సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో విచారణ చేపట్టాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఎన్‌కౌంటర్ ఆందోళన కలిగించే అంశమని, దీనిపై చాలా జాగ్రత్తగా విచారణ జరగాలని పేర్కొంది. నిజనిర్ధారణ చేసేందుకు సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఎన్‌హెచ్‌ఆర్సీ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్)ను ఆదేశించినట్లు తెలిపింది.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం త్వరలోనే హైదరాబాద్ వెళ్లి నిజనిర్ధారణ చేసి నివేదిక అందజేస్తుందని వివరించింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులు అప్రమత్తంగా లేరని కమిషన్ భావించింది. నిందితుల నుంచి అవాంఛనీయ ఘటన జరుగుతుందని అప్రమత్తంగా ఉండాల్సినా అలా లేకపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారని భావించింది. ‘పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరగడం.. సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది’అని ఎన్‌హెచ్‌ఆర్సీ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment