narahari
-
ఇంటింటా లక్ష్మీకళ
ఆడపిల్ల పుడితే ‘అయ్యో’ అంటూ సానుభూతి చూపేవాళ్లు మన దేశంలో ఎన్నోచోట్ల కనిపిస్తారు.మధ్యప్రదేశ్‌లో ఈ ధోరణి మరీ ఎక్కువ. ఆడిపిల్ల పుడితే ఆర్థికభారంగా భావించి పురిట్లోనే ప్రాణం తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి మన తెలుగు బిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ‘లాడ్లీ లక్ష్మీ యోజన’తో నడుం బిగించారు. ప్రతిష్ఠాత్మకమైన ‘బేటీ బచావో బేటీ పడావో’ కు స్ఫూర్తిగా నిలిచిన ఈ సంక్షేమ పథకాన్ని పదిహేను రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం...కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆడపిల్ల పుడితే భారంగా భావించడం నుంచి భ్రూణహత్యల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడారు. ఆయన మాటల్లో ఎంతో ఆవేదన కనిపించింది. ‘ఈ పరిస్థితుల్లో మనం మార్పు తేవాలి’ అనే పట్టుదల కనిపించింది.ఇదీ చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి‘మనం మాత్రం ఏం చేయగలం సర్, ప్రజలు అలా ఆలోచిస్తున్నారు!’ అని ఆ అధికారులు చేతులెత్తేస్తే కథ కంచికి వెళ్లినట్లే. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. అక్కడినుంచే మొదలైంది. ముఖ్యమంత్రితో సమావేశం అయిన వారిలో ఐఏయస్ అధికారి నరహరి కూడా ఉన్నారు. ఒక సమస్యకు పది రకాల పరిష్కార మార్గాలు ఆలోచించడం ఆయన సొంతం.‘మనం ఏం చేయలేమా!’... సీఎం ఆవేదనపూరిత మాటలు నరహరి మనసులో సుడులు తిరిగాయి.‘కచ్చితంగా చేయాల్సిందే. చేయగలం కూడా’ అని ఒకటికి పదిసార్లు అనుకున్నారు. పేదింటి బిడ్డ అయిన నరహరికి పేదోళ్ల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆడపిల్ల అంటే పనిగట్టుకొని వ్యతిరేకత లేకపోయినా పేదరికం వల్ల మాత్రమే ‘ఆడబిడ్డ వద్దు’ అనుకునే వాళ్లను ఎంతోమందిని చూశారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి హరియాణ, పంజాబ్... మొదలైన రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో కోణాలలో ఎన్నో ప్రశ్నలు వేశారు.‘మేం బతకడమే కష్టంగా ఉంది. ఇక ఆడబిడ్డను ఎలా బతికించుకోవాలి సారు’ అనే మాటలను ఎన్నో ప్రాంతాలలో విన్నారు. వారికి ఆర్థిక భరోసా ఇస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లే కదా! అలా మొదలైందే లాడ్లీ లక్ష్మీ యోజన(గారాల కూతురు). ఇది సంక్షేమ పథకం మాత్రమే కాదు... సామాజిక మార్పు తెచ్చిన శక్తి. ఆడపిల్ల భారం అనే భావన తొలగించేందుకు వారికి ముందు ఆర్థిక భరోసా కల్పించాలి. అదే సమయంలో అమ్మాయిలను విద్యావంతులను చేయాలి... ఈ కోణంలో పథకానికి రూపకల్పన చేశారు. (అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు)‘పుట్టగానే అమ్మాయిని లక్షాధికారి చేస్తాం’ అని ప్రకటించారు. అయితే ఆ డబ్బు చేతికందడానికి షరతులు విధించారు. అమ్మాయి ఇంటర్ పూర్తి చేయాలి. 5వ తరగతి పూర్తి చేస్తే రూ.2000, 8వ తరగతి పూర్తి చేస్తే రూ.4000 చొప్పున ప్రతి తరగతికి బోనస్ చెల్లింపులు చేశారు. అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లు వచ్చాక మాత్రమే ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ కు సంబంధించిన డబ్బులు చెల్లించేవారు. అలా పథకం వందశాతం విజయవంతమైంది.ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్!మధ్యప్రదేశ్‌లోని చంబల్లోయప్రాంతాల్లో కొన్ని కులాల ప్రజలు రైఫిల్‌ను సామాజిక హోదాగా భావిస్తారు. మగవారు సైకిల్ మీద తిరిగినా భుజాన తుపాకీ ఉండాల్సిందే! ఆడపిల్లలను పురిట్లోనే చంపేసేవారు కూడా ఆప్రాంతాల్లో ఎక్కువే. ఆప్రాంతాలలో ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రతి 1000 మంది బాలురకు 400 మంది బాలికలే మిగిలారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయా కులాల వారితో సమావేశం నిర్వహించారు. ‘ఆడపిల్లలను మీరు వద్దనుకుంటూ పోతే వారే కాదు చివరికి మీ కులాలు త్వరలోనే అంతరించి పోవడం ఖాయం’ అని కులపెద్దలకు చెప్పారు. దీంతో వారిలో మార్పు వచ్చింది. అయితే తమకు తుపాకీ లైసెన్స్ లేకుండా ఉండలేమన్నారు. దీంతో ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్ అని నిబంధన విధించారు!2007 నుంచి 50 లక్షల మంది ఆడపిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. బాలికల లింగ నిష్పత్తి 400 నుంచి 950కి పెరిగింది. ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ ద్వారా సామాజిక ఫలాలు అందుతున్న తీరును అధ్యయనం చేసి ఎంతోమంది పీహెచ్డీ చేశారు.లింగ వివక్షకు తావు లేని సమాజాన్ని కల కంటున్నారు నరహరి. అది చారిత్రక అవసరం. తక్షణ అవసరం.భ్రూణహత్యల నివారణకు...‘లాడ్లీ లక్ష్మీ యోజన’ పథకం విజయవంతంగా అమలు చేస్తూనే మరోవైపు భ్రూణహత్యలపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, నర్సులు, కిందిస్థాయి సిబ్బందితో విస్తృతమైన విజిలెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. తప్పుదారి పట్టిన వైద్యులపై కేసులు నమోదు చేశారు. దీంతో చట్టాన్ని ఉల్లంఘించిన వైద్యులు దారికొచ్చారు.పేదింటి బిడ్డఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన నరహరిది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్. నిరుపేదింట జన్మించిన నరహరి కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఆశయంతో ‘ఆలయ ఫౌండేషన్ ’ స్థాపించి స్థానికంగా విద్య, వైద్య, ఆరోగ్య సంబంధమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.– భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి కరీంనగర్ -
మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీ హోదాపై నిరసన.. సెక్రటేరియట్ భవనం నుంచి దూకిన నేతలు
ముంబై: మహారాష్ట్రలోని ధంగర్ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చినందుకు నిరసనగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా గిరిజన నేతలు సెక్రటేరియట్ భవనం మంత్రాలయం మూడో అంతస్తు నుంచి దూకారు. అయితే, పోలీసులు ముందు జాగ్రత్తగా దిగువన రెండో అంతస్తులో నెట్లో పడటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ఘటన మంత్రాలయం సముదాయంలో శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.దూకిన వారిలో జిర్వాల్తోపాటు ఎన్సీపీకే చెందిన ఎమ్మెల్యే కిరణ్ లహమతే, బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవర తదితరులున్నారు. వీరిని పోలీసులు నెట్ నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ నేతలంతా గ్రౌండ్ ఫ్లోర్లో బైఠాయించారు. కోటా విషయమై సీఎం షిండే వెంటనే తమతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రాలయం భవనం పైనుంచి గతంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటనలున్నాయి. దీంతో, అక్కడ పోలీసులు నెట్‌ను ఏర్పాటు చేసి ఉంచారు. కాగా, గిరిజనులకు సంబంధించిన నిర్ణయాలపై అధికార కూటమిలోని అంతర్గత విభేదాలను ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసింది. -
రాజ్యాధికారమే లక్ష్యం కావాలి
కోరుట్ల: రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పద్మశాలీ ఆత్మగౌరవ సభలో వక్తలు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదివారం జరిగిన పద్మశాలీ ఆత్మగౌరవ యుద్ధభేరి సభకు ప్రముఖ కవి గుంటుక నరసయ్య పంతులు ప్రాంగణంగా నామకరణం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది కులబాంధవులు తరలివచ్చారు. తొలుత ముఖ్య అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ, పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిదేదీ లేదని, చట్టసభల్లో ప్రాతినిధ్యం సాధించడంపై దృష్టి పెట్టాలని కోరారు. పిల్లలు ఉన్నత చదువులు చదివి సంఘం ఐక్యతకు కృషి చేయాలన్నారు. పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రాధాన్యత సాధించేవరకూ పద్మశాలీలు విశ్రమించవద్దని కోరారు. అందరూ ఏకమై ‘మనఓటు మనకే’ నినాదంతో ముందుకు రావాలని కోరారు.కర్నూలు ఎంపీ సంజయ్ మాట్లాడుతూ, పద్మశాలీలు ఎక్కడున్నా జన్యుపరమైన సంబంధం కలుపుతుందన్నారు. ఏపీలో పద్మశాలీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఎంపీగా పార్లమెంట్లో పద్మశాలీలకు చెందిన రెండు వీవర్స్ బిల్లులు ప్రవేశపెట్టడానికి కృషి చేశానని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ, పద్మశాలీ కులశక్తి విచ్ఛిన్నం కాకుండా పోరాటం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ, రాజకీయ పార్టీ ఏదైనా పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, రాజకీయ అస్థిత్వాన్ని సాధించే దిశ గా ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాదిగా పద్మశాలీ లు తరలిరావడం అభినందనీయమన్నారు. ఆత్మ గౌరవ యుద్ధభేరి సభ కమిటీ రాష్ట్ర చైర్మన్ బసవ లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రాతి నిధ్యం ఉంటేనే పద్మశాలీల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. బీసీల్లో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్నా.. చట్టసభల్లో ఆశించిన రీతిలో ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జగిత్యాల జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకులు గజ్జెల శ్రీనివాస్, జక్కుల ప్రసాద్ పాల్గొన్నారు. -
రక్తపాతం లక్ష్యంగా చంద్రబాబు స్కెచ్.. రాజంపేట టీడీపీ అభ్యర్థి నరహరి కారులో గన్
చంద్రబాబుది మొదటి నుంచి హింసావాదమే. ప్రాజెక్టుల పర్యటనల ముసుగులో హింసకు స్కెచ్ వేశారు. రెచ్చగొట్టి ప్రజల్లో విభజన తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహం రచించారు. పలమనేర్ బై పాస్‌లో వెళ్లకుండా.. పుంగనూర్కు రూట్ ఎందుకు మార్చాడు.. చంద్రబాబు రూట్ మార్చడం వెనుక భారీ కుట్ర ఉంది. కావాలనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చంద్రబాబు చేశారు. చిత్తూరు అర్బన్/ బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది. కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహేష్‌పైకి దూసుకొచ్చింది. మహేష్ హెచ్చరికతో కారు ఆగింది. అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా.. ఆగ్రహించిన గురుమిత్‌సింగ్ కారులోంచి డబుల్ బ్యారల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు. చదవండి: ‘పచ్చ’మూకలకు ఎదురొడ్డి.. పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్ బ్యారల్ గన్, సీటు కవర్లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్ లభించాయి. వీటితోపాటు కారును స్వా«దీనం చేసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్‌మిత్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. అంతా వ్యూహాత్మకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్ మ్యాప్‌లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఆర్మ్డ్ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్‌లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు. కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్ హోటల్‌కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు. -
కుక్క.. ఎలుక..ఓ నరహరి!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి, పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎంతో మంది అనుమానితుల్ని విచారించిన ఈ కేసులో ఆద్యంతం నరహరి మీదే పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. కానీ ఎన్నో ట్విస్టుల అనంతరం నరహరి నిరపరాధిగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి అతడే ముందు వెళ్లి రావడం వల్ల....పోలీసు జాగిలం ఇతని ఇంటి వైపే వెళ్లడంతో.. నరహరే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఎట్టకేలకు అన్నికోణాల్లో విచారించిన పోలీసులు అసలు దోషి రాజశేఖర్ అని తేల్చడంతో నరహరి కుటుంబం ఊపిరిపీల్చుకుంది. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించి, పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన ఉప్పల్ చిలుకనగర్ నరబలి కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎంతో మంది అనుమానితుల్ని విచారించిన ఈ కేసులో ఆద్యంతం నరహరి మీదే పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. అతని ఇంటికి వెళ్లని జాగిలానికి వాసన రావడమే. ఈ నరబలి కేసులో గత నెల 31న చోటు చేసుకుని, ఈ నెల 1న వెలుగులోకి వచ్చి, 15న కొలిక్కి చేరిన విషయం విదితమే. అందరికంటే ముందు రావడంతో.. ఈ కేసులో ఆది నుంచి క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ కంటే ఎక్కువగా అతడి ఇంటి ఎదురుగా ఉండే మెకానిక్ నరహరి ప్రధాన అనుమానితుడిగా మారాడు. బాలిక తల విషయం వెలుగులోకి వచ్చిన రోజు ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు నేరుగా నరహరి ఇంటికి వెళ్లాయి. ఈ నెల ఒకటో తేదీ ఉదయం రాజశేఖర్ ఇంటి పైన ఉన్న చిన్నారి తలను చూసిన అతడి అత్త బాల లక్ష్మి అరుస్తూ అందరినీ అప్రమత్తం చేసింది. అప్పటికే రాజశేఖర్ యథావిధిగా తన క్యాబ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ అరుపులు విన్న ఎదురింట్లో ఉండే నరహరి కూడా డాబా పైకి వచ్చాడు. అక్కడున్న తలను చూసి, దగ్గర నుంచి పరిశీలించాడు. ఆపై అతడే ఫోన్ ద్వారా విషయాన్ని రాజశేఖర్‌కు సమాచారం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు వాసన చూస్తూ తొలుత వచ్చి వెళ్ళిన నరహరి ఇంట్లోకే వెళ్ళాయి. దీంతో అతడు మొదటిసారి పోలీసులకు అనుమానితుడిగా మారారు. కడిగేయడంతో ఇంట్లోకి వెళ్ళలేదు... వాస్తవానికి పోలీసు జాగిలాలు డాబా పైనుంచి వాసన చూసుకుంటూ నేరుగా రాజశేఖర్ ఇంట్లోకే వెళ్ళాల్సి ఉన్నా... ఇంటిని కడిగేయడంతో అలా జరగలేదని పోలీసులు చెబుతున్నారు. గత నెల 31న బోయగూడ నుంచి చిన్నారిని కిడ్నాప్ చేసిన రాజశేఖర్ నేరుగా ప్రతాపసింగారం వెళ్ళి హత్య చేసి మొండాన్ని మూసీలో పడేశాడు. అక్కడ నుంచి తలను ఇంటికి తీసుకువచ్చి నట్టింట్లో (రెండు గదులకు మధ్య ఉన్న ఆర్చ్ ప్రాంతంలో) పెట్టి తన భార్య శ్రీలతతో కలిసి నగ్నంగా పూజలు చేశాడు. ఆపై తలను ఇంటి పైన పెట్టిన అతగాడు భార్యతో కలిసి ఇల్లంతా కడిగేశాడు. వాసన్ని బట్టి ముందుకు వెళ్ళే పోలీసు జాగిలాలు నీళ్ళతో కడిగిన ప్రాంతంలో వాసన గుర్తించలేవు. రాజ«శేఖర్ తన ఇంటిని ఫ్లోర్ క్లీనర్లలో పూర్తిగా కడిగేసిన నేపథ్యంలో అతడి ఇంటి లోపలకు వెళ్ళకుండా సమీపంలో తిరిగాయి. ఈ డాబా పైకి వచ్చి, నేరుగా తన ఇంట్లోకి వెళ్ళడంతోనే నరహరి ఇంటి లోపల వరకు వెళ్ళి కలియ తిరిగాయి. వాసన రావడంతో మరోసారి... ఈ నెల ఒకటి నుంచే నరబలి కేసు దర్యాప్తు ప్రారంభమైంది. రాజశేఖర్, అతడి భార్యలతో పాటు నరహరి, ఇంకా అనేక మందిని పోలీసులు ప్రశ్నిస్తూ వచ్చారు. ఒక్కో రోజు గడిచే కొద్దీ పోలీసులపై ఒత్తిడి పెరుగుతూపోయింది. ఓ పక్క నిందితుల కోసం, మరోపక్క మొండెం కోసం వివిధ దఫాలుగా రాజశేఖర్, నరహరిలతో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో గాలించారు. ఈ నెల 9న నరహరి ఇంట్లో గాలిస్తుండగా వచ్చిన దుర్వానస అతడిపై పోలీసులకు మరోసారి అనుమానం బలపడేలా చేసింది. ఆ రోజు అతడి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఓ గది నుంచి తీవ్రమైన దుర్వానస వెలువడటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అందులోనే మొండాన్ని దాచి ఉండచ్చని, తొమ్మిది రోజులు గడవటంతో దుర్వాసన వస్తోందని భావించారు. మొండాన్ని వెలికి తీస్తే కేసు కొలిక్కి వచ్చినట్లేననే ఉద్దేశంతో ఆ గదిలో క్షుణ్ణంగా అణువణువూ తనిఖీ చేశారు. చివరకు అక్కడ ఓ చనిపోయిన ఎలుక దొరకడంతో నరహరిపై అనుమానాలు తొలగిపోయాయి. చీపురుకు కట్టిన ఎండు గరికతో... రాజశేఖర్‌పై అనుమానాలు బలపడటంతో ఈ నెల 9న అతడి ఇంటిని పోలీసులు మరోసారి అణువణువూ గాలించారు. ఇంటి లోపల భాగా న్ని ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తనిఖీ చేసిన పోలీసులు కొన్ని రక్తనమూనాలు కనుగొన్నారు. తల భాగం దొరికిన డాబా పైన కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో పోలీసుల దృష్టి ఓ చీపురుపై పడింది. ఇంటిలోకి ఎండ, వర్షం నీరు పడకుండా సన్‌షేడ్ మాదిరిగా ఏర్పాటు చేసిన రేకులపై అది కనిపించింది. దాన్ని తీసిన పోలీసులు వెదురు ఆకులతో చేసిందిగా గుర్తించారు. దగ్గరగా పరిశీలించగా ఆకుల మధ్య కుంకుమ కనిపించడం తో పూజలు చేసిన ఆనవాళ్ళుగా భావించారు. వీటన్నింటికీ మించి ఆ చీపురును ఓ దారంతో పాటు ఎండు గరికతో కలిపి కట్టడంతో అనుమానం బలపడింది. దీంతో రక్తనమూనాలతో పాటు ఈ నమానాలనూ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి క్షద్రపూజల విషయం నిర్థారించుకున్నారు. ఈ కేసులో హత్యకు వాడిన కత్తి, చిన్నారి తల్లిదం డ్రులు, మొండాన్ని గుర్తించడం కీలకం కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
గంగోత్రిలో మిర్యాలగూడవాసి మృతి
మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్‌బోర్డుకు చెందిన బొమ్మిడి నరహరి(22) ఉత్తరకాశీ లోని గంగోత్రి నదిలో పడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పాలేరు సమీపంలోని నాయ కన్ గూడేనికి చెందిన బొమ్మిడి మల్లయ్య బతుకుదెరువు నిమిత్తం కుటుంబ సభ్యు లతో కలసి మిర్యాలగూడకు వచ్చాడు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల రాంరెడ్డి పార్కు సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు నరహరి డెహ్రాడూన్‌లోని డీఎస్బీ వర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతూ.. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా నరహరి ఉత్తరకాశీలోని గంగోత్రి విహార యాత్రకు వెళ్లాడు. దైవ దర్శనం నిమిత్తం పక్కనే ఉన్న నదిలోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాద వశాత్తు కాలుజారి నదిలో పడి మృతి చెందాడు. మృత దేహాన్ని వెలికితీశారు. విషయం తెలుసుకున్న నరహరి కుటుంబ సభ్యులు ఉత్తరకాశీకి బయలుదేరి వెళ్లారు. కొడుకును అధికారిగా చూడాలని.. మల్లయ్య.. ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని విజయ ఆగ్రో కెమికల్స్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. నరహరి చిన్నప్పటి నుంచి చదువులో మేటి. మల్లయ్యకు తన కొడుకును అగ్రికల్చర్ అధికారిగా చూడాలన్న కోరికతోనే డెహ్రాడూన్‌కు పంపించాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అవుతాడని అనుకోలేదంటూ నరహరి తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మి, సోదరి సారికలు కన్నీటి పర్యంతమయ్యారు. -
'నన్ను 2 కోట్లు ఇవ్వాలని నయీం బెదిరించాడు'
-
'రూ.2 కోట్లు ఇవ్వాలని నయీం బెదిరించాడు'
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని భువనగిరిలో గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నయీం ఆగడాలతో బాధింపబడిన బాధితులందరూ నయీం ఎన్కౌంటర్ అనంతరం ఒక్కొక్కరూ నెమ్మదిగా బయటకు వస్తున్నారు. గతంలో నయీం ముఠా ఓ ఎలక్ట్రానిక్స్ యాజమానిని రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరించిన వైనం తాజాగా గురువారం వెలుగులోకి వచ్చింది. నందిని ఎలక్ట్రానిక్స్‌కు చెందిన యాజమని నరహరి.. తనను అప్పట్లో నయీం బెదిరించి కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్టు మీడియాను ఆశ్రయించాడు. తాను భువనగిరి మెయిన్ రోడ్డు ప్రక్కన భవనం నిర్మిస్తున్న విషయం తెలుసుకుని నయీం అనుచరులు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నయీం అనుచరులు తనవద్దకు వచ్చి తన కళ్లకు గంతలు కట్టి నయీం వద్దకు తీసుకెళ్లినట్టు బాధితుడు వాపోయాడు. తన భార్య పిల్లలను చంపేస్తానంటూ బెదిరించి.. రెండు కోట్ల రూపాయలను డిమాండ్ చేయడంతో తాను అంత సొమ్ము ఇచ్చులేనంటూ నయీం కాళ్లపై పడినట్టు తెలిపాడు. చివరికి నయీం రసీదుపై రూ. 25 లక్షలు ఇవ్వాలని రెడ్ ఇంక్‌తో రాసినట్టు బాధితుడు నరహరి మీడియాకు వివరించాడు. నయీం ఆగడాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డానని తనకు ఎలాగైనా న్యాయం చేయాలని నరహరి ప్రాధేయపడ్డాడు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి
మలక్‌పేట: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. లక్ష్మి అనే మహిళ తమ షాపునకు సంబంధించి వ్యాట్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు గాను సీనియర్ అసిస్టెంట్ నరహరి రూ.2,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కమర్షియల్ టాక్స్ ఉద్యోగి
మలక్‌పేట కమర్షియల్ టాక్స్ ఉద్యోగి నరహరి లంచం తీసుకుంటూ నాంపల్లి కమర్షియల్ టాక్స్ ఆఫీసులో ఏసీబీ అధికారులకు గురువారం చిక్కాడు. వ్యాట్ రిజిస్ట్రేషన్ కోసం లక్ష్మి అనే మహిళ నుంచి రూ.2,500 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘బంగారుతల్లి’కి బాటలేసిన నరహరి
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంటే గుండెలపై కుంపటిలా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న సమాజం.. ఇవన్నీ చూసి చలించి పోయారాయన. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు పేదవర్గాలు పడే ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించిన ఆ అధికారి.. ప్రభుత్వ పరంగా ఆడబిడ్డల పెళ్లికి ఏ విధంగా సాయపడాలనే తపన పడ్డారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి జీవనస్థితిగతులను అధ్యయనం చేసి ‘లాడ్లీ లక్ష్మీయోజన’ పథకానికి రూపకల్పన చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలులోకి తేగా, మరో పది రాష్ట్రాలు ఆ పథకాన్ని అనుసరించాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ‘బంగారు తల్లి’ పథకానికి ‘లాడ్లీ లక్ష్మీయోజన’ పథకమే ప్రేరణ. ఆ అధికారే పరికిపండ్ల నరహరి. 2001 బ్యాచ్‌కు చెందిన సివిల్ సర్వెంట్. రామగుండం మండలం బసంత్‌నగర్‌కు చెందిన నరహరి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. సిరిసిల్లలో ఆదివారం ‘పద్మ పీఠం ఆత్మీయ సత్కారం’ అందుకుంటున్నారు. సిరిసిల్ల: బసంత్‌నగర్‌లో టైలర్‌గా పని చేసే పరికిపండ్ల సత్యనారాయణ-సరోజన దంపతుల మూడో సంతానం నరహరి. 1992లో ఐఎంఎస్ఎస్ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్న నరహరి మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి. ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు పొంది కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. హైదరాబాద్ వాసవి కళాశాలలో ఇంజినీరింగ్ పట్టా సాధించారు. 1998లో అడ్వాన్స్ రీసర్చ్ విభాగంలో సైంటిస్ట్‌గా పని చేస్తూ 1999లో సివిల్స్ రాశారు. మొదటి ప్రయత్నం ఫలించలేదు. అయినా నిరాశ చెందకుండా ఉద్యో గం చేస్తూనే గంటల తరబడి చదువుతూ సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. 2001లో రెండో ప్రయత్నంలో 78 ర్యాంక్ సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకొని 2002మేలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తొలిపోస్టింగ్ పొందారు. 2003-04లో గ్వాలియర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా, 2004-05లో ఇండోర్ ఎస్డీవో(రెవెన్యూ), ఇండోర్ మున్సిపల్ కమిషనర్‌గా 2006లో పనిచేశారు. అనంతరం ఐసీడీఎస్ రాష్ట్ర కమిషనర్ గా 2007 వరకు భోపాల్‌లో విధులు నిర్వహించారు. చింద్వారా జెడ్పీ సీఈవోగా పని చేసిన తర్వాత 2007లో సియోని కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2009-11లో సింగ్రాలి కలెక్టర్‌గా పని చేసిన ఆయన 2011లో గ్వాలియర్ కలెక్టర్‌గా విధుల్లో చేరి కొనసాగుతున్నారు. లాడ్లీ లక్ష్మీయోజనకు శ్రీకారం.. కలెక్టర్‌గా, ఐసీడీఎస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు పేదలు ఆడపిల్లల పెళ్లికి పడుతున్న కష్టాలను చూసి నరహరి చలించిపోయారు. కూతురు పెళ్లి కోసం ఒక కుటుంబం పడే ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన నరహరి పేదవర్గాలకు ప్రభుత్వ సాయం అందించాలనే లక్ష్యంతో లాడ్లీ లక్ష్మీయోజన పథకానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఆయనే రూపొందించారు. ఏడాది పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి మహిళా సంఘాలతో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. నరహరి రూపొందించిన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి అమలు చేసింది. ఈ పథకం మరో పది రాష్ట్రాల్లోనూ అమలు కావడం విశేషం. ఆడపిల్లల పెళ్లి కోసం ఆసరా ఉండే మంచి పథకాన్ని మన జిల్లా బిడ్డ రూపొందించడం గర్వకారణం. బంగారుతల్లి పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయడం విశేషం. రాష్ట్రపతి సత్కారం నరహరి పని చేసేచోట తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ గుర్తింపు సాధించారు. ఐఏఎస్ అధికారిగా ఆఫీసులో కూర్చొని ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పర్యటించి అధికార యంత్రాంగాన్ని కదిలించారు. గ్వాలియర్ కలెక్టర్‌గా వికలాంగులకు చేయూతనిచ్చే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ మన్ననలు పొందారు. పర్యావరణ పరిరక్షణలో సామాజిక బాధ్యతలు గుర్తు చేస్తూ యువతరాన్ని భాగస్వాములను చేస్తూ ‘మిగిలి ఉన్న పని’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నరహరి చేపట్టారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ డిసెంబర్ 3న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సులో అవార్డు బహూకరించారు. రాష్ట్రపతి ద్వారా సత్కారం పొందిన నరహరి అంతకుముందే వివిధ హోదాల్లో పని చేస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు. జాతీయ స్థాయిలోనూ నరహరికి అవార్డు లభించడం విశేషం. రచయితగా.. కలెక్టర్‌గా నిత్యం బిజీగా ఉండే నరహరి పుస్తకాలు చదవడం, క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడడం హాబీలు. లాడ్లీ లక్ష్మీయోజన పథకాన్ని ముప్పై పేజీల డాక్యుమెంటరీ రాసిన ఆయన సాహిత్యకారుడిగా మరో కోణంలో రచనలు చేస్తున్నారు. సమర్థుడి జీవయాత్ర పేరుతో తన ఆత్మకథను ఆవిష్కరిస్తున్నారు. సమర్థ అధికారిగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే కాకుండా రచయితగా నరహరి ముందుకు సాగుతున్నారు. 2002లో శ్రీభగవద్గీతను వివాహమాడిన నరహరికి పాప శ్రీగౌరీఆలయ, బాబు అక్షర్ ఉన్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో రాము, లక్ష్మణ్, మహేశ్, శ్రీనివాస్ నలుగురు రాష్ట్రంలో వివిధ చోట్ల ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. చెల్లెలు శ్రీదేవి హైదరాబాద్‌లో డాక్టర్‌గా వైద్య సేవలందిస్తున్నారు. భార్య శ్రీభగవత్గీత గ్వాలియర్లోనే ప్రొఫెసర్. జిల్లాలోని సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నరహరి చదువులో రాణిస్తూ అత్యున్నత ఐఏఎస్ సాధించి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడం జిల్లాకే గర్వకారణం. నేడు సిరిసిల్లలో ఆత్మీయ సత్కారం పద్మపీఠం సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఆదివారం నరహరిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. స్థానిక రాజరాజేశ్వర కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో పద్మపీఠం పురస్కారంతో నిర్వాహకులు కొక్కుల భాస్కర్, నేషనల్ బుక్‌ట్రస్ట్ ఉపసంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్ సన్మానిస్తున్నారు. నరహరితో పాటు ప్రముఖ చిత్రకారుడు తెలంగాణ రాజముద్ర సృష్టికర్త ఏలె లక్ష్మణ్, సాహిత్యకారుడు, హైదరాబాద్ స్పెషల్ జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, వస్త్ర పరిశ్రమ విశ్లేషకులు మచ్చ ఆనంద్, మగ్గంపై చిత్రాలు నేసే చేనేతశిల్పి కూరపాటి శ్రీనివాస్, అగ్గిపెట్టెలో చీర, ఉంగరంలో దూరె చీర సృష్టికర్త నల్ల విజయ్‌కుమార్‌లకు ఒకే వేదికపై పురస్కారాలు అందిస్తున్నారు. -
కథ: కొసరు
కొత్త సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అనుకున్నదాని కంటే ఆడంబరంగానే జరిగింది. సాయంత్రం ఆరున్నరకు మొదలైన కార్యక్రమం ముగిసే సరికి రాత్రి తొమ్మిది దాటింది. అపరంజిత ఆడిటోరియం నుండి బయటకు వచ్చి మెట్ల పక్కగా నిలబడింది. ఆమెను కార్యక్రమానికి పిలిచి, ఆహ్వాన పత్రిక ఇంటికి వచ్చి ఇచ్చి మరీ మరీ రావాలని కోరి ఒకటికి రెండుసార్లు ఫోను చేసినవాళ్లు ఎవరూ కనబడలేదు. నిరుత్సాహపడింది. తనతో నరహరి వచ్చి ఉంటే బావుండేది. చిత్ర రంగంలో అతనికి కొద్దో గొప్పో పేరుంది. మంచి స్క్రిప్ట్ రైటర్. అతని పలుకుబడి వలనే తనకు అవకాశాలు వస్తున్నాయి. అతన్నీ ఆ కార్యక్రమానికి పిలిచారు. ఏదో కొత్త సినిమా పనిమీద ఉండటం వలన రావడం కుదరలేదు. ఆమె ఇప్పటివరకు అయిదు చిత్రాల్లో నటించింది. రెండు చిత్రాలు బాగా నడిచాయి. ఒకటి కోర్టు కేసులో ఉండి విడుదల కాలేదు. రెండు చిత్రాలు యావరేజ్‌గా నడిచాయి. చేతిలో కొత్తవేమీ లేవు. నరహరి పూనుకుంటే ముందుకు వెళ్లగలదు. అతని మీద నమ్మకం సడలుతోంది. తన మీద అతనికి అనుమానం కలుగుతున్నట్టుగా ఉంది. చిత్రరంగం గురించి తన కంటే అతనికే బాగా తెలుసు. నలుగురితో చనువుగా ఉండకపోతే ఎక్కడికక్కడ నొక్కేస్తుంటారు. కత్తిమీద సాములా ఉంటోంది. కొన్నిసార్లు తప్పించుకోడానికి వీలుండదు. ఏ ప్రామిస్సూ నిలవదు. నిరాశకు లోనవుతోంది. ఏం చేయాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. తెలిసినవాళ్లు ఎవరైనా కనిపిస్తారేమోనని కొద్దిసేపు ఎదురుచూసింది. కనిపించారు కాని, లిఫ్ట్ ఇవ్వాల్సివస్తుందేమోనని తల తిప్పుకుని వెళ్లిపోయారు. ఎవరి మీద ఆధారపడటం ఇష్టమనిపించలేదు. ట్యాక్సీ పట్టుకుని ఇంటికి వెళ్లడం మంచిదనిపించింది. కార్లు పలచబడ్డాయి. మెట్లు దిగి ప్రాంగణంలోంచి బయటకు వచ్చి కాలిబాట మీద నుంచుంది. చల్లటి గాలి విసురుగా వీస్తోంది. పైట భుజాల నిండా కప్పుకుంది. టాక్సీలు లేవు. ఖాళీగా ఉన్న ఆటోను పిలవబోతోంటే తెల్ల రంగు కారు మెల్లగా వచ్చి, ఆమె ముందు ఆగింది. ఎవరిదై ఉంటుందా అనుకుని తొంగిచూసే లోపల ముందు తలుపు తెరుచుకుని రంగరాజు ముఖం కనిపించింది. చేయి ఊపుతూ ‘‘రా, కూర్చో’’ అన్నాడు. అతని కారులో కూర్చోడం ఇష్టం లేకపోయినా, కూర్చోక తప్పలేదు. కారు ముందుకు కదిలింది. వారాంతం అవటాన రోడ్డు మీద ట్రాఫిక్ అట్టే లేదు. లోపల లైటు ఆర్పేసి, ఆమె చేతి మీద తన చేయి వేసి, ‘‘మనం కలిసి చాలా కాలమైంది కదూ’’ అన్నాడు. ఆమె చేయి వెనక్కి తీసుకోలేదు. అతని చేయి వేడిగా ఉంది. ‘ఊ’ అంది. రంగరాజు ఒక నిర్మాత తమ్ముడు. నాలుగైదు సినిమాల్లో చిన్న పాత్రలు వేశాడు కాని, ఎదగలేకపోయాడు. ముప్ఫై సంవత్సరాలుంటాయి. జిమ్‌కు వెళ్తుంటాడనుకుంటా, బాడీ గట్టిగా ఉంటుంది, తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. ‘‘మిమ్మల్ని స్టేజీ మీదకు పిలిచారు. వెళ్లారు గాని ఏం మాట్లాడలేదు. వినీ వినబడకుండా థాంక్స్ అని చెప్పారు.’’ నాలుగు గోడల మధ్య తప్ప మిగిలిన సమయాల్లో గౌరవంగానే సంబోధిస్తుంటాడు. నవ్వేసి ఊరుకుంది. ‘‘మీరొక్కరే వచ్చారేం? మీవారు రాలేదు.’’ అతను నరహరి గురించి అన్నాడు. నరహరి ఆమె భర్త అని కొంతమంది అనుకుంటుంటారు. ‘‘అతను మా ఆయన కాదు. మా అమ్మకు దూరపు చుట్టమవుతాడు. అంతే!’’ అతను అలా అనడం ఆమె కాదనడం అది మూడో సారో, నాలుగో సారో! కావాలని అంటున్నాడో, మర్చిపోయి అడుగుతున్నాడో అర్థం కాలేదు. నరహరి రంగరాజు మీద సౌమ్యుడు. ఇబ్బంది కలిగించడు. ఆమె తల్లి కూడా అతనంటే ఇష్టపడుతుంది. అపరంజితకు గత నాలుగైదు నెలలుగా నరహరి అంటే ఆసక్తి తగ్గిపోయింది. మునుపటిలా కలిసి భోజనం చేయడం లేదు. అతను ఉండే మేడ గదిలోంచి ఎప్పుడో గాని బయటకు రావడం లేదు. ఏవేవో రాస్తున్నాడు కాని, ఏదీ క్లిక్ కావడం లేదు. అతని అవసరం ఉన్నట్టు అనిపించడం లేదు. ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో తెలియడం లేదు. ఆమె తల్లికి కూడా అటువంటి ఆలోచనే ఉంది. ‘తొందరపడొద్దు. చేసేదేదో పకడ్బందీగా చేద్దాం. మనకు అపవాదు రాకూడదు’ అంది. తల్లి ఊరెళ్లి రెండు వారాలు అవుతుంది. రేపో మాపో రావాలి. ‘‘లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామా?’’ అడిగాడు, ఆమె తొడ మీద చేయి వేసి. చేయి బలంగా ఉంది. ఒక్క చేత్తో డ్రైవింగ్ చేస్తున్నాడు. చూపు రోడ్డుమీద ఉంది. లాంగ్ డ్రైవ్‌కు వెళ్తే అతన్ని ఆపడం కష్టం. నాలుగైదుసార్లు లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లాడు. ‘‘ఇంట్లో అమ్మ ఉంది. అరగంట ఆలస్యం అయితే ఊరుకోదు. రాత్రంతా తిట్లు తినాల్సి వస్తుంది’’ అబద్ధం చెప్పింది. ‘‘ఎక్కువ సమయం తీసుకోను. త్వరగానే తిరిగొచ్చేద్దాం.’’ అతని చేతిమీద గిచ్చి, ‘‘ఇవేళ వద్దు’’ అంది. ‘‘నీ ఇష్టం’’ అని కారు యూటర్న్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చాక కాలింగ్ బెల్ నొక్కబోతూ తలుపు నెట్టింది. లోపల గడియపెట్టి లేదు. తెరుచుకుంది. లోపలికి వచ్చి, గడి పెడుతూ తలుపు గడియపెట్టనందుకు నరహరిని తిట్టుకుంటూ, ‘ఎవరైనా వచ్చి ఏదైనా తీసుకువెళ్లుంటే’ అనుకుంది. ‘ఈ మనిషిని చంపేస్తే తనకు పట్టిన శని విరగడవుతుందేమో’ అని కూడా అనుకుంది. వెంటనే పాపం అనిపించింది. భోజనాల బల్లమీద తను వెళ్తూ పెట్టిన భోజన పదార్థాలు అలానే ఉన్నాయి. తినలేదు. తను వెళ్లాక మేడ గదిలోంచి కిందకు వచ్చి ఉండడు. వండినదంతా వేస్ట్ అవుతుంది. అతన్ని భరించడం కష్టమవుతోంది. మేడ ఎక్కి అతని గదిలోకి అడుగుపెడుతోంటే బల్ల మీద కూర్చుని రాసుకుంటున్నవాడు వెనక్కి తిరిగి చూడకుండా, ‘‘కార్యక్రమం ఎలా జరిగింది?’’ అనడిగాడు. ‘‘బాగానే జరిగింది. భోజనం చేయలేదేం?’’ బల్ల పక్కగా నుంచుని అడిగింది కోపం బయట పడనీయకుండా. ‘‘ఆకలిగా అనిపించలేదు. ఈ స్క్రిప్ట్ పని ముగింపుకు వచ్చింది. రేపు వాళ్లకిచ్చేస్తే నా పనైపోతుంది. ఇహ ఏ పనులూ ఒప్పుకోదల్చుకోలేదు. జీవితం మీద విసుగు పుడుతోంది. చనిపోవాలని ఉంది. నవ్వకు. నిజంగా అంటున్నాను. ఈ కాయితం చదువు’’ ఆమెకు కాయితం ఇచ్చాడు. అందులో ఇలా ఉంది: ‘‘జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’’ పేరు, సంతకం, తేదీ, సమయం ఉన్నాయి. కాయితం తిరిగి అతనికి ఇచ్చేసింది. బల్ల సొరుగులో పెట్టుకున్నాడు. అతని తల నిమురుతూ, ‘‘అలాంటి పిచ్చిపనులు చేయకు’’ అంది. ‘‘ఏం చేయను చెప్పు?’’ ‘‘నీ కోసం పాలు వేడి చేసి తీసుకువస్తాను’’ అతని జవాబుకై ఎదురుచూడకుండా కిందకు దిగి వంట గదిలోకి వచ్చి, ఫ్రిజ్‌లోంచి పాలు తీసి వేడిచేసి పెద్ద గ్లాసు నిండా పోసింది. స్టౌ పైన ఉన్న సొరుగులోంచి చిన్న ప్లాస్టిక్ డబ్బా మూత తెరిచి చూసింది. సగం వరకు నిద్రమాత్రలు ఉన్నాయి. తను రోజూ వేసుకుంటుంది. కనీసం ఒకటైనా వేసుకోకపోతే నిద్రపట్టదు. రెండు మాత్రలు మటుకు ఉంచి, మిగిలినవన్నీ పాల గ్లాసులో వేసి ప్లాస్టిక్ డబ్బా తిరిగి సొరుగులో పెట్టి స్పూనుతో అయిదు నిమిషాల పాటు మాత్రలన్నీ కరిగేలా కలిపి, గ్లాసు ఎత్తి పట్టుకుని చూసింది. ఏవీ కనబడటం లేదు. స్పూనుతో పాలు తీసి రుచి చూసింది. రుచిలో తేడా కనిపించలేదు. గ్లాసు పైటతో శుభ్రంగా తుడిచి, వేగంగా కొట్టుకుంటున్న గుండెను చిక్కబట్టుకుని ఒక్కో మెట్టు మెల్లగా ఎక్కి, నరహరి గదిలోకి వచ్చి, పాలగ్లాసు అతని ముందు పెట్టింది. ‘థేంక్స్’ అని గ్లాసు అందుకుని, ఆమె ముఖంలోకి చూస్తూ గ్లాసు ఖాళీ చేసి బల్లకు ఒక పక్కగా పెట్టాడు. ‘‘నే వెళ్తాను. నిద్ర వస్తోంది’’ అంది. ‘సరే’ అన్నట్టు తలూపాడు. ఆమెకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. తను తప్పు చేస్తున్నట్టు అనిపించింది. కిందకు దిగి వచ్చి లైట్లార్పి పడక గదిలోని మంచం మీద పడుకుంది. అరగంట తర్వాత నిద్రలోకి జారుకోబోతున్న సమయంలో వంట గదిలో అయిన చప్పుడుకు నిద్ర పక్కకు జరిగింది. లేచి కూర్చుంది. తను చేసిన పనికి భయం వళ్లంతా పాకింది. అలా వేయకుండా ఉండాల్సింది అని చేసిన తర్వాత పదే పదే అనుకుంది. మధ్యలో నిద్ర భంగమైతే వెంటనే నిద్రపట్టదు. నరహరి ఆలోచనలే మాటిమాటికీ గుర్తు వస్తున్నాయి. వంట గదిలో లైటు వెలుగుతోంది. దుప్పటి పక్కకు తీసి కాళ్లు కిందపెట్టి చెప్పులు తొడుక్కుంది. తను పాలలో కలిపిన మాత్రలు పనిచేయలేదా? అవి పనిచేయడానికి సమయం పడుతుందా? లేక తనిలా మేడ గదిలోంచి కిందకు రాగానే బాత్రూమ్కు వెళ్లి తాగిన పాలన్నీ కక్కేశాడా? అయిదు నిమిషాల తర్వాత వంట గదిలో లైటు ఆరిపోయింది. అతను మెట్లు ఎక్కుతున్న చప్పుడు, వెనక తలుపు మూసుకున్న శబ్దం వినిపించింది. నిద్ర పూర్తిగా ఎగిరిపోయింది. నిద్ర పట్టాలంటే నిద్రమాత్రలు వేసుకోక తప్పదు. ప్లాస్టిక్ డబ్బాలో రెండు వదిలిపెట్టిన విషయం గుర్తు వచ్చింది. చప్పుడు కాకుండా వంట గదిలోకి నడిచి లైటు వేసి ప్లాస్టిక్ డబ్బా అందుకుని మూత తెరిచి, అందులోని మాత్రలను అరచేతిలోకి తీసుకుని అందులో ఉన్న చిన్న కాయితం అందుకుంది. అది ఇందాక లేదు. మాత్రలు నోట్లో వేసుకుని కాయితంలో ఉంది చదవసాగింది. ‘‘నన్ను చంపాలని ఎందుకు అనుకున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు వేసుకున్నవి నిద్రమాత్రలు కావు. సైనైడ్వి...’’ ఇంకేం చదవలేకపోయింది. అప్పటికి ఆ మాత్రలు నోట్లో కరిగిపోయాయి. -
పల్స్‌పోలియోకు మంచి స్పందన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఐదేళ్లు నిండిన 7,01,447 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఈమేరకు కార్యాచరణకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం వరకు 6,71,149 (95.68 శాతం)మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కాగా వంద శాతం లక్ష్యాన్ని సాధించేందుకుగాను సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మాస్‌మీడియా అధికారి నరహరి తెలిపారు. ప్రజలు కూడా పల్స్ పోలియో లక్ష్య సాధనకు సహకరించాలని ఆయన కోరారు.