
మృతి చెందిన చిన్ను
అంబర్‌పేట: కళ్ల ముందు అప్పటిదాకా సందడి చేస్తున్న తమ కుమార్తె ప్రమాదవశాత్తూ బాత్‌రూంలోని నీటి బాకెట్‌లో పడి మృతి చెందడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద సంఘటన మంగళవారం మధ్యాహ్నం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వీరయ్య కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మదనపల్లికి చెందిన హరికృష్ణ, రేణుక దంపతులు. వీరికి నాగున్నరేళ్ల కూతురు భాను, రెండున్నరేళ్ల చిన్ను సంతానం. నాలుగు నెలల క్రితం జీవనోపాధి కోసం డీడీ కాలనీకి వచ్చారు.
హరికృష్ణ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా మంగళవారం ఇంట్లో హరికృష్ణ భోజనం చేస్తుండగా చిన్న కూతరు చిన్ను ఆడుకుంటూ బాత్‌రూంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడింది. అక్కడే ఆడుకున్న చిన్నారి అక్క భాను గమనించి తండ్రికి చెప్పింది. వెంటనే బాత్‌రూంలోకి పరిగెత్తుకు వచ్చి చిన్నును బకెట్లో నుంచి బయటకు తీశారు. మింగిన నీటిని బయటకు తీసి విద్యానగర్‌లో ఉన్న డీడీ ఆస్పత్రికి హుటాహుటిన తీసుకువెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment