సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’ | Rajasekhar Kalki Censor Formalities Completed | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’

Published Wed, Jun 26 2019 10:33 AM | Last Updated on Wed, Jun 26 2019 10:33 AM

Rajasekhar Kalki Censor Formalities Completed - Sakshi

యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి. శివాని, శివాత్మిక, వైట్ లాంబ్ టాకీస్ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇప్పటికే  సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. హానెస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కథ ఎలా ఉండబోతుందనేది ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే లాంటి డైలాగ్స్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై హైప్‌ మరింత పెంచాయి.

రాజశేఖర్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. కల్కి పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయంటున్నారు. గరుడవేగ తర్వాత కల్కితో ఆయన మరో హిట్ అందుకోబోతున్నారనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణాలు కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement