water bucket
-
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్‌కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్‌లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
Photo Feature: 'పానీ'పట్టు యుద్ధం
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఆదివారం మధ్యాహ్నం కోతుల గుంపు వచ్చింది. బాగా దప్పికతో ఉన్నాయో ఏమో.. ఆ కోతులు నీటికోసం వెదుకులాడాయి. ఓ కోతికి నీళ్లబాటిల్ దొరింది. అయితే ఎలా తాగాలో అర్థంకాక సతమతమైంది. నీళ్లు తాగేక్రమంలో బాటిల్ కిందపడి నీళ్లు నేలపాలయ్యాయి. ఇంతలో ఓ నీళ్ల బక్కెట్ కోతుల కంటపడింది. ఒక్కొక్కటిగా బక్కెట్ వద్దకు చేరి కడుపునిండా నీళ్లు తాగి దప్పిక తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
నీటి బకెట్లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి
అంబర్‌పేట: కళ్ల ముందు అప్పటిదాకా సందడి చేస్తున్న తమ కుమార్తె ప్రమాదవశాత్తూ బాత్రూంలోని నీటి బాకెట్లో పడి మృతి చెందడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద సంఘటన మంగళవారం మధ్యాహ్నం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వీరయ్య కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మదనపల్లికి చెందిన హరికృష్ణ, రేణుక దంపతులు. వీరికి నాగున్నరేళ్ల కూతురు భాను, రెండున్నరేళ్ల చిన్ను సంతానం. నాలుగు నెలల క్రితం జీవనోపాధి కోసం డీడీ కాలనీకి వచ్చారు. హరికృష్ణ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా మంగళవారం ఇంట్లో హరికృష్ణ భోజనం చేస్తుండగా చిన్న కూతరు చిన్ను ఆడుకుంటూ బాత్రూంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడింది. అక్కడే ఆడుకున్న చిన్నారి అక్క భాను గమనించి తండ్రికి చెప్పింది. వెంటనే బాత్రూంలోకి పరిగెత్తుకు వచ్చి చిన్నును బకెట్లో నుంచి బయటకు తీశారు. మింగిన నీటిని బయటకు తీసి విద్యానగర్‌లో ఉన్న డీడీ ఆస్పత్రికి హుటాహుటిన తీసుకువెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి తొట్టిలో పడి చిన్నారి మృత్యువాత
పావగడ : కర్ణాటకలోని పావగడ తాలూకాలోని తిరుమణిలో నరశింహలు, సుధారాణి దంపతుల కుమారుడు నిఖిత్(4) ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించడంతో అప్పటికే ఊపిరాడక చిన్నారి మతి చెందాడు. తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి దుర్మరణం
♦ తల్లడిల్లిన కుటుంబ సభ్యులు ♦ తూప్రాన్‌లో ఘటన తూప్రాన్:ఆడుకుంటూ వెళ్లిన ఆ చిన్నారి నీటి బకెట్లో పడి ప్రాణాలు విడిచాడు. ఈ దుర్ఘటన తూప్రాన్‌లో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన జ్యోతి, శ్రీను దంపతులు అభ్యాస స్కూల్ ఎదురుగా డేరాల్లో నివసిస్తున్నారు. వీరి కి కళ్యాణ్ అనే ఏడాదిన్నర వయస్సు గల బాబు ఉన్నాడు. వీరు రోడ్ల పక్కన చెత్తను సేకరించి వాటితో వచ్చిన డబ్బుతో జీవిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. రోజు మాదిరిగా తండ్రి శ్రీను చెత్తకాగితాల సేకరణకు వెళ్లాడు. ఇంటి వద్దే ఉన్న తల్లి బాబుకు పాలిచ్చి అలాగే నిద్రపోయింది. తల్లి పక్కలోంచి లేచిన బాలుడు కళ్యాణ్ ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న ప్లాస్టిక్ బకెట్ వైపు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి మృత్యవాత పడ్డాడు. కాసేపటికి నిద్రనుంచి తేరుకున్న జ్యోతి తన కుమారుడి గురించి పక్కనున్న డేరాల్లో వెతి కింది. అక్కడ కనిపించలేదు. ఇంటి ముందు ఉన్న బకెట్లో తలకిందులుగా పడి ఊపిరాడక మృతి చెంది పడి ఉన్నాడు. దీంతో ఆ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని బయటకు తీసి గుండెలకు హత్తుక్కుని బోరున విలపించింది. చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లి విలపించిన తీరు అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. -
చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ
- నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి - చూపరులను కంటతడి పెట్టించిన తండ్రి రోదన పాలకొండ రూరల్ : ‘అమ్మా..బంగారం...లేఅమ్మ... నాన్నను వచ్చాను... నా వైపు చూడమ్మా.. నీ కోసం చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ...’ అంటూ ఆ తండ్రి పెట్టిన రోదనలు చూపరులను ఆసుపత్రిలో కంటతడి పెట్టించాయి. వివరాల్లోకి వెళ్తే...వీరఘట్టం మండలం అడారి గ్రామానికి చెందిన వడ్డిపల్లి సంతోష్, సుమతి దంపతుల ఏకైక కుమార్తె రీనా(1) వారి కళ్ల ముందే అప్పటి వరకు శనివారం ఆడుకుంది. పాప కళ్ల ముందే ఉందన్న భ్రమలో తల్లిదండ్రులు ఉండగా మృత్యువు నీళ్ల బకెట్ రూపంలో ముంచుకొచ్చింది. చిన్నారిని చంపేసింది. తమ ముందే అప్పటి వరకు ఆడుకుంటున్న పాపను ఏమరపాటుతో గుర్తించకపోవడంతో పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో రీనా పడిపోయింది. పనిలో ఉన్న తల్లిదండ్రులు ఆ విషయూన్ని గమనించలేదు. తరచి చూసే సరికి బకెట్లో పడి ఉండడాన్ని చూసి హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే పాపలో చలనం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇంతలోనే చిన్న పిల్లల వైద్యాధికారి జె.రవీంద్రకుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాపకు ఆక్సిజన్ అందించడంతో పాటు గుండెలపై అదిమి బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక్కసారిగా పాప నోటి నుంచి చిన్నపాటి గాలి బయటకు వచ్చింది. రీనా ఊపిరి పీల్చుకుందేమోనని తండ్రి, బంధువులు ఆశగా చూశారు. అప్పటికే రీనా తుది శ్వాస విడిచిందన్న విషయూన్ని వైద్యులు చెప్పడంతో తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. రోదించాడు. ఆయన రోదనలు వైద్యులను, సిబ్బందిని, అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): అప్పటి వరకూ సరదాగా ఆడుతూ, కేరింతలు కొడుతూ కనిపించిన చిన్నారి నోరు మూగబోయింది. ఆడుకుంటూ స్నానాలగదిలోకి వెళ్లిన రెండేళ్ల బాలుడు నీటి బకెట్లో తలకిందులుగా పడిపోవడంతో మృతి చెందాడు. ఆలస్యంగా జరిగిన దారుణాన్ని చూసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు బాధతో కుప్పకూలిపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడు ఎస్పీ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎల్ల కిట్టయ్య, లక్ష్మీదేవి దంపతుల రెండేళ్ల కుమారుడు జితేంద్ర ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు వారి పనుల్లో వారు ఉన్నారు. అయితే, జితేంద్ర స్నానాల గదిలోకి వెళ్లగా కాలు జారి బకెట్లో తలకిందులుగా పడిపోవడంతో ఊరిరాడక మృతి చెందాడు. గాలికి బాత్రూమ్ డోర్ కూడా మూసుకుపోవడంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలియలేదు. చిన్నారి మాట వినిపించకపోవడంతో ఎవరో ఒకరు ఎత్తుకుని ఉంటారులే అనుకున్నారు. కానీ, కొద్దిసేపటికి బాత్రూమ్లోని నీటి బకెట్లో జితేంద్ర విగతజీవిగా కనిపించడంతో... కిట్టయ్య, లక్ష్మీదేవి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు కూడా చలించిపోయారు.