న్యూఢిల్లీ: కేరళ నరబలి ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ కేరళ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై మీడియా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. నాగరిక సమాజంలో ఇలాంటి దారుణాలను ఊహించలేమని పేర్కొంది. చట్టాలంటే ఏమాత్రం భయంలేకుండా మూఢనమ్మకంతో మనుషులను చంపడం చాలా ఘోరమని పేర్కొంది.
ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే.. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి.
ఇదీ చదవండి: Kerala Human Sacrifice Case: డబ్బుపై అత్యాశతోనే నరబలి.. చంపేసి ముక్కలు చేసి తిన్నారా?
Comments
Please login to add a commentAdd a comment