Aamir Khan First Reaction After Divorce With Kiran Rao And Reena Dutta - Sakshi
Sakshi News home page

Aamir Khan: 'నా ఇద్దరు మాజీ భార్యలతో ఇప్పటికీ మంచి అనుబంధం'..

Published Mon, Mar 14 2022 1:50 PM | Last Updated on Mon, Mar 14 2022 4:54 PM

Aamir Khan First Reaction After Divorce With Kiran Rao And Reena Dutta - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2021లో కిరణ్‌ రావు-ఆమీర్‌ఖాన్‌ విడాకుల వ్యవహారం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. డివోర్స్‌పై ఇద్దరూ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే తాజాగా తొలిసారి ఆమీర్‌ ఖాన్‌ తన విడాకులపై స్పందించాడు. మా విడాకుల గురించి ప్రజలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సాధారణంగా డివోర్స్‌ తర్వాత ఒకరిని మరొకరు పట్టించుకోరు. నిజానికి ఒకరిపై మరొకరికి కోపం ఉంటుంది. చదవండి: మాజీ భార్య నుంచి బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌: ఆమీర్‌ ఖాన్‌


కానీ మేం మాత్రం అలా కాదు. వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నాం. దాని గురించి ఎంతో చర్చించాం. అందుకే విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. నిజానికి నా ఇద్దరు మాజీ భార్యలతో నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉండటం నా అదృష్టం. రీనా, కిరణ్‌, సత్యజిత్‌ భత్కల్‌తో కలిసి ఓ ఫౌండేషన్‌ స్థాపించాం. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్‌ కోసం అందరం కలిసే పనిచేస్తున్నాం.

అలాగే మా పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులుగా బాధ్యతను నిర్వహిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. కాగా కిరణ్‌ రావు కంటే ముందే రీనా దత్తాతో 1986లో ఆమీర్‌ ఖాన్‌ వివాహం జరిగింది. కానీ 2002లో వీరిద్దరూ విడిపోయారు. అనంతరం 2005లో ఆమీర్‌ ఖాన్‌ కిరణ్‌ రావును పెళ్లాడారు. 15ఏళ్ల వైవాహిక​ బంధం అనంతరం ఈ జంట విడిపోయింది. చదవండి: బాహుబలి-3పై అప్‌డేట్‌ ఇచ్చిన ప్రభాస్‌, రాజమౌళి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement