బుచ్చినాయుడుకండ్రిగ(చిత్తూరు జిల్లా): ఇది కాకి..కడవ కాలం కాదు. ఒక్కో రాయి కడవలో వేసి నీళ్లు పైకి వచ్చాక దాహం తీర్చుకోవడానికి. ఇదో కారు.. తెలివైన కోతి స్టోరీ. దర్జాగా కారులోకి వెళ్లి వాటర్ బాటిల్‌తో దాహం తీర్చుకున్న నయా వా‘నరుడి’ గాథ! వేసవి తాపానికి ఇక్కడి చిత్రంలోని వానరం దప్పికతో నీళ్ల కోసం కటకటలాడింది. అటూ ఇటూ పరుగులు తీస్తూ స్థానిక తెలుగుగంగ కార్యాలయం వద్ద నిలిపి ఉన్న కారును వానరం చూసింది.
చదవండి: మగతనం లేదని హేళన.. కాస్త శ్రుతిమించడంతో చివరికి ఏం జరిగిందంటే?
దానికేదో ఐడియా వచ్చినట్లుంది కాబోలు..గ్లాస్ డోర్ తెరచి ఉండడంతో కారు లోపలికి జంప్ చేసింది. అక్కడో వాటర్ బాటిల్ కనిపించేసరికి చటుక్కున అంది పుచ్చుకుంది. ఇలా దర్జాగా కూర్చుని వాటర్ బాటిల్ మూత తీసి, ఆబగా తాగేసింది. హమ్మయ్య ఈ పూటకు ఓకే అని ఓ క్షణం రిలాక్స్ అయ్యింది. బాటిల్‌ను అక్కడే పడేసి మళ్లీ చెట్లల్లోకి జంప్ చేసింది. ఔరా! ఏమి తెలివి దీనిది అంటూ అక్కడివారు ఆశ్చర్యంగా చూశారు. మంగళవారం మిట్ట మధ్యాహ్నం ఈ వానరుడు తన చేష్టలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
Comments
Please login to add a commentAdd a comment