
చాక్లెట్లు తింటే నోబెల్ బహుమతి!
పరిపరి శోధన
అతిగా చాక్లెట్లు తినొద్దంటూ పిల్లలను వారించే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాల్సిన విషయమే ఇది. ఎందుకంటే, చాక్లెట్లు తింటే నోబెల్ బహుమతి వచ్చే అవకాశాలు పెరుగుతాయట! అలాగని న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హాస్పిటల్‌కు చెందిన కార్డియాలజిస్టు డాక్టర్ ఫ్రాంజ్ హెచ్ మెసెర్లీ చెబుతున్నారు.
తెల్లగా కనిపించే మిల్క్ చాక్లెట్ కంటే కోకోతో తయారయ్యే డార్క్‌చాక్లెట్ తినడమే శ్రేష్టమని కూడా ఈ డాక్టర్‌గారు సలహా ఇస్తున్నారు. డార్క్ చాక్లెట్ తింటే తెలివితేటలు అమోఘంగా పెరుగుతాయని, ఫలితంగా నోబెల్ బహుమతి వంటి ఉన్నత పురస్కారాలను అందుకోగల అవకాశాలూ పెరుగతాయని ఢంకా బజాయించి చెబుతున్నారు.