కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా! | Rajasekhar Kalki Movie Honest Trailer | Sakshi
Sakshi News home page

కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!

Jun 25 2019 10:38 AM | Updated on Jun 25 2019 10:38 AM

Rajasekhar Kalki Movie Honest Trailer - Sakshi

గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్‌ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో ట్రైలర్‌ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సోమవారమే ట్రైలర్‌ రిలీజ్‌ కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం ఉదయం రిలీజ్ చేశారు.

ట్రైలర్‌లోనే సినిమా లైన్‌ ఎంటో చెప్పేశారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నరసప్ప తమ్ముడు శేఖర్‌ బాబు హత్య కేసు చుట్టూ తిరుగుతుంది కల్కి కథ. ఆ కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే పోలీస్‌ అధికారిగా రాజశేఖర్‌, జర్నలిస్ట్‌గా రాహుల్‌ రామకృష్ణలు కనిపించనున్నారు. రాజశేఖర్ సరసన అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, నాజర్‌, స్కార్లెట్‌ మెలిష్‌ విల్సన్‌, రాహుల్‌ రామకృష్ణ, అశుతోష్‌ రానా, శత్రులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement