![Photo Feature: Monkey Drinks Water From Bucket at Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/16/Monkey-Drinks.jpg.webp?itok=NANLtFRn)
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఆదివారం మధ్యాహ్నం కోతుల గుంపు వచ్చింది. బాగా దప్పికతో ఉన్నాయో ఏమో.. ఆ కోతులు నీటికోసం వెదుకులాడాయి. ఓ కోతికి నీళ్లబాటిల్ దొరింది. అయితే ఎలా తాగాలో అర్థంకాక సతమతమైంది. నీళ్లు తాగేక్రమంలో బాటిల్ కిందపడి నీళ్లు నేలపాలయ్యాయి. ఇంతలో ఓ నీళ్ల బక్కెట్ కోతుల కంటపడింది. ఒక్కొక్కటిగా బక్కెట్ వద్దకు చేరి కడుపునిండా నీళ్లు తాగి దప్పిక తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment