జూన్ 28న రాజశేఖర్‌ ‘కల్కి’ విడుదల! | Kalki Set For a Massive Release on June 28th Worldwide | Sakshi
Sakshi News home page

జూన్ 28న రాజశేఖర్‌ ‘కల్కి’ విడుదల!

Published Sun, Jun 9 2019 4:10 PM | Last Updated on Sun, Jun 9 2019 6:09 PM

Kalki Set For a Massive Release on June 28th Worldwide - Sakshi

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 28న  ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ రాజశేఖర్, స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించిన ‘హార్న్ ఓకే’ పాటను బుధవారం రెడ్ ఎఫ్.ఎమ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు. లలిత కావ్య పాడిన ఈ పాటను కేకే రాశారు. మధుర మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ ‘పక్కా కమర్షియల్ చిత్రమిది. కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అదే విధంగా ఆకట్టుకుంటుంది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం. శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన బాణీలను అందించాడు. నేపథ్య సంగీతం కూడా బాగా చేస్తున్నాడు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు.

జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ‘డిఫరెంట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమా కల్కి. ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది. కమర్షియల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేసి తమకు ట్రైలర్ ఎంత నచ్చిందో చెప్పారు. సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ టాప్ ట్రెండ్స్ లో నిలిచింది. రాజశేఖర్ గారి ఇమేజ్‌కి త‌గ్గ విధంగా, కొత్త తర‌హా సినిమాను ప్రశాంత్ వర్మ తీశారు. ఆయన కథ, దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి’ అని అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో... థియేటర్లలో ప్రేక్షకులకు కల్కి అంత ఉత్కంఠ కలిగిస్తుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం. నిర్మాత సి. కళ్యాణ్ గారు ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement