NHRC serious
-
నరబలి ఘటన: కేరళ ప్రభుత్వానికి నోటీసులు
న్యూఢిల్లీ: కేరళ నరబలి ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ కేరళ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై మీడియా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. నాగరిక సమాజంలో ఇలాంటి దారుణాలను ఊహించలేమని పేర్కొంది. చట్టాలంటే ఏమాత్రం భయంలేకుండా మూఢనమ్మకంతో మనుషులను చంపడం చాలా ఘోరమని పేర్కొంది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే.. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇదీ చదవండి: Kerala Human Sacrifice Case: డబ్బుపై అత్యాశతోనే నరబలి.. చంపేసి ముక్కలు చేసి తిన్నారా? -
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ విషయంలో విచారణ చేపట్టాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఎన్కౌంటర్ ఆందోళన కలిగించే అంశమని, దీనిపై చాలా జాగ్రత్తగా విచారణ జరగాలని పేర్కొంది. నిజనిర్ధారణ చేసేందుకు సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్)ను ఆదేశించినట్లు తెలిపింది. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం త్వరలోనే హైదరాబాద్ వెళ్లి నిజనిర్ధారణ చేసి నివేదిక అందజేస్తుందని వివరించింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులు అప్రమత్తంగా లేరని కమిషన్ భావించింది. నిందితుల నుంచి అవాంఛనీయ ఘటన జరుగుతుందని అప్రమత్తంగా ఉండాల్సినా అలా లేకపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారని భావించింది. ‘పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరగడం.. సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది’అని ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. -
నిర్భయ నిధుల పరిస్థితేంటి?
న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ.. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. తమ పిల్లలో, ఇంట్లోని మహిళలో కనిపించడం లేదని, వారి ఆచూకీ తెలుసుకోవాలని ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఎవరితోనైనా వెళ్లిపోయిందేమోనన్న నిర్లక్ష్యపూరిత జవాబే ఎక్కువగా పోలీసుల నుంచి వస్తోందని ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆలోచన తీరును మార్చుకోవాలని సూచించింది. ‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు రేప్‌చేసి, చంపేసి, మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో’ అని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. నిర్భయ నిధి సహా మహిళల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనలను.. రాష్ట్రాలు, యూటీల్లో వాటి అమలును సమగ్ర నివేదిక రూపంలో తమకు అందించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. కేంద్రం, రాష్ట్రాలు, యూటీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు -
హెచ్‌సీయూ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులకు నిత్యవసరాలైన ఆహారం, నీరు, విద్యుత్తు అందకుండా చేయడం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మానవవనరుల మంత్రిత్వశాఖ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. ఆ ఘటనపై వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థుల వ్యవహారంలో పోలీసులు, పాలకమండలి వైకరిపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం చెందింది. విద్యార్థులకు ఆహారం, నీరు, విద్యుత్తు అందకుండా చేయడంపై కమిషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసరి పరిస్థితి తలెత్తిందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.