95.05 శాతం పల్స్‌పోలియో | 95.05 persent puls polio | Sakshi
Sakshi News home page

95.05 శాతం పల్స్‌పోలియో

Published Mon, Jan 30 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

95.05 persent puls polio

  • డీఎంహెచ్‌ఓ చంద్రయ్య  
  • 3,582 బూత్‌ల ఏర్పాటు
  • పాల్గొన్న అమాత్యులు, అధికారులు
  • కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : 
    జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియోలో 90 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.చంద్రయ్య వెల్లడించారు. ఐదేళ్లలోపు చిన్నారులు జిల్లాలో 5,01,307 ఉండగా, ఇందులో 4,46,464 మందికి  చుక్కల మందు వేశామన్నారు. ఇందుకోసం 3,582 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామని, వీరికి సేవలందించేందుకు 362 మంది హెల్త్‌ సూపర్‌వైజర్లు, 7,323 మంది ఆరోగ్యశాఖ సిబ్బంది, 7,520 మంది అంగ¯ŒSవాడీ, ఆశ కార్యకర్తలతో పాటు డ్వాక్రా సంఘ సభ్యుల సేవలను ఉపయోగించుకున్నామన్నారు. సంచార జాతులు, ఇటుక బట్టీలు, రైల్వేస్టేçÙన్లు, బస్టాండ్ల వద్ద ఉన్న చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు 136 సంచార బృందాలను వినియోగించినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని హోంమంత్రి, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అమలాపురం బెండమూరులో, రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తొండంగి మండలం ఏవీ నగరంలో, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ కాకినాడ జగన్నాథపురం ఎన్టీఆర్‌ నగర్‌లో, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు మగటపల్లిలో ప్రారంభించినట్లు వివరించారు. కార్యక్రమ నోడల్‌ అధికారి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ రాజమండ్రి, ఏజెన్సీలోని రంపచోడవరంలో పర్యటించారన్నారు. సోమవారం కాకినాడ డివిజ¯ŒSలో పర్యటిస్తారన్నారు. నూరుశాతం లక్ష్యంలో భాగంగా 95.05 శాతాన్ని సాధించామని, మిగతా ఐదు శాతాన్ని సోమ,మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. కాగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అక్కడక్కడా పలు పోలియో బూత్‌లలో తగినంత వ్యాక్సి¯ŒS అందుబాటులో లేక చిన్నారులు, తల్లిదండ్రులు ఇక్కట్లకు గురయ్యారు. తక్షణమే స్పందించిన అధికారులు పక్క బూత్‌ల నుంచి వ్యాక్సి¯ŒS తీసుకువచ్చి సద్దుబాటు చేశారు.
     
    మధ్యాహ్నానికే ‘నిండుకున్న’ రెండు చుక్కలు
    అయినవిల్లి (పి.గన్నవరం) : ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలన్న ఆరోగ్యశాఖ సరిపడా వ్యాక్సి¯ŒSను  సరఫరా చేయడంలో  విఫలమైంది. మండలంలోని అయినవిల్లి, వీరవల్లిపాలెం పీహెచ్‌సీల పరిధిలోని 38 బూత్‌లలో 4505 మందికి పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా వ్యాక్సి¯ŒS సీసాలు సరిపడా రాలేదు. మధ్యాహ్నానికే వ్యాక్సి¯ŒS అయిపోవడంతో బిడ్డలతో వచ్చిన వారిని వైద్య సిబ్బంది తిరిగి పంపించేశారు. కొందరు తల్లిదండ్రులు మందు వస్తుందేమోనని గంటల తరబడి బూత్‌ల వద్దే పడిగాపులు పడ్డారు. ఈ పరిస్థితికి కారణం జిల్లా ఆరోగ్యశాఖ సిబ్బందేనని పలువురు దుయ్యబట్టారు. దీనిపై  అయినవిల్లి పీహెచ్‌సీ వైద్యురాలు బి.మంగాదేవి మాట్లాడుతూ  వ్యాక్సి¯ŒS సరిపడా లేదని, కాకినాడ నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. వేయించుకోని చిన్నారులకు ఇంటింటికీ వేస్తామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement