పల్స్‌పోలియోకు మంచి స్పందన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఐదేళ్లు నిండిన 7,01,447 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఈమేరకు కార్యాచరణకు ఉపక్రమించింది.
ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం వరకు 6,71,149 (95.68 శాతం)మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కాగా వంద శాతం లక్ష్యాన్ని సాధించేందుకుగాను సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మాస్‌మీడియా అధికారి నరహరి తెలిపారు. ప్రజలు కూడా పల్స్ పోలియో లక్ష్య సాధనకు సహకరించాలని ఆయన కోరారు.