‘గరుడవేగ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హీరో రాజశేఖర్. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్‌ను ఈ మూవీతో సాధించారు రాజశేఖర్. మళ్లీ ‘కల్కి’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు.
ప్రశాంత్ వర్మ ‘అ!’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడిగా మంచి పేరును సంపాదించాడు. తన తదుపరి చిత్రంగా.. 1980 నేపథ్యంలో సాగే డిఫరెంట్ స్టోరీతో కల్కి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ మోషన్ పోస్టర్‌తోనే ఆకట్టుకుంది. రాజశేఖర్ పుట్టినరోజు (ఫిబ్రవరి 4)న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment