రంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక, హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన అధికారులు, హైడ్రా అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. తాజాగా మైలార్‌దేవుపల్లి పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.
వివరాల ప్రకారం.. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. తాజాగా మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లక్ష్మీగూడలో కూల్చివేతలు ప్రారంభించింది. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్‌పై ఉన్న ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment