సాక్షి, హైదరాబాద్: కాప్రా మండలం, జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ ‘చెత్త’ పంచాయితీ చోటుచేసుకుంది. చెత్త లారీ డ్రైవర్ తనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి వివరాల మేరకు.. జేజే వన్కాలనీ సమీపంలోని మోర్ సూపర్ మార్కెట్‌లో పోగైన చెత్తను జీహెచ్‌ఎంసీ చెత్త డబ్బాలో వేసినందుకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని చెత్తను తొలగించే కార్మికులు ఇంతకు ముందు డిమాండ్ చేశారు. దాంతో మోర్ మార్కెట్ సిబ్బంది రూ.3 వేలు ఇస్తామన్నారు.
అయినా గత పదిహేను రోజులుగా చెత్త నిండిపోయినా ఎవరూ తొలగించలేదు. చెత్త డబ్బా నుంచి దుర్వాసన రావడంతో మోర్ సిబ్బంది కాప్రా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానితో అధికారులు వెంటనే చెత్తను తొలగించమని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. వారు లారీ డ్రైవర్గణేష్, మరో కార్మికుడిని అక్కడకు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న జేజే వన్ కాలనీ ప్రాంతంలో చెత్త తొలగించే కార్మికులు తమకు చెప్పకుండా చెత్తను ఎలా తీసుకెళ్తారని డ్రైవర్ గణేష్‌ను దూషిస్తూ, దాడికి పాల్పడ్డారు. బాధితుడి గణేష్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెత్త కార్మికుల ఆగడాలు రోజు రోజుకి మితీమీరి పోతున్నాయని స్థానికులు, మోర్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
(హైదరాబాద్‌లో ఇక ఎక్కడంటే అక్కడ శవ దహనం)
Comments
Please login to add a commentAdd a comment