
మినీ బేకరీ
ఒకప్పుడు చిరుతిళ్లు అంటే మురుకులు, గారెలు మాత్రమే. మహా అంటే షాపుల్లో దొరికే చాక్లెట్లు, బిస్కెట్లు. కానీ ఇప్పుడో... అన్నీ బేక్డ్ ఫుడ్సే. కుకీస్ అనీ చిప్స్ అనీ... రకరకాల వెరైటీలతో వచ్చేస్తున్నాయి. దాంతో చాలామంది అవన్ కొనేసి, ఇంట్లోనే బేక్డ్ ఫుడ్స్‌ను తయారు చేసి పిల్లలకు పెడుతున్నారు. అంతవరకు ఓకే. కానీ మనం బేక్ చేస్తున్నప్పుడు, పదార్థాలను సరైన మోతాదుల్లోనే వేస్తున్నామా? అన్న విషయాన్ని గమనించాలి. అలా ఎలా తెలుస్తుందండీ అంటారా? అయితే ఈ ‘పర్ఫెక్ట్ బేక్ సెట్’ ఇక మీ కోసమే.
ఈ సెట్‌లో స్కేల్, ఫోన్/టాబ్లెట్ స్టాండ్, 3 మిక్సింగ్ బౌల్స్, అవన్ థర్మామీటర్, 3.5 ఎంఎం కేబుల్ ఉంటాయి. ఫోన్/ టాబ్లెట్ (అందులో ఈ పర్ఫెక్ట్ బేక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి) ద్వారా మీ బేకింగ్ ఐటమ్ (రెసిపీ)ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్‌పై బౌల్ పెట్టి, అందులో బేకింగ్‌కు వాడే పదార్థాలను వేస్తూ ఉండాలి. ఎంత మోతాదైతే సరిపోతుందో, ఆ ఇండికేషన్ మనకు ఫోన్లో కనిపిస్తుంది. అలా అన్నీ పర్ఫెక్ట్‌గా వేస్తేనే... మీ బేకింగ్ ఫుడ్స్ (కుకీస్, కేక్స్,...) కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. బేకింగ్ కిట్‌లాగే ‘పర్ఫెక్ట్ డ్రింక్ సెట్’ కూడా దొరుకుతుంది.