raja shekar
-
TSPSC: 40 లక్షలకు మూడు ఏఈ పేపర్లు లీక్.. సినిమా రేంజ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్ ఇప్పటికే స్పీడ్ పెంచింది. కాగా, తాజాగా టీఎస్పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్ రూ.40 లక్షలకు అమ్మినట్టు విచారణలో తేలింది. ఇందుకు రూ. 25 లక్షలను రాజేశ్ అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బును పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుల నుంచి పోలీసులు.. రూ. 8.5 లక్షలను రికవరీ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్.. రేణుకకు పేపర్ లీక్ చేశాడు. నమ్మకమైన వారికి పేపర్ అమ్మాలని రేణుకకు సూచించాడు. ఈ సందర్బంగా రూ. 10లక్షలకు రేణుకతో బేరం కుదుర్చుకున్నాడు. దీంతో, రేణుక వద్ద నుంచి ప్రవీణ్ అడ్వాన్స్‌గా రూ. 5లక్షలు తీసుకున్నాడు. ఇక, ఈ పేపర్లను రేణుక తన భర్త డాక్యానాయక్ ద్వారా అమ్మకానికి పెట్టింది. వారి సమీప బంధువైన రాజేశ్వర్‌కు పేపర్ విషయం చెప్పి అమ్మాలని సూచించారు. రంగంలోకి దిగిన రాజేశ్వర్.. మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ. 40 లక్షలకు పేపర్లను విక్రయించాడు. వారి వద్ద నుంచి అడ్వాన్స్‌గా రూ. 23 లక్షలు తీసుకున్నాడు. అనంతరం, రూ.10లక్షలు డాక్యానాయక్‌కు ఇచ్చిన రాజేశ్వర్. ఇక, ఇందులో నుంచి మరో రూ.5లక్షలను ప్రవీణ్‌కు డాక్యా నాయక్ ఇచ్చాడు. అయితే, రాజేశ్వర్ తల్లి గండీడ్(మండలం) మన్సూర్‌పల్లి తండా సర్పంచ్. పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో రూ. 8లక్షలు వెచ్చించి ఊరిలో రాజేశ్వర్ అభివృద్ధి పనులు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక రూ.8లక్షలు తీసుకుందామని రాజేశ్వర్ ప్లాన్ చేసుకున్నాడు. -
ఆఫీస్ బాయ్ నుంచి మోడలింగ్‌లోకి వచ్చా: రాజశేఖర్
Raja Shekar In Bigg Boss 6 Telugu: గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా మోడలింగ్ రంగం నుంచి ఒకరు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో అలీ రెజా, అనిల్ రాథోడ్, జెస్సీలు మోడలింగ్ రంగం నుంచి బిగ్‌బాస్‌లో పార్టిసిపెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మోడల్ రాజశేఖర్‌కు ఈ అవకాశం వరించింది.కల్యాణ వైభోగం, మనసు మమత సీరియల్స్‌తో పాటు మేజర్ సినిమాలోనూ రాజశేఖర్ నటించాడు. అంతేకాకుండా ఇతను బిగ్‌బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీకి మంచి ఫ్రెండ్ అని సమాచారం. మరి ఈ మోడల్ రాజశేఖర్ బిగ్‌బాస్-6లో ఎలా అలరిస్తాడో చూద్దాం. -
సౌందర్య, రంభ ఉన్నారని సంతోషపడ్డా.. హీరోగా నన్ను తీసేశారు : శ్రీకాంత్
విలన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత వరుస కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా మారాడు శ్రీకాంత్. కొన్నాళ్ల పాటు హీరోగా పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. మరోవైపు సపోర్టింగ్ యాక్టర్‌గానూ రాణించాడు. చాలా కాలం తర్వాత ‘అఖండ’తో మళ్లీ విలన్‌గా మారాడు శ్రీకాంత్. అయితే తన కెరీర్ స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారట శ్రీకాంత్. హీరోగా చాన్స్‌లు రాకపోవడంతో వరుసగా విలన్ పాత్రలు చేసుకుంటూ వెళ్లారట. తమ్మారెడ్డి భరద్వాజ్ తనలో హీరోని చూసి.. వన్‌బై టు చిత్రంలో అవకాశం ఇచ్చారట. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆమె, తాజ్‌మహాల్ చిత్రాలు నా కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యాయి. పెళ్లి సందడి తర్వాత వెనక్కితిరిగి చూడలేదు. ఒకనొక దశలో ఏడాదిలో 13 సినిమాల్లో నటించాను. పగలు ఒక సినిమా, రాత్రి ఒక సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి’అని శ్రీకాంత్ చెపుకొచ్చారు. అలాగే రాజశేఖర్ హీరోగా నటించిన వేటగాడు సినిమాలో తొలుత తననే హీరోగా తీసుకున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల పక్కకు తప్పించారని చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో సౌందర్య, రంభ హీరోయిన్లు అని తెలియడంతో చాలా సంతోషపడ్డానని, కానీ చివరి క్షణంలో తీసేయడంతో అంతకు ఎక్కువగా బాధపడ్డానని చెప్పాడు. అయితే హీరోగా తొలగించినప్పటికీ.. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను చేశానని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. -
రాజ'శేఖర్'లో శివానీ రాజశేఖర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్'. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. ఈ రోజు సినిమా యూనిట్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది. హీరోగా రాజశేఖర్ 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది. దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో... సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామం" అని చెప్పారు. -
ఆచార్య ఆగితే.. ‘శేఖర్’ వస్తాడట
Chiranjeevi Acharya Movie Updates: ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఎలాగూ జనవరి మూవీస్ రిలీజెస్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరిలోనూ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ అభిమానులను మరోసారి డిజప్పాయింట్ చేస్తూ ఆచార్య, ఖిలాడి లాంటి సినిమాలు మరో మంచి రిలీజ్ డేట్ వైపు చూసే ఆప్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ కావాల్సి ఉంది. రెండేళ్లుగా మెగాభిమానలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఇది. ఎట్టకేలకు ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ అవుతోంది. అందుకు తగ్గట్లే కొరటాలశివ సినిమా ప్రమోషన్ ను సాగిస్తున్నాడు. లాహే, నీలాంబరి, సానా కష్టం లాంటి సింగిల్స్ రిలీజ్ చేసాడు. చిరు, చరణ్ లపై స్పెషల్ టీజర్స్ విడుదల చేసాడు. కాని ఇప్పుడు ఈ మెగా మల్టీస్టారర్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. ఫిబ్రవరి 4న ఆచార్య పోస్ట్ పోన్ అయితే ఆ స్థానంలో శేఖర్ వస్తాడట. 2018 మలయాళ బ్లాక్ బస్టర్ జోసెఫ్ మూవీ తెలుగు రీమేక్ ఇది. నిజానికి ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆచార్య పోస్ట్ పోన్ కానుందనే టాక్ బయటికి రావడంతో ఆ డేట్ పై రాజశేఖర్ కన్నేశాడు. -
‘శేఖర్’ ఫస్ట్ గ్లింప్స్.. రాజశేఖర్ లుక్ అదిరిందిగా!
రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’. ఆయన సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని గురువారం విడుదల చేశారు. ‘అరకు బోసుగూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు’ అంటూ ఓ మహిళ వాయిస్ ఓవర్‌తో ఫస్ట్ గ్లింప్స్ మొదలైంది. ‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?’ అంటూ రాజశేఖర్ చేసిన శేఖర్ పాత్ర పరిచయానికి సంబంధించిన సంభాషణలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తాయి. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్ నటించిన 91వ చిత్రమిది. ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది. 2022 జనవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ట్రైలర్ చాలా బాగుంది
‘‘అవలంబిక’ ట్రైలర్ చాలా బాగుంది. రాజశేఖర్ చాలా కష్టపడి ఈ సినిమాని చేశాడని తెలుస్తోంది. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. సుజయ్, అర్చన (వేద) జంటగా రాజశేఖర్ (రాజ్) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అవలంబిక’. శ్రీ షిరిడీ సాయి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై జి.శ్రీనివాస్ గౌడ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నాగబాబు విడుదల చేశారు. ‘‘ఈ సినిమాని భారీ గ్రాఫిక్స్‌తో చిత్రీకరించాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు రాజశేఖర్. ‘‘ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్‌గా ఈ చిత్రం నిర్మించాం’’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుజయ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకీ పెద్దాడ, సంగీతం: ఉదయ్ కిరణ్. -
రేపు ‘కల్కి’ టీజర్ విడుదల
‘గరుడవేగ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హీరో రాజశేఖర్. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్‌ను ఈ మూవీతో సాధించారు రాజశేఖర్. మళ్లీ ‘కల్కి’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ వర్మ ‘అ!’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడిగా మంచి పేరును సంపాదించాడు. తన తదుపరి చిత్రంగా.. 1980 నేపథ్యంలో సాగే డిఫరెంట్ స్టోరీతో కల్కి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ మోషన్ పోస్టర్‌తోనే ఆకట్టుకుంది. రాజశేఖర్ పుట్టినరోజు (ఫిబ్రవరి 4)న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
కుక్క.. ఎలుక..ఓ నరహరి!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి, పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎంతో మంది అనుమానితుల్ని విచారించిన ఈ కేసులో ఆద్యంతం నరహరి మీదే పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. కానీ ఎన్నో ట్విస్టుల అనంతరం నరహరి నిరపరాధిగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి అతడే ముందు వెళ్లి రావడం వల్ల....పోలీసు జాగిలం ఇతని ఇంటి వైపే వెళ్లడంతో.. నరహరే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఎట్టకేలకు అన్నికోణాల్లో విచారించిన పోలీసులు అసలు దోషి రాజశేఖర్ అని తేల్చడంతో నరహరి కుటుంబం ఊపిరిపీల్చుకుంది. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించి, పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన ఉప్పల్ చిలుకనగర్ నరబలి కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎంతో మంది అనుమానితుల్ని విచారించిన ఈ కేసులో ఆద్యంతం నరహరి మీదే పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. అతని ఇంటికి వెళ్లని జాగిలానికి వాసన రావడమే. ఈ నరబలి కేసులో గత నెల 31న చోటు చేసుకుని, ఈ నెల 1న వెలుగులోకి వచ్చి, 15న కొలిక్కి చేరిన విషయం విదితమే. అందరికంటే ముందు రావడంతో.. ఈ కేసులో ఆది నుంచి క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ కంటే ఎక్కువగా అతడి ఇంటి ఎదురుగా ఉండే మెకానిక్ నరహరి ప్రధాన అనుమానితుడిగా మారాడు. బాలిక తల విషయం వెలుగులోకి వచ్చిన రోజు ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు నేరుగా నరహరి ఇంటికి వెళ్లాయి. ఈ నెల ఒకటో తేదీ ఉదయం రాజశేఖర్ ఇంటి పైన ఉన్న చిన్నారి తలను చూసిన అతడి అత్త బాల లక్ష్మి అరుస్తూ అందరినీ అప్రమత్తం చేసింది. అప్పటికే రాజశేఖర్ యథావిధిగా తన క్యాబ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ అరుపులు విన్న ఎదురింట్లో ఉండే నరహరి కూడా డాబా పైకి వచ్చాడు. అక్కడున్న తలను చూసి, దగ్గర నుంచి పరిశీలించాడు. ఆపై అతడే ఫోన్ ద్వారా విషయాన్ని రాజశేఖర్‌కు సమాచారం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు వాసన చూస్తూ తొలుత వచ్చి వెళ్ళిన నరహరి ఇంట్లోకే వెళ్ళాయి. దీంతో అతడు మొదటిసారి పోలీసులకు అనుమానితుడిగా మారారు. కడిగేయడంతో ఇంట్లోకి వెళ్ళలేదు... వాస్తవానికి పోలీసు జాగిలాలు డాబా పైనుంచి వాసన చూసుకుంటూ నేరుగా రాజశేఖర్ ఇంట్లోకే వెళ్ళాల్సి ఉన్నా... ఇంటిని కడిగేయడంతో అలా జరగలేదని పోలీసులు చెబుతున్నారు. గత నెల 31న బోయగూడ నుంచి చిన్నారిని కిడ్నాప్ చేసిన రాజశేఖర్ నేరుగా ప్రతాపసింగారం వెళ్ళి హత్య చేసి మొండాన్ని మూసీలో పడేశాడు. అక్కడ నుంచి తలను ఇంటికి తీసుకువచ్చి నట్టింట్లో (రెండు గదులకు మధ్య ఉన్న ఆర్చ్ ప్రాంతంలో) పెట్టి తన భార్య శ్రీలతతో కలిసి నగ్నంగా పూజలు చేశాడు. ఆపై తలను ఇంటి పైన పెట్టిన అతగాడు భార్యతో కలిసి ఇల్లంతా కడిగేశాడు. వాసన్ని బట్టి ముందుకు వెళ్ళే పోలీసు జాగిలాలు నీళ్ళతో కడిగిన ప్రాంతంలో వాసన గుర్తించలేవు. రాజ«శేఖర్ తన ఇంటిని ఫ్లోర్ క్లీనర్లలో పూర్తిగా కడిగేసిన నేపథ్యంలో అతడి ఇంటి లోపలకు వెళ్ళకుండా సమీపంలో తిరిగాయి. ఈ డాబా పైకి వచ్చి, నేరుగా తన ఇంట్లోకి వెళ్ళడంతోనే నరహరి ఇంటి లోపల వరకు వెళ్ళి కలియ తిరిగాయి. వాసన రావడంతో మరోసారి... ఈ నెల ఒకటి నుంచే నరబలి కేసు దర్యాప్తు ప్రారంభమైంది. రాజశేఖర్, అతడి భార్యలతో పాటు నరహరి, ఇంకా అనేక మందిని పోలీసులు ప్రశ్నిస్తూ వచ్చారు. ఒక్కో రోజు గడిచే కొద్దీ పోలీసులపై ఒత్తిడి పెరుగుతూపోయింది. ఓ పక్క నిందితుల కోసం, మరోపక్క మొండెం కోసం వివిధ దఫాలుగా రాజశేఖర్, నరహరిలతో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో గాలించారు. ఈ నెల 9న నరహరి ఇంట్లో గాలిస్తుండగా వచ్చిన దుర్వానస అతడిపై పోలీసులకు మరోసారి అనుమానం బలపడేలా చేసింది. ఆ రోజు అతడి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఓ గది నుంచి తీవ్రమైన దుర్వానస వెలువడటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అందులోనే మొండాన్ని దాచి ఉండచ్చని, తొమ్మిది రోజులు గడవటంతో దుర్వాసన వస్తోందని భావించారు. మొండాన్ని వెలికి తీస్తే కేసు కొలిక్కి వచ్చినట్లేననే ఉద్దేశంతో ఆ గదిలో క్షుణ్ణంగా అణువణువూ తనిఖీ చేశారు. చివరకు అక్కడ ఓ చనిపోయిన ఎలుక దొరకడంతో నరహరిపై అనుమానాలు తొలగిపోయాయి. చీపురుకు కట్టిన ఎండు గరికతో... రాజశేఖర్‌పై అనుమానాలు బలపడటంతో ఈ నెల 9న అతడి ఇంటిని పోలీసులు మరోసారి అణువణువూ గాలించారు. ఇంటి లోపల భాగా న్ని ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తనిఖీ చేసిన పోలీసులు కొన్ని రక్తనమూనాలు కనుగొన్నారు. తల భాగం దొరికిన డాబా పైన కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో పోలీసుల దృష్టి ఓ చీపురుపై పడింది. ఇంటిలోకి ఎండ, వర్షం నీరు పడకుండా సన్‌షేడ్ మాదిరిగా ఏర్పాటు చేసిన రేకులపై అది కనిపించింది. దాన్ని తీసిన పోలీసులు వెదురు ఆకులతో చేసిందిగా గుర్తించారు. దగ్గరగా పరిశీలించగా ఆకుల మధ్య కుంకుమ కనిపించడం తో పూజలు చేసిన ఆనవాళ్ళుగా భావించారు. వీటన్నింటికీ మించి ఆ చీపురును ఓ దారంతో పాటు ఎండు గరికతో కలిపి కట్టడంతో అనుమానం బలపడింది. దీంతో రక్తనమూనాలతో పాటు ఈ నమానాలనూ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి క్షద్రపూజల విషయం నిర్థారించుకున్నారు. ఈ కేసులో హత్యకు వాడిన కత్తి, చిన్నారి తల్లిదం డ్రులు, మొండాన్ని గుర్తించడం కీలకం కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారి నరబలి కేసులో షాకింగ్ నిజాలు!