
మోర్‌లో చాకొలెట్ కొనుగోలు చేసిన సుబ్బారావు. ఇన్‌సెట్లో చాకొలెట్‌పై పురుగు
సాక్షి, హైదరాబాద్ : మోర్ సూపర్‌మార్కెట్‌లో చాకొలెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. చాకొలెట్‌లో పురుగులు దర్శనమివ్వడంతో సదరు వ్యక్తి షాక్ తిన్నాడు. వివరాలు.. వెంకటరమణ కాలనీకి చెందిన సుబ్బారావు ఎర్రమంజిల్ మోర్ సూపర్‌మార్కెట్‌లో మూడు రోజుల క్రితం క్యాడ్‌బరి డెయిరీ మిల్క్ చాకొలెట్ కొనుగోలు చేశాడు. గురువారం ఆ చాకొలెట్ తిందామని కవర్ ఓపెన్ చేసిన ఆయన కుమారుడికి అందులో పురుగులు కనిపించాయి. సుబ్బారావు మోర్ సిబ్బందిని వివరణ కోరగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాకొలెట్‌లో పురుగులతో తమకు సంబంధం లేదని మోర్ సిబ్బంది తేల్చిచెప్పడంతో.. ఆయన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment