భర్త హత్య కేసులో భార్యకు, ప్రియుడికి జీవిత ఖైదు | Woman, paramour gets life term for killing husband | Sakshi

భర్త హత్య కేసులో భార్యకు, ప్రియుడికి జీవిత ఖైదు

Published Tue, Nov 12 2013 2:28 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

Woman, paramour gets life term for killing husband

ముజాఫ్నగర్: భర్తను హత్య చేసిన ఘటనలో భార్యతో పాటు ఆమె ప్రియుడికి యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ స్థానిక కోర్టు తీర్పు నిచ్చింది. రీనా అనే మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబధం కొనసాగిస్తూ భర్తను అడ్డు తొలిగించుకోవాలని దురుద్దేశంతో హత్య చేసిందని కోర్టులో రుజువు కావడంతో శిక్ష ఖరారైంది. ఈ మేరకు సోమవారం విచారించిన జిల్లా అడిషనల్ జడ్జి చంద్ర భూషణ్ వారికి జీవిత ఖైదుతో పాటు, 25, 000 చెల్లించాలని తీర్పు వెలువరించారు.

 

వివరాల్లోకి వెళితే.. ముజాఫర్ నగర్ లో నివాసముంటున్న రీనా అనే మహిళకు రోషన్ ను పెళ్లి చేసుకుంది. కొంత కాలం వీరి జీవనం సజావుగానే సాగిన తరువాత వారి మధ్య విభేదాలు మొదలైయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె కుమార్ అనే అతనితో వివాహేతర సంబంధం కొనసాగించడం మొదలు పెట్టింది. జనవరి 2 వతేదీ, 2012 సంవత్సరంలో భర్తకు జబ్బు చేయడంతో అదే అదునుగా భావించిన ఆమె హత్యకు పథకం రచించింది. వీరివురూ కలిసి హత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు రుజువు కావడంతో వారికి జీవిత ఖైదును కోర్టు ఖరారు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement