
తన చర్యలతో అభిమానులకు షాక్ ఇచ్చే నందమూరి బాలకృష్ణ, అప్పుడప్పుడూ సినిమాల విషయంలోనూ అలాంటి షాక్‌లే ఇస్తుంటాడు. ఎవరూ ఊహించని కాంబినేషన్‌లో సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేసి అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు బాలయ్య.
తాజాగా మరోసారి అలాంటి క్రేజీ కాంబినేషన్ తెరమీదకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. శుక్రవారం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రశాంత్ వర్మ ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా బాలయ్యతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిపారు.
గతంలో అ! సినిమా ప్రమోషన్ సమయంలోనూ ఇలాంటి కామెంట్సే చేశాడు ప్రశాంత్. దీంతో బాలకృష్ణ.. ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే పట్టాలెక్కే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment