(ప్రతీకాత్మక చిత్రం)
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి, పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎంతో మంది అనుమానితుల్ని విచారించిన ఈ కేసులో ఆద్యంతం నరహరి మీదే పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. కానీ ఎన్నో ట్విస్టుల అనంతరం నరహరి నిరపరాధిగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి అతడే ముందు వెళ్లి రావడం వల్ల....పోలీసు జాగిలం ఇతని ఇంటి వైపే వెళ్లడంతో.. నరహరే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఎట్టకేలకు అన్నికోణాల్లో విచారించిన పోలీసులు అసలు దోషి రాజశేఖర్ అని తేల్చడంతో నరహరి కుటుంబం ఊపిరిపీల్చుకుంది.
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించి, పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన ఉప్పల్ చిలుకనగర్ నరబలి కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎంతో మంది అనుమానితుల్ని విచారించిన ఈ కేసులో ఆద్యంతం నరహరి మీదే పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. అతని ఇంటికి వెళ్లని జాగిలానికి వాసన రావడమే. ఈ నరబలి కేసులో గత నెల 31న చోటు చేసుకుని, ఈ నెల 1న వెలుగులోకి వచ్చి, 15న కొలిక్కి చేరిన విషయం విదితమే.
అందరికంటే ముందు రావడంతో..
ఈ కేసులో ఆది నుంచి క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ కంటే ఎక్కువగా అతడి ఇంటి ఎదురుగా ఉండే మెకానిక్ నరహరి ప్రధాన అనుమానితుడిగా మారాడు. బాలిక తల విషయం వెలుగులోకి వచ్చిన రోజు ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు నేరుగా నరహరి ఇంటికి వెళ్లాయి. ఈ నెల ఒకటో తేదీ ఉదయం రాజశేఖర్ ఇంటి పైన ఉన్న చిన్నారి తలను చూసిన అతడి అత్త బాల లక్ష్మి అరుస్తూ అందరినీ అప్రమత్తం చేసింది. అప్పటికే రాజశేఖర్ యథావిధిగా తన క్యాబ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ అరుపులు విన్న ఎదురింట్లో ఉండే నరహరి కూడా డాబా పైకి వచ్చాడు. అక్కడున్న తలను చూసి, దగ్గర నుంచి పరిశీలించాడు. ఆపై అతడే ఫోన్ ద్వారా విషయాన్ని రాజశేఖర్‌కు సమాచారం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు వాసన చూస్తూ తొలుత వచ్చి వెళ్ళిన నరహరి ఇంట్లోకే వెళ్ళాయి. దీంతో అతడు మొదటిసారి పోలీసులకు అనుమానితుడిగా మారారు.
కడిగేయడంతో ఇంట్లోకి వెళ్ళలేదు...
వాస్తవానికి పోలీసు జాగిలాలు డాబా పైనుంచి వాసన చూసుకుంటూ నేరుగా రాజశేఖర్ ఇంట్లోకే వెళ్ళాల్సి ఉన్నా... ఇంటిని కడిగేయడంతో అలా జరగలేదని పోలీసులు చెబుతున్నారు. గత నెల 31న బోయగూడ నుంచి చిన్నారిని కిడ్నాప్ చేసిన రాజశేఖర్ నేరుగా ప్రతాపసింగారం వెళ్ళి హత్య చేసి మొండాన్ని మూసీలో పడేశాడు. అక్కడ నుంచి తలను ఇంటికి తీసుకువచ్చి నట్టింట్లో (రెండు గదులకు మధ్య ఉన్న ఆర్చ్ ప్రాంతంలో) పెట్టి తన భార్య శ్రీలతతో కలిసి నగ్నంగా పూజలు చేశాడు. ఆపై తలను ఇంటి పైన పెట్టిన అతగాడు భార్యతో కలిసి ఇల్లంతా కడిగేశాడు. వాసన్ని బట్టి ముందుకు వెళ్ళే పోలీసు జాగిలాలు నీళ్ళతో కడిగిన ప్రాంతంలో వాసన గుర్తించలేవు. రాజ«శేఖర్ తన ఇంటిని ఫ్లోర్ క్లీనర్లలో పూర్తిగా కడిగేసిన నేపథ్యంలో అతడి ఇంటి లోపలకు వెళ్ళకుండా సమీపంలో తిరిగాయి. ఈ డాబా పైకి వచ్చి, నేరుగా తన ఇంట్లోకి వెళ్ళడంతోనే నరహరి ఇంటి లోపల వరకు వెళ్ళి కలియ తిరిగాయి.
వాసన రావడంతో మరోసారి...
ఈ నెల ఒకటి నుంచే నరబలి కేసు దర్యాప్తు ప్రారంభమైంది. రాజశేఖర్, అతడి భార్యలతో పాటు నరహరి, ఇంకా అనేక మందిని పోలీసులు ప్రశ్నిస్తూ వచ్చారు. ఒక్కో రోజు గడిచే కొద్దీ పోలీసులపై ఒత్తిడి పెరుగుతూపోయింది. ఓ పక్క నిందితుల కోసం, మరోపక్క మొండెం కోసం వివిధ దఫాలుగా రాజశేఖర్, నరహరిలతో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో గాలించారు. ఈ నెల 9న నరహరి ఇంట్లో గాలిస్తుండగా వచ్చిన దుర్వానస అతడిపై పోలీసులకు మరోసారి అనుమానం బలపడేలా చేసింది. ఆ రోజు అతడి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఓ గది నుంచి తీవ్రమైన దుర్వానస వెలువడటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అందులోనే మొండాన్ని దాచి ఉండచ్చని, తొమ్మిది రోజులు గడవటంతో దుర్వాసన వస్తోందని భావించారు. మొండాన్ని వెలికి తీస్తే కేసు కొలిక్కి వచ్చినట్లేననే ఉద్దేశంతో ఆ గదిలో క్షుణ్ణంగా అణువణువూ తనిఖీ చేశారు. చివరకు అక్కడ ఓ చనిపోయిన ఎలుక దొరకడంతో నరహరిపై అనుమానాలు తొలగిపోయాయి.
చీపురుకు కట్టిన ఎండు గరికతో...
రాజశేఖర్‌పై అనుమానాలు బలపడటంతో ఈ నెల 9న అతడి ఇంటిని పోలీసులు మరోసారి అణువణువూ గాలించారు. ఇంటి లోపల భాగా న్ని ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తనిఖీ చేసిన పోలీసులు కొన్ని రక్తనమూనాలు కనుగొన్నారు. తల భాగం దొరికిన డాబా పైన కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో పోలీసుల దృష్టి ఓ చీపురుపై పడింది. ఇంటిలోకి ఎండ, వర్షం నీరు పడకుండా సన్‌షేడ్ మాదిరిగా ఏర్పాటు చేసిన రేకులపై అది కనిపించింది. దాన్ని తీసిన పోలీసులు వెదురు ఆకులతో చేసిందిగా గుర్తించారు. దగ్గరగా పరిశీలించగా ఆకుల మధ్య కుంకుమ కనిపించడం తో పూజలు చేసిన ఆనవాళ్ళుగా భావించారు. వీటన్నింటికీ మించి ఆ చీపురును ఓ దారంతో పాటు ఎండు గరికతో కలిపి కట్టడంతో అనుమానం బలపడింది. దీంతో రక్తనమూనాలతో పాటు ఈ నమానాలనూ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి క్షద్రపూజల విషయం నిర్థారించుకున్నారు. ఈ కేసులో హత్యకు వాడిన కత్తి, చిన్నారి తల్లిదం డ్రులు, మొండాన్ని గుర్తించడం కీలకం కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment