puls polio
-
గర్భిణుల్లో అపోహలను తొలగించాలి
సాక్షి, భట్టిప్రోలు: గర్భిణుల్లో నెలకొన్న అపోహలను వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తొలగించాలని భట్టిప్రోలు పీహెచ్సీ డాక్టర్ ఎ.సీతాకుమారి సూచించారు. పీహెచ్సీలో మంగళవారం ఆశాడే నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాకుమారి మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి గర్భిణుల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని, వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాన్పులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరిగేలా చూడాలని కోరారు. బాలింతలు ఈ సేవలు పొందేందుకు 102 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. పల్స్ పోలియోను విజయవంతం చేయాలి వెల్లటూరు పీహెచ్సీలో నిర్వహించిన ఆశాడే సమావేశంలో డాక్టర్ సీహెచ్ రామలక్ష్మి మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వివరించారు. ఈ నెల 10వ తేదీన నిర్విహించనున్న సామూహిక పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. -
నేటి పల్స్ పోలియోకు సర్వం సిద్ధం
కాకినాడ వైద్యం : జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో రెండో విడత నిర్వహణకు వైద్య ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో అయిదేళ్లలోపు చిన్నారులు 5,01,508 మందికి పోలియో చుక్కలు వేసేందుకు 128 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 839 ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో గ్రామాల్లో 3,147, పట్టణ ప్రాంతాల్లో 619 బూత్‌లు సిద్ధం చేశారు. ఇవి కాక రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణలో 378 మంది సూపర్వైజర్లు, ఆశా, అంగ¯ŒSవాడీ, ఐకేపీ, డ్వాక్రా వర్కర్లతో కలిపి 7,520 మంది సిబ్బంది పాల్గొంటారని అధికారులు తెలిపారు. సంచార జాతులు, మురికివాడల్లో నివసించేవారు, భవన కార్మికులు, మత్స్యకారుల పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోవడానికి పోలియో బూత్‌లకు రాని చిన్నారులకు 3, 4 తేదీల్లో ఇళ్లకు వెళ్లి వేయనున్నారు. -
95.05 శాతం పల్స్‌పోలియో
డీఎంహెచ్ఓ చంద్రయ్య 3,582 బూత్‌ల ఏర్పాటు పాల్గొన్న అమాత్యులు, అధికారులు కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియోలో 90 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య వెల్లడించారు. ఐదేళ్లలోపు చిన్నారులు జిల్లాలో 5,01,307 ఉండగా, ఇందులో 4,46,464 మందికి చుక్కల మందు వేశామన్నారు. ఇందుకోసం 3,582 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామని, వీరికి సేవలందించేందుకు 362 మంది హెల్త్ సూపర్వైజర్లు, 7,323 మంది ఆరోగ్యశాఖ సిబ్బంది, 7,520 మంది అంగ¯ŒSవాడీ, ఆశ కార్యకర్తలతో పాటు డ్వాక్రా సంఘ సభ్యుల సేవలను ఉపయోగించుకున్నామన్నారు. సంచార జాతులు, ఇటుక బట్టీలు, రైల్వేస్టేçÙన్లు, బస్టాండ్ల వద్ద ఉన్న చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు 136 సంచార బృందాలను వినియోగించినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని హోంమంత్రి, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అమలాపురం బెండమూరులో, రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తొండంగి మండలం ఏవీ నగరంలో, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ జగన్నాథపురం ఎన్టీఆర్ నగర్లో, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు మగటపల్లిలో ప్రారంభించినట్లు వివరించారు. కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాజమండ్రి, ఏజెన్సీలోని రంపచోడవరంలో పర్యటించారన్నారు. సోమవారం కాకినాడ డివిజ¯ŒSలో పర్యటిస్తారన్నారు. నూరుశాతం లక్ష్యంలో భాగంగా 95.05 శాతాన్ని సాధించామని, మిగతా ఐదు శాతాన్ని సోమ,మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. కాగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అక్కడక్కడా పలు పోలియో బూత్‌లలో తగినంత వ్యాక్సి¯ŒS అందుబాటులో లేక చిన్నారులు, తల్లిదండ్రులు ఇక్కట్లకు గురయ్యారు. తక్షణమే స్పందించిన అధికారులు పక్క బూత్‌ల నుంచి వ్యాక్సి¯ŒS తీసుకువచ్చి సద్దుబాటు చేశారు. మధ్యాహ్నానికే ‘నిండుకున్న’ రెండు చుక్కలు అయినవిల్లి (పి.గన్నవరం) : ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలన్న ఆరోగ్యశాఖ సరిపడా వ్యాక్సి¯ŒSను సరఫరా చేయడంలో విఫలమైంది. మండలంలోని అయినవిల్లి, వీరవల్లిపాలెం పీహెచ్‌సీల పరిధిలోని 38 బూత్‌లలో 4505 మందికి పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా వ్యాక్సి¯ŒS సీసాలు సరిపడా రాలేదు. మధ్యాహ్నానికే వ్యాక్సి¯ŒS అయిపోవడంతో బిడ్డలతో వచ్చిన వారిని వైద్య సిబ్బంది తిరిగి పంపించేశారు. కొందరు తల్లిదండ్రులు మందు వస్తుందేమోనని గంటల తరబడి బూత్‌ల వద్దే పడిగాపులు పడ్డారు. ఈ పరిస్థితికి కారణం జిల్లా ఆరోగ్యశాఖ సిబ్బందేనని పలువురు దుయ్యబట్టారు. దీనిపై అయినవిల్లి పీహెచ్సీ వైద్యురాలు బి.మంగాదేవి మాట్లాడుతూ వ్యాక్సి¯ŒS సరిపడా లేదని, కాకినాడ నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. వేయించుకోని చిన్నారులకు ఇంటింటికీ వేస్తామన్నారు. -
పల్స్‌పోలియోకు మంచి స్పందన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఐదేళ్లు నిండిన 7,01,447 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఈమేరకు కార్యాచరణకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం వరకు 6,71,149 (95.68 శాతం)మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కాగా వంద శాతం లక్ష్యాన్ని సాధించేందుకుగాను సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మాస్‌మీడియా అధికారి నరహరి తెలిపారు. ప్రజలు కూడా పల్స్ పోలియో లక్ష్య సాధనకు సహకరించాలని ఆయన కోరారు.