నేటి పల్స్‌ పోలియోకు సర్వం సిద్ధం | today puls polio | Sakshi
Sakshi News home page

నేటి పల్స్‌ పోలియోకు సర్వం సిద్ధం

Published Sun, Apr 2 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

today puls polio

కాకినాడ వైద్యం :
జిల్లాలో ఆదివారం పల్స్‌ పోలియో రెండో విడత నిర్వహణకు వైద్య ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో అయిదేళ్లలోపు చిన్నారులు 5,01,508 మందికి పోలియో చుక్కలు వేసేందుకు  128 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 839 ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో గ్రామాల్లో 3,147, పట్టణ ప్రాంతాల్లో 619 బూత్‌లు సిద్ధం  చేశారు. ఇవి కాక రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద అదనంగా  కేంద్రాలను ఏర్పాటు చేశారు.  కార్యక్రమ నిర్వహణలో 378 మంది సూపర్‌వైజర్లు, ఆశా, అంగ¯ŒSవాడీ, ఐకేపీ, డ్వాక్రా వర్కర్లతో కలిపి 7,520 మంది సిబ్బంది పాల్గొంటారని  అధికారులు తెలిపారు. సంచార జాతులు, మురికివాడల్లో నివసించేవారు, భవన కార్మికులు, మత్స్యకారుల పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోవడానికి పోలియో బూత్‌లకు రాని చిన్నారులకు 3, 4 తేదీల్లో ఇళ్లకు వెళ్లి వేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement