతా ఒక కుటుంబం. మేము ఒక్కచోటకు చేరినప్పుడల్లా అంతా కలిసే భోజనం చేస్తుంటాం. అలాగే ఒకేచోట నివసిస్తుంటాం. మా అత్తయ్య పై ఫ్లోర్లో ఉంటుంది. తనంటే నాకెంతో ఇష్టం. రీనా పక్కింట్లో ఉంటుంది. ఆమిర్ కజిన్ నుజత్ కూడా దగ్గర్లోనే ఉంటుంది. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం. అందుకే ఇలా కలిసుంటాం. రీనా, నుజత్తో బయట చక్కర్లు కొడుతుంటాను కూడా! ఆమిర్‌తో కూడా వెళ్తూ ఉంటాను. పగప్రతీకారంతో విడాకులు తీసుకోలేదు విడాకులైనంత మాత్రాన ఈ ప్రేమానుబంధాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆమిర్, నేను పగ ప్రతీకారాలతో విడాకులు తీసుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా కలిసే ఉన్నాం. ఇలాంటి అనుబంధం లేకపోతే మనల్ని మనమే కోల్పోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావు 2005లో పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా 2011లో తనయుడు ఆజాద్ రావు జన్మించాడు. 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. చదవండి: నా సినిమా చూడండంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్ బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే? -
తీరిన కోరిక: పాకిస్తాన్ వెళ్లాలి మా ఇల్లు చూడాలి
15 ఏళ్ల వయసులో దేశ విభజన సమయంలో రావిల్పిండిని వదిలి వచ్చేసింది రీనా వర్మ కుటుంబం. అప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్లి తన ఇంటిని చూసుకోవాలని బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె కోరిక. ఎన్ని దశాబ్దాలు ప్రయత్నించినా వీసా ఇవ్వలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఆమెకు. వీసా వచ్చింది. 75 ఏళ్ల తర్వాత వాఘా సరిహద్దును దాటి పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. ఆమె ఉద్వేగాలు ఎలా ఉంటాయో. ఎవరికైనా ఇది ఎంత గొప్ప అనుభవమో. గత సంవత్సరమే హిందీలో ఒక సినిమా వచ్చింది. నీనా గుప్తా లీడ్ రోల్. సినిమా పేరు ‘సర్దార్ కా గ్రాండ్సన్’. ఇందులో అమృత్‌సర్‌లోని 90 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలు లాహోర్‌లో ఉన్న తన ఇంటిని చూడాలనుకుంటుంది. దేశ విభజన సమయంలో అల్లర్లకు భర్త చనిపోగా నెలల బిడ్డను తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ లాహోర్ విడిచిపెట్టి భారత్‌కు చేరుకుంటుందామె. మళ్లీ పాకిస్తాన్ వెళ్లడం కుదరదు. తన ఇంటితో ముడిపడ్డ జ్ఞాపకాలను తలచుకోని రోజు ఉండదు. పోయే ముందు ఆ ఇంటిని చూసి పోవాలని ఆమె కోరిక. కాని ప్రయాణం చేసే శక్తి ఉండదు. ఆమె బాధను మనవడు అర్థం చేసుకుంటాడు. ఆమె పాకిస్తాన్ వెళ్లకపోతే ఏమి ఆమె ఉన్న ఇంటినే ఇక్కడకు తెస్తాను అని పాకిస్తాన్ వెళ్లి ఆ ఇంటికి చక్రాలు కట్టి (బిల్డింగ్ మూవర్స్ సహాయంతో) తెచ్చి ఆమెకు చూపిస్తాడు. ఇది కొంచెం కష్టసాధ్యమైనా సినిమాలో ఎమోషన్ పండింది. అయితే రీనా వర్మ విషయంలో ఇంత ప్రయాస లేదు. అదృష్టవశాత్తు ఆమెకు పాకిస్తాన్ హైకమిషన్ వీసా ఇచ్చింది. కాకపోతే 1965 నుంచి ట్రై చేస్తుంటే 2022కు. మొన్న శనివారం (జూలై 16) వాఘా సరిహద్దు దాటి ఆమె పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. 15 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌ను వదిలాక ఇన్నేళ్ల తర్వాత తన ఇంటిని చూసుకోవడానికి అక్కడకు వెళ్లింది రీనా వర్మ. రావల్పిండిలో బాల్యం పూణెలో నివసిస్తున్న 90 ఏళ్ల రీనా వర్మ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో పుట్టి పెరిగింది. అక్కడి ‘ప్రేమ్‌నివాస్’ అనే ఏరియాలో ఆమె బాల్యం గడిచింది. ‘మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసేవాడు. నాకు నలుగురు తోబుట్టువులు. నేను అక్కడి మోడర్న్ స్కూల్లో చదువుకున్నాను. మా నాన్న ఆ రోజుల్లోనే చాలా ప్రోగ్రెసివ్. ఆడపిల్లలను చదివించాలనుకున్నాడు. మా పెద్దక్క 1930లలోనే కాలేజీలో చదివింది. రావల్పిండి శివార్లలో మూరీ అనే హిల్ స్టేషన్ ఉంది. కొన్నాళ్లు అక్కడ మా నాన్న పని చేశాడు. అక్కడంతా బ్రిటిష్ వాళ్లు ఉండేవాళ్లు. వాళ్లతో మేము కలిసి మెలిసి ఉన్నాం’ అని చెప్పింది రీనా వర్మ. ఆమె అసలు పేరు రీనా చిబ్బర్. పెళ్లయ్యాక రీనా వర్మ అయ్యింది. దేశ విభజన 1932లో పుట్టిన రీనా వర్మకు దేశ విభజన నాటికి 15 ఏళ్లు. ‘దేశ విభజన వరకూ మాకు మత కలహాలు అంటే తెలియదు. మా ఇంటికి ముస్లింలు, శిక్కులు వచ్చి పోతుండేవారు. అందరూ స్నేహంగా ఉండేవాళ్లు. కాని దేశ విభజన సమయానికి అల్లర్లు పెరిగిపోయాయి. మా అమ్మ అసలు దేశం విడిపోతుందంటే నమ్మలేదు. కాని మేము ఢిల్లీ వచ్చేశాం’ అంది రీనా వర్మ. ‘ఢిల్లీ వచ్చాక ఆమె తొలి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం నాకొక గొప్ప అనుభూతి. అప్పుడు నెహ్రూగారిని చూశాను. మళ్లీ 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత జరిగిన రిపబ్లిక్ డేలో లతా మంగేష్కర్ ‘ఏ మేరే వతన్ కే లోగో’ పాడుతున్నప్పుడు నేను నెహ్రూ గారి వెనుకనే కూచుని ఉన్నాను. ఆయన కన్నీరు కార్చడం నేను చూశాను’ అంటుంది రీనా. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు వచ్చి కావేరీ ఎంపోరియమ్‌లో పని చేయడం మొదలెట్టింది. భర్త హెచ్.ఏ.ఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)లో చేసేవాడు. కాని ఎక్కడ ఉన్నా ఆమెకు ఒక్కసారి తిరిగి రావల్పిండి చూసి రావాలనే కోరిక వేధించేది. 1965 నుంచి ప్రయత్నిస్తే... 1965లో పాకిస్తాన్ వీసా కోసం ప్రయత్నిస్తే రాలేదు. కాని మధ్యలో క్రికెట్ మేచ్‌ల కోసం వీసాలు ఇస్తున్నారంటే 1990లో లాహోర్‌కు వెళ్లింది కాని రావల్పిండికి వెళ్లలేకపోయింది. 2021లో ఆమె తన ఫేస్బుక్లో రావల్పిండి గురించి రాస్తే పాకిస్తాన్‌కు చెందిన సజ్జద్ హైదర్ అనే వ్యక్తి రావల్పిండిలోని ఆమె ఇంటి ఫొటో తీసి పంపాడు. అది చూసినప్పటి నుంచి ఆమెకు ఇంకా ఆ ఇల్లు చూడాలనే కోరిక పుట్టింది. మళ్లీ వీసా కోసం అప్లై చేస్తే రాలేదు. ఇంకోసారి వీసాకు అప్లై చేసి ఆ విషయాన్ని ఫేస్బుక్లో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీకి ట్యాగ్ చేయడంతో 90 ఏళ్ల రీనా వర్మ కోరికను మన్నించాల్సిందిగా ఆమె ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఆమెకు వెంటనే మూడు నెలల వీసా మంజూరు చేసింది. వాఘా సరిహద్దు గుండా ఆమె రోడ్డు మార్గంలో పాకిస్తాన్లో అడుగుపెట్టింది. మాలాంటి వాళ్ల కోసం నిజానికి భారత్, పాకిస్తాన్ల మధ్య 60 ఏళ్లు దాటిన వారి కోసం సరిహద్దుల్లో తక్షణ వీసాలు ఇచ్చే ఒప్పందం ఉంది. కాని దానిని పాటించడం లేదు. ‘విడిపోకుండా ఉంటే బాగుండేది. సరే విడిపోయాం. కాని మాలాంటి వాళ్ల కోసం ఇరుదేశాలు వీసాలు ఇస్తే కొన్ని పాత జ్ఞాపకాలను సజీవం చేసుకుంటాం’ అంటుంది రీనా వర్మ. ఈ కథనం అంతా వాఘా దాటిన వెంటనే రాస్తున్నది. ఆమె అక్కడ ఏం చూసిందో ఏం చేసిందో మరో కథనంలో చెప్పుకుందాం. ఒక మంచి తలంపును గట్టిగా తలిస్తే నెరవేరుతుంది అనడానికి రీనా వర్మ ఒక ఉదాహరణ. -
రెండుసార్లు విడాకులు: తొలిసారి స్పందించిన ఆమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2021లో కిరణ్ రావు-ఆమీర్‌ఖాన్ విడాకుల వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. డివోర్స్‌పై ఇద్దరూ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే తాజాగా తొలిసారి ఆమీర్ ఖాన్ తన విడాకులపై స్పందించాడు. మా విడాకుల గురించి ప్రజలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సాధారణంగా డివోర్స్ తర్వాత ఒకరిని మరొకరు పట్టించుకోరు. నిజానికి ఒకరిపై మరొకరికి కోపం ఉంటుంది. చదవండి: మాజీ భార్య నుంచి బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్: ఆమీర్ ఖాన్ కానీ మేం మాత్రం అలా కాదు. వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నాం. దాని గురించి ఎంతో చర్చించాం. అందుకే విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. నిజానికి నా ఇద్దరు మాజీ భార్యలతో నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉండటం నా అదృష్టం. రీనా, కిరణ్, సత్యజిత్ భత్కల్‌తో కలిసి ఓ ఫౌండేషన్ స్థాపించాం. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ కోసం అందరం కలిసే పనిచేస్తున్నాం. అలాగే మా పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులుగా బాధ్యతను నిర్వహిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. కాగా కిరణ్ రావు కంటే ముందే రీనా దత్తాతో 1986లో ఆమీర్ ఖాన్ వివాహం జరిగింది. కానీ 2002లో వీరిద్దరూ విడిపోయారు. అనంతరం 2005లో ఆమీర్ ఖాన్ కిరణ్ రావును పెళ్లాడారు. 15ఏళ్ల వైవాహిక బంధం అనంతరం ఈ జంట విడిపోయింది. చదవండి: బాహుబలి-3పై అప్డేట్ ఇచ్చిన ప్రభాస్, రాజమౌళి -
రీనాతో 16 ఏళ్లు.. కిరణ్ రావుతో 15 ఏళ్లు.. ఎందుకిలా చేశావు ఆమిర్!?
వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరొందాడు ఆమిర్ ఖాన్. కుటుంబం మొత్తం సినీ నేపథ్యం ఉన్నదే. తండ్రి తాహిర్ హుస్సేన్ నిర్మాత. అంకుల్ నాసిర్ హుస్సేన్ 70వ దశకంలో బడా నిర్మాతగా, దర్శకుడిగా పేరు పొందాడు. ఇక ఆమిర్ ఖాన్ కజిన్ మన్సూర్ ఖాన్ కూడా దర్శకుడే. అతడి డైరెక్షన్లోనే ‘‘ఖయామత్ సే ఖయామత్ తక్’’తో సినీ హీరోగా అరంగేట్రం చేశాడు ఆమిర్. తొలి సినిమాతోనే.. ‘‘అరె.. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే’’ అనిపించేలా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. దిల్, దిల్ హై కే మాన్తా నహీ, ఇష్క్, జో జీతా హై వహీ సికిందర్ వంటి సినిమాలతో ఫర్వాలేదనిపించిన ఆమిర్ ఖాన్... 90వ దశకం నుంచి విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నాడు. రంగీలా, ఇష్క్ వంటి సినిమాల్లో కనిపించిన అతడు.. రాజా హిందుస్థానీతో తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇక లగాన్, త్రీ ఇడియట్స్, పీకే వంటి చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లగాన్‌తో నిర్మాణ సంస్థను స్థాపించిన ఆమిర్ ఖాన్.. తారే జమీన్పర్తో డైరెక్టర్‌గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కెరీర్లో ఇంతగా విజయవంతమైన ఆమిర్ ఖాన్.. వ్యక్తిగతంగా ముఖ్యంగా వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అది కూడా రెండుసార్లు. పక్కింటి అమ్మాయి రీనాతో ‘ఇష్క్’ తమ పక్కింట్లో ఉండే అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు ఆమిర్ ఖాన్. వీలు చిక్కినప్పుడల్లా.. గంటల తరబడి కిటికీలో నుంచే ఆమెను చూసేవాడు. మూగగా ఆరాధించేవాడు. రోజులు గడుస్తున్నాయి. అటువైపు నుంచి పెద్దగా స్పందన లేదు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడు ఆమిర్. ఆఖరికి.. ధైర్యం చేసి.. ఒకరోజు రీనా దత్తాకు తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె.. ‘నో’ చెప్పింది. కానీ అతడు వదల్లేదు. పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్చ్... అయినా రీనా మనసు కరగలేదు. నువ్వంటే నాకూ ఇష్టమే ఆమిర్ గుండె పగిలింది. తను మారదు... ఇక కుదరదులే అని ఆశలు వదిలేసుకున్న సమయంలో... రీనా స్వీట్ షాకిచ్చింది. ‘‘నువ్వంటే నాకూ ఇష్టమే’’ అని సిగ్గుల మొగ్గయింది. ఎగిరి గంతేశాడు ఆమిర్. ఇంకేముంది.. సరదాలు.. సంతోషాలు.. షికార్లు.. షరా మామూలే. రీనాను సర్ప్రైజ్ చేసేందుకు సగటు ప్రేమికుడు వేసే వేషాలన్నీ వేశాడు ఆమిర్. తనను ఇంప్రెస్ చేసేందుకు రక్తంతో ప్రేమలేఖ రాశాడు కూడా. కానీ రీనాకు ఇది అస్సలు నచ్చలేదు. ఇంకోసారి ఇలా చేస్తే.. నీతో మాట్లాడేదే లేదు అని కరాఖండిగా చెప్పేసింది. ప్రేమను నిరూపించుకునేందుకు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని గట్టిగానే హెచ్చరించింది. 2002లో విడిపోయారు ఆమిర్‌కు ఆమెపై ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది. పెళ్లి చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చారిద్దరూ. 1986లో ఏప్రిల్ 18న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. పదహారేళ్లపాటు ఆమిర్- రీనా కాపురం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత అభిప్రాయ బేధాలు తలెత్తిన కారణంగా స్నేహ పూర్వకంగానే విడిపోతున్నట్లు ప్రకటించారు. 2002లో వివాహ బంధానికి స్వస్తి పలికారు. నిర్మాతగా మొదటి భార్య.. అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమ! విడాకులు తీసుకున్న తర్వాత కూడా రీనాతో అనుబంధం కొనసాగించాడు ఆమిర్ ఖాన్. ఇద్దరూ కలిసి పానీ ఫౌండేషన్ తరఫున సామాజిక సేవలో భాగమయ్యారు. ఇక లగాన్ సినిమాతో ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన ఆమిర్ ఖాన్... నిర్మాతగా వ్యవహరించాలని రీనాను కోరాడు. హీరోను పెళ్లాడినప్పటికీ రీనాకు సినిమాలపై పెద్దగా ఇంట్రస్ట్ లేదు. నిర్మాణ రంగంపై అసలే అవగాహన లేదు. ఆమిర్ కోసం ఆమె.. ప్రేమలో అతడు కానీ.. ఆమిర్ సాయం కోరాడన్న ఒక్క కారణంతో రీనా పెద్ద సాహసమే చేసింది. లగాన్ వంటి నేపథ్యం ఉన్న సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధపడింది. సుభాష్ ఘాయ్(ప్రముఖ ఫిల్మ్ మేకర్)ను కలిసింది. అప్పటి వరకు ల్యాబ్‌లో అడుగుపెట్టని ఆమె.. మన్మోహన్ శెట్టి(ల్యాబ్ యజమాని)ని అడిగి అన్ని వివరాలు తెలుసుకుంది. సినీ నిర్మాణ వ్యవహారాలపై అవగాహన పెంచుకుంది. ఎట్టకేలకు లగాన్‌ను పట్టాలెక్కించింది. అయితే, లగాన్ సినిమా సమయంలోనే ఆమిర్ ఖాన్‌కు రెండో ప్రేమ లభించింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ఏర్పడ్డ పరిచయం.. ప్రణయం, ఆపై పరిణయానికి దారి తీసింది. ఆమె.. హీరోయిన్ అతిథి రావు హైదరి కజిన్. వీరిద్దరి పూర్వీకులు గద్వాల్(వనపర్తి- తెలంగాణ) సంస్థానానికి చెందిన వారు. 2005లో పెళ్లి బంధంతో ఒక్కటైన కిరణ్- ఆమిర్ సరోగసి పద్ధతిలో ఆజాద్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. .కానీ, ఈ బంధం కూడా 15 ఏళ్లకే విడాకుల వరకు వెళ్లింది. తామిద్దరం భార్యాభర్తలుగా విడిపోతున్నామని, ఆజాద్‌కు మాత్రం... తల్లిదండ్రులుగా అన్ని బాధ్యతలు కలిసి నెరవేరుస్తామని శనివారం ప్రకటించారు కిరణ్ రావు- ఆమిర్ ఖాన్ దంపతులు. స్నేహితులుగా కొనసాగుతామని, రీనా దత్తా సీఓఓగా వ్యవహరిస్తున్న పానీ ఫౌండేషన్ వ్యవహారాల్లో కలిసి పనిచేస్తామని సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీంతో.. సినిమాల్లో మిస్టర్ పర్ఫెక్ట్గా ఉండే నువ్వు ఎందుకిలా చేశావు ఆమిర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. -
లాక్మే సంపూర్ణ స్టయిల్
ఏ నెల అయినా... ఏ కాలమైనా ఇకత్, కాటన్ హ్యాండ్లూమ్స్తోడిజైన్ చేసిన డ్రెస్సులుఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి.దాదాపు నూట యాభై ఏళ్ల క్రితం వచ్చిన అమెరికన్ నవల ‘లిటిల్ ఉమెన్’లోనిజో మార్చ్ పాత్రనుస్ఫూర్తిగా తీసుకొనిడిజైన్ చేసిన డ్రెస్సులుఈ ఆధునిక కాలానపరిచయం చేశారు‘ఎకా’ లేబుల్ డిజైనర్ రీనా సింగ్. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టిస్కో)సహకారంతో తెలంగాణ వస్త్రాలకు అధునికతను జోడించిఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ వేదిక మీద ప్రదర్శించారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఇకత్ కాటన్ జాకెట్లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వేదిక మీద ఆకట్టుకుంది. స్టైలిష్ ప్రింటెడ్ స్పగెట్టి టాప్, వెల్వెట్ వైడ్ లెగ్హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్యాంటు మీద కాటన్ జాకెట్‌ను ధరించింది. చేత్తో చేసిన జర్దోసీ, అందమైన పువ్వులు, కాలర్, కఫ్స్, పాకెట్స్, బెల్ట్‌ల వంటి వాటితో ఈ కలెక్షన్‌కి అదనపు హంగులు తీసుకొచ్చారు. హ్యాండ్లూమ్స్‌తో ప్లీటెడ్ స్కర్ట్స్, బాక్సీ జాకెట్లు, లాంగ్ కోట్లు, లేయర్డ్ దుస్తులను ప్రదర్శించారు రీనా సింగ్. డిజైన్లలో సున్నితమైన లేస్, వెడల్పాటి పొరలు, ఉన్ని ఫ్లాయిడ్, ఆర్గన్జా ఆప్లిక్ వర్క్ కనిపిస్తాయి. అల్లికలు, రంగుల మిశ్రమంతో ఈ డిజైన్స్ ఉంటాయి. ఢిల్లీ ఫ్యాషన్ డిజైనర్ రీనా సింగ్ ‘ఎకా’ లేబుల్‌తో ఈ ఏడాది లాక్మే ఫ్యాషన్ వీక్ వేదిక మీద తెలంగాణ చేనేత కారులు రూపొందించిన ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన కలెక్షన్నుప్రదర్శించి, కనువిందు చేశారు. తన డిజైనర్ దుస్తుల గురించి ప్రస్తావిస్తూ – ‘19వశతాబ్దిలో అమెరికా రచయిత్రి లూయిసా మే అల్కాట్స్ నవల ‘లిటిల్ ఉమెన్’లోని జో మార్చ్ పాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ డిజైన్స్ చేశాను. టామ్‌బాయ్ నుంచి సంపూర్ణ స్త్రీగా మారిన జో మార్చ్ ఈ డిజైన్స్‌కి ప్రేరణ. నా డిజైన్స్‌కి అంతర్జాతీయ మార్కెట్ రావాలి. దాంట్లో భాగంగా తెలంగాణ చేనేతల గురించి తెలుసుకున్నాను. డబుల్, సింగల్ ఇకత్ కోసం తెలంగాణలోని కోవలగూడెం, టస్సర్ సిల్క్‌కి మహదేవ్పూర్, కాటన్ ఫ్యాబ్రిక్‌కి నారాయణ్‌పేట్ ప్రాంతాల నేతకారులను కలిశాను. తెలంగాణ పొడి వాతావరణం కనుక ఇక్కడ సిల్క్ కాటన్‌తో మిక్స్ చేసిన ఫ్యాబ్రిక్ ప్రధానంగా ఉంటుంది. స్పన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మందంగా ఉంటుంది. అందుకని మూలాంశం దెబ్బతినకుండా పట్టు, పత్తి ట్విస్టెడ్ దారాలకు డైయింగ్ చేసి నేయడంతో వీటికి మరింత వన్నె వచ్చింది. ఫ్యాషన్ పరిశ్రమలో అతి పెద్ద కాలుష్యకారకాలు దుస్తులే. ఈ రోజు మోడల్ రేపటికి పాతదైపోతుంది. డిజైన్స్ అందుకు వాడే ఫాబ్రిక్ ప్రతి సీజన్లోనూ ధరించేలా ఉండాలి. ఈ తరహా వస్త్రాలను ప్రపంచ దృష్టికి తీసుకురావడానికి ఈ ప్రాంతంలో మరింత కృషి చేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు రీనా సింగ్. -
చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ
- నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి - చూపరులను కంటతడి పెట్టించిన తండ్రి రోదన పాలకొండ రూరల్ : ‘అమ్మా..బంగారం...లేఅమ్మ... నాన్నను వచ్చాను... నా వైపు చూడమ్మా.. నీ కోసం చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ...’ అంటూ ఆ తండ్రి పెట్టిన రోదనలు చూపరులను ఆసుపత్రిలో కంటతడి పెట్టించాయి. వివరాల్లోకి వెళ్తే...వీరఘట్టం మండలం అడారి గ్రామానికి చెందిన వడ్డిపల్లి సంతోష్, సుమతి దంపతుల ఏకైక కుమార్తె రీనా(1) వారి కళ్ల ముందే అప్పటి వరకు శనివారం ఆడుకుంది. పాప కళ్ల ముందే ఉందన్న భ్రమలో తల్లిదండ్రులు ఉండగా మృత్యువు నీళ్ల బకెట్ రూపంలో ముంచుకొచ్చింది. చిన్నారిని చంపేసింది. తమ ముందే అప్పటి వరకు ఆడుకుంటున్న పాపను ఏమరపాటుతో గుర్తించకపోవడంతో పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో రీనా పడిపోయింది. పనిలో ఉన్న తల్లిదండ్రులు ఆ విషయూన్ని గమనించలేదు. తరచి చూసే సరికి బకెట్లో పడి ఉండడాన్ని చూసి హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే పాపలో చలనం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇంతలోనే చిన్న పిల్లల వైద్యాధికారి జె.రవీంద్రకుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాపకు ఆక్సిజన్ అందించడంతో పాటు గుండెలపై అదిమి బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక్కసారిగా పాప నోటి నుంచి చిన్నపాటి గాలి బయటకు వచ్చింది. రీనా ఊపిరి పీల్చుకుందేమోనని తండ్రి, బంధువులు ఆశగా చూశారు. అప్పటికే రీనా తుది శ్వాస విడిచిందన్న విషయూన్ని వైద్యులు చెప్పడంతో తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. రోదించాడు. ఆయన రోదనలు వైద్యులను, సిబ్బందిని, అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. -
ఒక్కటైన నేపాల్ అమ్మాయి... ఆంధ్రా అబ్బాయి
ద్వారకా తిరుమల: నేపాల్ అమ్మాయికి... ఆంధ్ర అబ్బాయికి ఢిల్లీలో చిగురించిన ప్రేమ బంధం చిన వెంకన్న క్షేత్రంలో మూడుముళ్ల బంధమైంది. బుగ్గన చుక్క, నుదుటున కల్యాణ తిలకంతో సిగ్గులొలుకుతున్న ఆ నేపాల్ వధువుకు హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా బుధవారం ఉదయం జరిగిన ఈ వివాహవేడుకకు ద్వారకాతిరుమల శ్రీవారి శేషాచలకొండ వేదికైంది. జిల్లాలోని పోడూరు మండలం జిన్నూరుకు చెందిన పెచ్చేటి వెంకటేష్ ఢిల్లీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్న నేపాల్ యువతి రీణాతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది క్రితం నుంచి ప్రేమించుకుంటున్న వీరు ఈ విషయాన్ని పెద్దలకు తెలిపి... వివాహానికి వారి అంగీకారాన్ని పొందారు. దీంతో శేషాచలకొండపై ఉన్న టీటీడీ కాల్యాణ మండపంలో వీరి వివాహం సంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో నేపాలీలు చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారి దేవస్థానం ఈవో.. ఈ వివాహనికి హాజరై... నూతన వధూవరులకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి... ఆశీర్వదించారు. అనంతరం కొత్త జంట శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. -
భర్త హత్య కేసులో భార్యకు, ప్రియుడికి జీవిత ఖైదు
ముజాఫ్నగర్: భర్తను హత్య చేసిన ఘటనలో భార్యతో పాటు ఆమె ప్రియుడికి యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ స్థానిక కోర్టు తీర్పు నిచ్చింది. రీనా అనే మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబధం కొనసాగిస్తూ భర్తను అడ్డు తొలిగించుకోవాలని దురుద్దేశంతో హత్య చేసిందని కోర్టులో రుజువు కావడంతో శిక్ష ఖరారైంది. ఈ మేరకు సోమవారం విచారించిన జిల్లా అడిషనల్ జడ్జి చంద్ర భూషణ్ వారికి జీవిత ఖైదుతో పాటు, 25, 000 చెల్లించాలని తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. ముజాఫర్ నగర్ లో నివాసముంటున్న రీనా అనే మహిళకు రోషన్ ను పెళ్లి చేసుకుంది. కొంత కాలం వీరి జీవనం సజావుగానే సాగిన తరువాత వారి మధ్య విభేదాలు మొదలైయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె కుమార్ అనే అతనితో వివాహేతర సంబంధం కొనసాగించడం మొదలు పెట్టింది. జనవరి 2 వతేదీ, 2012 సంవత్సరంలో భర్తకు జబ్బు చేయడంతో అదే అదునుగా భావించిన ఆమె హత్యకు పథకం రచించింది. వీరివురూ కలిసి హత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు రుజువు కావడంతో వారికి జీవిత ఖైదును కోర్టు ఖరారు చేసింది.