స్వచ్ఛసిటీకి సన్నాహాలు | Preparations for freedom of the city | Sakshi
Sakshi News home page

స్వచ్ఛసిటీకి సన్నాహాలు

Published Fri, May 8 2015 2:50 AM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM

స్వచ్ఛసిటీకి సన్నాహాలు - Sakshi

స్వచ్ఛసిటీకి సన్నాహాలు

ప్రత్యేక కార్యక్రమాలకు జీహెచ్‌ఎంసీ రూపకల్పన
16 నుంచి 20  వరకు బస్తీల్లో అధికారుల సందడి

 
సిటీబ్యూరో:  స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఈ నెల 16 నుంచి 20వరకు స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారం నినాదంతో పనిచేయనున్నారు. చేపట్టనున్న కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. నాలుగు అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. 1. పారిశుధ్యం 2. వీధిదీపాలు, సీసీ కెమెరాల, ఏర్పాటు 3. కాలుష్య నివారణకు మొక్కలు నాటడం  4. తాగునీరు, సీవరేజీ సమస్యల పరిష్కారం.
  
ఇదీ సర్వసైన్యం
 
456 భాగాలకు 456 మంది వీవీఐపీలు/ఏఐఎస్ అధికారులు/ ఆయా విభాగాధిపతులు.
1,800 మంది బిల్ కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ నోడల్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు, జలమండలి అధికారులు.
6వేల మంది లోకల్ చేంజ్ ఏజెంట్లు.
1,200 మంది మరమ్మతులు చేసే పనివారు, వీరిలో 800 మంది మేస్త్రీలుంటారు.
1,061 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు/ ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 22,956 మంది పారిశుధ్య కార్మికులు (పారిశుధ్యం, మలేరియా విభాగాల వారు ఇందులో ఉంటారు.
మరో 2,010 మంది ఐలాలు, కంటోన్మెంట్‌బోర్డులకు చెందిన అధికారులు.
పనులు క్రమపద్ధతిలో జరిగేందుకు టీమ్ సభ్యుల జాబితా, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన ప్రదేశాల సమాచారంతో పాటు విధుల్లో ఉన్నవారి హాజరు.
  
యూనిట్ వివరాల అందజేత..
 
ఉదాహరణకు ఉప్పల్ సర్కిల్‌లో ఒకటో నెంబరు యూనిట్(విభాగం)లో పనులు చేయాలంటే దాని కనీస సమాచారం ఇలా ఉంటుంది. సర్కిల్ పేరు.. యూనిట్‌నెంబరుతోపాటు డాకెట్ నెంబరు (201ఏ), యూనిట్‌లోని ఇళ్ల సంఖ్య: 2,590, జనాభా:12,950. యూనిట్‌పరిధిలోని కాలనీలు(హరిజనబస్తీ, హబ్సిగూడ ప్రధాన రహదారి), పీఅండ్‌టీ కాలనీ, కాకతీయనగర్, నందనవనం కాలనీ, మధువన్ ఎన్‌క్లేవ్, వీధినెంబరు 5,6,7.. ఇలా కాలనీలోతోపాటు ఆయా కాలనీల్లోని ఇళ్లసంఖ్య, సంప్రదించాల్సిన కాలనీ అసోసియేషన్లు, రెసిడెంట్‌వెల్ఫేర్ అసోసియేషన్లలోని ముఖ్యుల పేర్లు.. వారి ఫోన్‌నెంబర్లు.. అక్కడ అవసరమయ్యే పారిశుధ్య కార్మికుల సంఖ్య తదితర వివరాలతో ఏరియాకు సంబంధించిన ముఖ్య సమాచారం ఇస్తారు. దీంతోపాటు స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములయ్యేందుకు ఉత్సాహం చూపే (రాజకీయేతర) స్థానికుల పేర్లు .. వారు ఏంచేస్తారు.. వారి ఫోన్‌నెంబర్లు తదితర వివరాలిస్తారు. స్థానికంగా ఆయా రంగాల్లో ప్రముఖులెవరైనా ఉన్నట్లయితే వారిని సంప్రదిస్తారు. అలా తీసుకున్న వివరాలతో 15 మందితో టీమ్ ఏర్పాటు చేస్తారు.
  
పనులు ఇలా...


16 నుంచి 20 వరకు  ఏరియాలోని మొత్తం కాలనీల్లో పనులు పూర్తిచేసేందుకు ఏ కాలనీకి ఎన్ని ట్రిప్పుల చెత్త తరలించాల్సి ఉంటుంది. ఎన్ని ట్రిప్పుల డెబ్రిస్ తరలించాల్సి ఉంటుంది తదితర విషయాలను అంచనా వేసి దీనికనుగుణంగా వాహనాలు సమకూరుస్తారు. అక్కడ భాగస్వాములయ్యే వివిధ ప్రభుత్వ విభాగాల పేర్లు, వారి హోదా, ఫోన్‌నెంబర్లు కార్యక్రమంలో భాగస్వాములయ్యే వారికి ఇస్తారు. సంబంధిత ఏరియాలో పారిశుధ్యం, మలేరియా, ఇంజినీరింగ్, విద్యుత్, క్రీడలు, తాగునీరు, మొక్కలు.. తదితర అంశాలకు సంబంధించి వాటిని అమలుచేసే అధికారుల పేర్లు, ఫోన్‌నెంబర్లు ఇస్తారు. దీంతో వారిని సంప్రదించేందుకు వీలుంటుంది.
 
మొబైల్‌యాప్‌తో సమన్వయం

స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూపొందిస్తున్న ప్రత్యేక మొబైల్‌యాప్‌తో సభ్యుల మధ్య సమన్వయం.. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో సులభంగా తెలుసుకోగలుగుతారు. ఏరోజు ఎవరు విధుల్లో ఉన్నారు.. ఆరోజు ఏయే పనులు చేశారు.. అనే విషయాలూ తెలుస్తాయి. ఉదాహరణకు చెత్త తొలగించకముందు పరిస్థితి.. తర్వాత పరిస్థితిని ఫొటోలు తీసి పంపుతారు. ఇంకా చేయాల్సిన పనుల పట్టిక కూడా ఉంటుంది. వాటిలో పూర్తిచేసినవాటికి రైట్ టిక్ పెడతారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ వెబ్‌సైట్లనూ వినియోగిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement