More Super Market
-
చెత్త తొలగింపు కార్మికుల ‘చెత్త’ లొల్లి !
సాక్షి, హైదరాబాద్: కాప్రా మండలం, జవహర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ ‘చెత్త’ పంచాయితీ చోటుచేసుకుంది. చెత్త లారీ డ్రైవర్ తనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి వివరాల మేరకు.. జేజే వన్కాలనీ సమీపంలోని మోర్ సూపర్ మార్కెట్లో పోగైన చెత్తను జీహెచ్ఎంసీ చెత్త డబ్బాలో వేసినందుకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని చెత్తను తొలగించే కార్మికులు ఇంతకు ముందు డిమాండ్ చేశారు. దాంతో మోర్ మార్కెట్ సిబ్బంది రూ.3 వేలు ఇస్తామన్నారు. అయినా గత పదిహేను రోజులుగా చెత్త నిండిపోయినా ఎవరూ తొలగించలేదు. చెత్త డబ్బా నుంచి దుర్వాసన రావడంతో మోర్ సిబ్బంది కాప్రా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానితో అధికారులు వెంటనే చెత్తను తొలగించమని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. వారు లారీ డ్రైవర్గణేష్, మరో కార్మికుడిని అక్కడకు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న జేజే వన్ కాలనీ ప్రాంతంలో చెత్త తొలగించే కార్మికులు తమకు చెప్పకుండా చెత్తను ఎలా తీసుకెళ్తారని డ్రైవర్ గణేష్ను దూషిస్తూ, దాడికి పాల్పడ్డారు. బాధితుడి గణేష్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెత్త కార్మికుల ఆగడాలు రోజు రోజుకి మితీమీరి పోతున్నాయని స్థానికులు, మోర్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. (హైదరాబాద్లో ఇక ఎక్కడంటే అక్కడ శవ దహనం) -
డెయిరీ మిల్క్ చాకొలెట్లో పురుగులు
-
క్యాడ్బరి చాకొలెట్లో పురుగులు
సాక్షి, హైదరాబాద్ : మోర్ సూపర్మార్కెట్లో చాకొలెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. చాకొలెట్లో పురుగులు దర్శనమివ్వడంతో సదరు వ్యక్తి షాక్ తిన్నాడు. వివరాలు.. వెంకటరమణ కాలనీకి చెందిన సుబ్బారావు ఎర్రమంజిల్ మోర్ సూపర్మార్కెట్లో మూడు రోజుల క్రితం క్యాడ్బరి డెయిరీ మిల్క్ చాకొలెట్ కొనుగోలు చేశాడు. గురువారం ఆ చాకొలెట్ తిందామని కవర్ ఓపెన్ చేసిన ఆయన కుమారుడికి అందులో పురుగులు కనిపించాయి. సుబ్బారావు మోర్ సిబ్బందిని వివరణ కోరగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాకొలెట్లో పురుగులతో తమకు సంబంధం లేదని మోర్ సిబ్బంది తేల్చిచెప్పడంతో.. ఆయన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. -
సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం
-
సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం
నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ మోసం వెలుగుచూసింది. బండ్లగూడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బండ్లగూడ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ సూపర్ మార్కెట్ నుంచి ఆదివారం 25 కేజీల బియ్యం బస్తాను కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి వెళ్లి అన్నం వండి చూసి నిర్ఘాంతపోయాడు. గిన్నెలో అన్నానికి బదులు ప్లాస్టిక్ రేపర్ ఉండటంతో.. అవాక్కయిన శ్రీనివాస్ ఆ బియ్యం బస్తాతో సూపర్ మార్కెట్ వద్దకు చేరుకొని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. బియ్యానికి బదులు ప్లాస్టిక్ బియ్యం ఇచ్చినందుకు సూపర్ మార్కెట్ ముందు ఆందోళన చేశాడు.