గంటా నరహరి కారులో డబుల్ బ్యారల్ గన్, స్వాధీనం చేసుకున్న తూటాలు
చంద్రబాబుది మొదటి నుంచి హింసావాదమే. ప్రాజెక్టుల పర్యటనల ముసుగులో హింసకు స్కెచ్ వేశారు. రెచ్చగొట్టి ప్రజల్లో విభజన తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహం రచించారు. పలమనేర్ బై పాస్‌లో వెళ్లకుండా.. పుంగనూర్‌కు రూట్ ఎందుకు మార్చాడు.. చంద్రబాబు రూట్ మార్చడం వెనుక భారీ కుట్ర ఉంది. కావాలనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చంద్రబాబు చేశారు.
చిత్తూరు అర్బన్/ బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్‌మిత్ సింగ్(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది.
కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహేష్‌పైకి దూసుకొచ్చింది. మహేష్ హెచ్చరికతో కారు ఆగింది. అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా.. ఆగ్రహించిన గురుమిత్‌సింగ్ కారులోంచి డబుల్ బ్యారల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు.
చదవండి: ‘పచ్చ’మూకలకు ఎదురొడ్డి..
పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్ బ్యారల్ గన్, సీటు కవర్‌లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్ లభించాయి. వీటితోపాటు కారును స్వా«దీనం చేసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్‌మిత్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
అంతా వ్యూహాత్మకం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్‌ఎస్‌జీ కమాండోల రక్షణలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్ మ్యాప్‌లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), ఆర్మ్‌డ్ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్‌లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు.
కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్ హోటల్‌కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment