biscuits
-
సముద్రపు నాచుతో బిస్కెట్లు
ఏయూ క్యాంపస్: సముద్రపు నాచుతో బిస్కెట్లు.. నత్తల పొడితో సూప్.. చేపల నూనెతో శరీర సౌందర్య సంబంధిత క్యాప్సూల్స్.. ఇలా ఎన్నో సముద్ర ఆధారిత ఉత్పత్తులను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్టీ) ప్రపంచానికి పరిచయం చేస్తోంది. సముద్ర జీవులపై పరిశోధనలు చేస్తూ.. వాటిలోని ప్రతీ భాగాన్ని వినియోగిస్తూ కొత్తకొత్త ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. సముద్రంలో లభించే ప్రతి జీవి నుంచి ఆహార, ఆరోగ్య ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోంది. సీఐఎఫ్టీ అభివృద్ధి చేసిన సముద్ర ఆధారిత ఉత్పత్తులు దేశవిదేశాల్లో సైతం మన్ననలు పొందుతున్నాయి.చేపలోని ప్రతి భాగాన్నీ ఉపయోగిస్తూ ఉత్పత్తులు..జీరో వేస్ట్ ప్రాసెసింగ్ దిశగా సీఐఎఫ్టీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. చర్మం సహా చేపలోని ప్రతీ భాగాన్ని ఉపయోగిస్తూ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మిగిలిన వ్యర్థాలను సైలేజ్‌గా మార్చి మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. చేపల్లోని నూనెను సేకరించి.. క్యాప్సూల్స్‌ను అభివృద్ధి చేశారు. ఇవి ఎలాంటి వాసన రాకుండా.. అందరూ వినియోగించే విధంగా అందుబాటులోకి తెచ్చారు. అలాగే ఇమ్యూన్ బూస్టర్లు, శరీర సౌందర్యాన్ని కాపాడే ఉత్పత్తులు, న్యూట్రా సూటికల్స్ను తయారు చేస్తున్నారు. రొయ్య పొట్టు నుంచి తయారు చేసిన కాప్సూల్స్.. భోజనానికి ముందు తీసుకుంటే ఆహారంలోని నూనెను సంగ్రహించి బయటకు పంపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తద్వారా శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుందని వెల్లడించారు. అలాగే చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, తాజాగా కనిపించడానికి ఉపయోగించే ఫార్మలిన్ రసాయనాన్ని సులభంగా గుర్తించే కిట్‌ను కూడా శాస్త్రవేత్తలు తయారు చేశారు. వీరు అభివృద్ధి చేసిన చిన్నపాటి పేపర్‌ను.. చేపపై రుద్దాల్సి ఉంటుంది. చేప రంగు మారిపోతే ఫార్మలిన్‌ను ఉపయోగించారని అర్థం. అలాగే చిన్న చేపలను పొడి చేసి పోషకాల సమాహారంగా తయారు చేశారు. దీనిని ఇప్పటికే ఒడిశాలోని పాఠశాలల్లో, ఆదివాసీ ప్రాంతాల పిల్లలకు పోషకాహారంగా అందిస్తున్నారు. చేపల పొలుసు నుంచి డెంటల్ ఫిల్లింగ్ మెటీరియల్‌ను తయారు చేశారు. సముద్రపు నాచు నుంచి తయారుచేసిన బిస్కెట్లతో పాటు చేపలు, రొయ్యల పచ్చళ్లు, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు నిల్వ ఉండే రెడీ టు ఈట్ ఫిష్ కర్రీ ప్రత్యేకమైన మూడు పొరల ప్యాకింగ్లలో లభిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలకు ఇక్కడి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.. భవిష్యత్‌లో వీటి సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.సముద్రంలోని ప్రతి జీవి నుంచీఆరోగ్య ఉత్పత్తులే లక్ష్యం..జీరో వేస్ట్ ప్రాసెసింగ్ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇంకా కొన్ని అంశాలపై పరిశోధనలు జరగాల్సి ఉంది. సముద్రంలో లభించే ప్రతి జీవి నుంచి పూర్తిస్థాయిలో ఆహార, ఆరోగ్య ఉత్పత్తులు తయారు చేయడమే లక్ష్యం. – డాక్టర్ బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీఐఎఫ్టీసాంకేతికతను బదలాయిస్తున్నాంసీఐఎఫ్టీ అభివృద్ధి చేసిన సాంకేతికతను ఇతర సంస్థలకు, వ్యక్తులకు కూడా బదలాయిస్తున్నాం. వారు ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. – డాక్టర్ పి.విజ్జి, సీనియర్ సైంటిస్ట్, సీఐఎఫ్టీ -
భీకర ఎన్కౌంటర్.. మధ్యలో బిస్కెట్!
శ్రీనగర్: సుధీర్ఘ చర్చలు, మంతనాల వేళ మధ్యమధ్యలో ఛాయ్‌తోపాటు బిస్కెట్లు తినడం పరిపాటి. మిత్రదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల వేళ పనికొచ్చే బిస్కెట్లు శత్రువుతో పోరాడేవేళ అక్కరకు రావడం విశేషం. పాకిస్తాన్ విద్వేషాగి్నని ఎగదోస్తుంటే దానిని కశ్మీర్లో విస్తరింపజేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు బిస్కెట్లను వాడుకుని విజయం సాధించారు. శనివారం జరిగిన లష్కరే కమాండర్ ఉస్మాన్ ఎన్కౌంటర్ వివరాలను సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం వెల్లడించాయి. మొరిగితే అసలుకే మోసం కశ్మీర్లో కీలకమైన ఉగ్రకమాండర్ ఉస్మాన్ శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఉస్మాన్ సిద్ధహస్తుడు. గత ఏడాది పోలీస్ ఇన్స్పెక్టర్ మస్రూర్ వనీని చంపేసిన ఘటనలో ఇతని ప్రమేయముంది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది జాడ తెలియడంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయితే ఖన్యాయ్లో శునకాల బెడద ఎక్కువ. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే మొరుగుతాయి. ఈ శబ్దాలకు ఉస్మాన్ అప్రమత్తమవడం ఖాయం. దీనికి పరిష్కారంగా బలగాలు తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లాయి. అంతా జల్లెడ పడుతూ కుక్కలు అరవకుండా బిస్కెట్లు వెదజల్లుతూ వాటి నోరు మూయించారు. దీంతో వీరి పని సులువైంది.ఏకే47తో సిద్ధం ఉస్మాన్ ఎల్లప్పుడూ అత్యాధునిక ఏకే47 గన్‌తో అప్రమత్తంగా ఉంటాడు. గ్రనేడ్లు, పిస్టల్ ధరిస్తాడు. వేగంగా దాడిచేస్తాడు. దీంతో తమ రాక విషయం తెలీకుండా జాగ్రత్తపడుతూ బలగాలు అతడిని సమీపించాయి. చివరి నిమిషంలో ఉస్మాన్ దీనిని కనిపెట్టి బలగాలపైకి ఎదురుకాల్పులు జరిపాడు. గ్రనేడ్లు విసిరాడు. ఈ క్రమంలో నలుగురు జవాన్లు గాయపడినా ఎట్టకేలకు ఉస్మాన్‌ను సైన్యం హతమార్చింది. గత రెండేళ్లలో కశీ్మర్ లోయలో సైన్యం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ ఘటనను చెబుతారు. లష్కరే తోయిబా విభాగమైన రెసిస్టెంట్ ఫ్రంట్‌కు ఈ ఎన్కౌంటర్ కోలుకోలేని దెబ్బ. స్థానికేతర కారి్మకులు, భద్రతా బలగాలపైకి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సభ్యులు తరచూ కాల్పులకు తెగబడటం తెల్సిందే. వీరికి సూచనలు చేసే ఉస్మాన్‌ను సైన్యం ఎట్టకేలకు తుదముట్టించి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాల్లో ఘన విజయం సాధించింది. -
ఈ క్రిస్మస్ వేళ..సరదాగ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ట్రైం చేయండిలా!
ఐస్‌క్రీమ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఐస్‌క్రీమ్ – ఒకటిన్నర కప్పు పైనే (నచ్చిన ఫ్లేవర్) మినీ చాక్లెట్ చిప్స్ లేదా కలర్ స్ప్రింకిల్స్ – 2 టేబుల్ స్పూన్ల పైనే బిస్కట్స్ – కొన్ని (మార్కెట్లో దొరికే బిస్కట్స్ లేదా ఇంట్లో చేసుకునే కుకీస్ తీసుకోవచ్చు) తయారీ విధానం: ముందుగా నచ్చిన షేప్‌లో రెండేసి బిస్కట్స్ లేదా కుకీస్ తీసుకుని.. వాటి మధ్యలో.. సేమ్ షేప్‌లో ఐస్‌క్రీమ్ బిట్ పెట్టుకుని శాండ్‌విచ్‌లా చేసుకోవచ్చు. అనంతరం వాటిని చాక్లెట్ చిప్స్‌లో లేదా కలర్ స్ప్రింకిల్స్లో దొర్లించి వెంటనే సర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వెరైటీలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. (చదవండి: -
ఈ ట్రిక్ వాడారో 'కరకరలాడే బిస్కెట్లు' ఇక మీ సొంతమే!
'మనం తినేవాటిలో అనేక పదార్థాలుంటాయి. అందులో మెత్తవైనా ఉండొచ్చు, గట్టివిగానూ ఉండొచ్చు. అయితే అప్పడాలు, బిస్కెట్లలో చాలామటుకు కరకరలాడే వాటినే ఇష్టపడుతుంటాం. బిస్కెట్లను తీసుకున్నట్లయితే వీటిలో కూడా చాలా రకాలుంటాయి. మనకు ఇష్టమైనటువంటి కొన్ని రకాల బిస్కెట్లలో ఈ కరకరలాడే బిస్కెట్లు తోడైతే ఆ రుచి, అనుభూతియే వేరు. మరెందుకు ఆలస్యం వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం!' కరకరలాడాలంటే.. బిస్కెట్లు మెత్తగా అవ్వకుండా కరకరలాడాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి! • ప్లాస్టిక్, అల్యుమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. • గాలి చొరబడకుండా పెడితే ఎక్కువరోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. • డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యుపేపర్లు వేసి తరువాత బిస్కెట్లు పెట్టాలి. • బిస్కెట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యూపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. • ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. • జిప్‌లాక్ పౌచ్‌లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. • గాలి చొరబడని డబ్బాలు, జిప్‌లాక్ పౌచ్‌లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. • అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్‌ఫ్రైయర్‌లో ఉంచి వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి, వీటిని కూడా నిల్వచేసుకోవచ్చు. ఇవి కూడా చదవండి: చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి?నకిలీ బెల్లాన్ని ఎలా గుర్తించాలి? -
వర్షాకాలంలో ఇలా చేస్తే బిస్కెట్లు క్రిస్పీగా ఉంటాయి..
వర్షాకాలంలో కూడా బిస్కెట్లు మెత్తగా అవకుండా కరకరలాడాలంటే ఇలా చేసి చూడండి... ప్లాస్టిక్, అల్యమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. గాలిచొరబడకుండా పెడితే ఎక్కువ రోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యపేపర్లు వేసి తరువాత బిస్కట్లు పెట్టాలి. బిస్కట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. జిప్‌లాక్ పౌచ్‌లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. గాలిచొరబడని డబ్బాలు, జిప్‌లాక్ పౌచ్‌లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్‌ఫ్రైయర్‌లో పదినిమిషాలు వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి. వీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. -
చిరు ధాన్యాలతో బిస్కెట్స్.... మహిళలకు ఊహించని ఆదాయం
-
చిరుధాన్యాల బిస్కెట్లు నెలకు లక్ష యాభై వేలు సంపాదన
-
రెడీమేడ్ బిస్కెట్స్ కు ధీటుగా ఆర్గానిక్ బిస్కెట్ల తయారీ
-
కాలంచెల్లిన చాక్లెట్లు,బిస్కెట్లకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. ముఠా గుట్టు రట్టు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొడిప్పల్‌లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లను రీసైకిల్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ఎక్స్పైర్ అయిన వస్తువులు, ఆహార పదార్థాలను సేకరించి వాటికే కొత్త లేబుల్స్ వేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తోంది. సబ్బులు, షాంపులు, తిను బండారాలు వంటి వంటి మొత్తం 300 రకాల వస్తువులను ఈ ముఠా రీసైకిల్ చేసి భారీ మోసానికి పాల్పడటటేగాక.. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. హైదరాబాద్ శివార్లలోని గోదాములు, కోఠిలోని హరిహంత్ కార్పోరేషన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేయగా ఈ రీసైక్లింగ్ ముఠా బాగోతం బట్టబయలైంది. ఈ సోదాల్లో రూ.కోట్లు విలువ చేసే ఆహారపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. -
కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లుకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు..
-
ఇషా అంబానీ దూకుడు: శ్రీలంక కంపెనీతో డీల్, వాటికి బిగ్ షాకే!
సాక్షి,ముంబై: రిలయన్స్ మరో వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఆయిల్‌నుంచి టెలికాం దాకా అడుగుపెట్టిన ప్రతీ రంగంలోనూ దూసుకుపోతున్న రిలయన్స్ త్వరలోనే ఇండియా బిస్కెట్ల వ్యాపారంలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం శ్రీలంక ఆధారిత మాలిబాన్ బిస్కెట్ మాన్యుఫాక్టరీస్ (ప్రైవేట్) లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మాలిబాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తెలిపింది. దేశీయ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వినియోగదారు బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఇందులో భాగంగానే మాలిబన్ బిస్కెట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే దేశీయ బిస్కెట్ల మార్కెట్లో 80 శాతం వాటా ఉన్న దిగ్గజాలు బ్రిటానియా,ఐటీసీ, పార్లేకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతోషం ప్రకటించారు. తమ ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోను గొప్ప బ్రాండ్ ద్వారా బలోపేతం చేయడమే కాకుండా, తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా అద్భుత సేవలందించ గలుగుతామన్నారు. కాగా ఏడాది డిసెంబరులో గుజరాత్లో మేడ్-ఫర్-ఇండియా కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ ను ప్రారంభించిన సంగతి తెలిసిదే. RCPLతో భాగస్వామ్యంపై మాలిబాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కుముదిక ఫెర్నాండో మాట్లాడుతూ, “రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మాలిబన్‌తో భాగస్వామ్యాన్ని ఎంచు కోవడం సంతోషమని, దాదాపు 70 సంవత్సరాలుగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను కొనసాగించడంలోతమ అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 1954లో స్థాపితమైన మాలిబాన్ శ్రీలంకలో రెండవ అతిపెద్ద బిస్కెట్ కంపెనీగా పాపులర్. బిస్కెట్లు, క్రాకర్లు, కుకీలు, ఇతర ఉత్పత్తులను 35 దేశాలకు ఎగుమతి చేస్తోంది. -
బ్రిటానియా గూటికి కెన్యా బిస్కెట్ల తయారీ కంపెనీ
న్యూఢిల్లీ: బేకరీ ప్రొడక్టుల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా కెన్యా కంపెనీ కెనాఫ్రిక్ బిస్కట్స్‌ను హస్తగతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ బీఏడీసీవో ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా 13.87 కెన్యన్ షిల్లింగ్స్(రూ. 9.2 కోట్లు) చెల్లించినట్లు వెల్లడించింది. తద్వారా ఆఫ్రికా మార్కెట్లలోనూ అమ్మకాలను విస్తరించే వీలు ఏర్పడినట్లు తెలియజేసింది. కెన్యాసహా ఆఫ్రికా మార్కెట్లలో బిస్కట్ల తయారీ, విక్రయాలు చేపట్టే లక్ష్యంతో కెనాఫ్రిక్ను సొంతం చేసుకున్నట్లు వివరించింది. ఈ నెల 3కల్లా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. వెరసి కెనాఫ్రిక్ బిస్కట్స్ అనుబంధ సంస్థగా మారినట్లు తెలియజేసింది. మిగిలిన 49% వాటా కెనాఫ్రిక్ గ్రూప్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. -
సామాన్యులకు మరో శుభవార్త! నూనెలతో పాటు వీటి ధరలు తగ్గనున్నాయ్!
దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్రూడ్ సోయా బిన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్‌తో పాటు క్రూడ్ పామాయిల్‌పై డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను, పాయిల్‌పై 10శాతం ఇంపోర్ట్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో రోజురోజూకీ పెరుగుతున్న నూనె ధరలతో పాటు ఇతర వస్తువులు భారీగా తగ్గనున్నాయి. వంటనూనెలేనా ఇంకా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వంటనూనెలతో పాటు ఫుడ్ ఐటమ్స్, కాస్మోటిక్స్ ధరలు అదుపులోకి రానున్నాయి. ఎందుకంటే ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థలు తయారు చేసేందుకు ముడి పదార్ధాలైన సన్ ఫ్లవర్ ఆయిల్, పాయిల్‌ను వినియోగిస్తుంటాయి. నూనె ధరలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు రా మెటీరియల్‌పై పెట్టే ఖర్చును తగ్గించడంతో అటోమెటిగ్గా.. తయారు చేసే ప్రొడక్ట్‌ల ధరలు తగ్గుతాయి. వచ్చే మూడునెలల్లో మనదేశంలో ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ తక్కువ.అందుకే భారత్ సంవత్సరానికి 55 శాతం 60శాతం వరకు వంట నూనెను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం నూనెలపై ట్యాక్స్ తగ్గింపుతో రాబోయే 3నెలలో సామాన్యులు విరివిరిగా వినియోగించే వస్తువుల ధరలు భారీ తగ్గనున్నాయని ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ పార్ట్నర్ సుమన్ జగ్దేవ్ తెలిపారు. నూనెల తగ్గింపుతో త్వరలో తగ్గనున్న వంట నూనెల ధర ప్రభావం ఇతర ఉత్పత్తులపై పడనుంది. నూనెతో తయారు చేసే బిస్కెట్‌లాంటి ఫుడ్ ఐటమ్స్‌తో పాటు నెయ్యి, కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్ ధరలు అదుపులో ఉండడనున్నాయని వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం అధినేత వినీత్ బోలిజ్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి ధరలు పైపైకి కరోనా, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, సప్లయ్ చైన్ సమస్య, పెరిగిన ఇన్ పుట్ కాస్ట్ తో పాటు ఇతర కారణాల వల్ల దేశీయ ఎఫ్ఎంసీజీ సంస్థలైన నెస్లే ఇండియా, మారికో, హిందుస్తాన్ యూనిలివర్, రుచి సోయా, బ్రిటానియా, డాబర్,కోల్గెట్, ఇమామీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థలు గత రెండేళ్లలో పలు ప్రొడక్ట్‌లను భారీగా పెంచాయి. తాజా, కేంద్ర నిర్ణయంతో పై సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తుల్ని తగ్గించనున్నాయి. చదవండి👉దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు! -
సామాన్యులకు మరో షాక్..భారీగా పెరగనున్న బిస్కెట్ ధరలు..!
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ నుంచి వంటనూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించేందుకుగాను హెచ్‌యూఎల్, యూనిలీవర్ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు నిత్యవసర వస్తువుల ధరలను భారీగా పెంచేందుకు సిద్దమయ్యాయి. ఇప్పుడు ధరల పెరుగుదల జాబితాలోకి బిస్కట్లు కూడా వచ్చి చేశాయి. రానున్న రోజుల్లో బిస్కెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుకు బ్రిటానియా సిద్ధం..! భారత అతిపెద్ద బిస్కెట్ల తయారీదారు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్..బిస్కెట్ల ధరలను 7 శాతం మేర పెంచాలని ప్రణాళికలను రచిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో తొలుత 3 శాతం మేర ధరల పెంపును సూచించగా...ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ధరల పెంపును 8 నుంచి 9 శాతం మేర పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లలో ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని వరుణ్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావంతో గత త్రైమాసికంలో బ్రిటానియా నికర ఆదాయంలో 19 శాతం తగ్గుదలను నమోదుచేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రకటించినప్పటీనుంచి...కార్మికుల కొరత, సప్లై చైన్ వంటి పరిమితులతో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు భారంగా మారింది. ఒత్తిళ్లను తగ్గించేందుకుగాను ధరల పెంపు అనివార్యమైందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రకటించాయి. కాగా బ్రిటానియాతో పాటుగా...ఇతర బిస్కెట్ కంపెనీలు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ధరలను పెంచే బదులుగా క్వాంటిటీ తగ్గించి అమ్మకాలు జరపాలనే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తోన్నారు. చదవండి: ఆల్‌టైం రికార్డు ధరకు సన్‌ఫ్లవర్ ఆయిల్..! -
కొత్త ఏడాదిలో..కొత్త బాదుడు..ధరలు పెరగనున్న వస్తువులు ఇవే!
ముంబై: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి అటు ప్రజల ఆరోగ్యంతోపాటు.. ఇటు పలు ఉత్పత్తుల ధరలనూ ప్రభావితం చేస్తోంది. ఈ ఏడాది లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 స్థాయికి చేరి మంటపుట్టించగా.. ఇటీవల కొంతమేర దిగివచ్చినప్పటికీ వంట నూనెలు రూ. 180కు చేరి వినియోగదారులకు షాకిచ్చాయి. ఈ ప్రభావంతో కొన్నేళ్లలోలేని విధంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మించుతూ టోకు ధరలు నవంబర్‌లో 14.23 శాతాన్ని తాకాయి. ఇక మరోపక్క రవాణా, ప్యాకేజింగ్, శ్రామిక వ్యయాలు పెరగడంతో పలు రంగాలపై ప్రతిలకూ ప్రభావం పడుతోంది. వెరసి ప్రధానంగా నిత్యావసర వస్తువుల జాబితాలోకి వచ్చే ప్రొడక్టులను విక్రయించే ఎఫ్ఎంసీజీ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే పలు ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల ధరలు 5–10 శాతం మధ్య పెరిగినట్లు తెలియజేశారు. ఈ బాటలో జనవరి నుంచి సైతం ధరలు మరోసారి హెచ్చనున్నట్లు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం.. అదానీ, పార్లే, డాబర్ రెడీ వచ్చే నెల నుంచి ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలను 5–8 శాతం, బాస్మతి బియ్యం ధరలను 8–10 శాతం మధ్య పెంచనున్నట్లు అదానీ విల్మర్ సీఈవో అన్షు మాలిక్ తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు. ఇటీవల ప్యాకేజింగ్ వ్యయాలు 15–18 శాతంమేర పెరిగినట్లు పేర్కొన్నారు. ఇక అక్టోబర్–డిసెంబర్లో ఇప్పటికే కొన్ని బిస్కెట్ ప్యాకింగుల ధరలను 5–10 శాతం మధ్య పెంచినట్లు పార్లే ప్రొడక్టస్ వెల్లడించింది. జనవరి–మార్చి మధ్య మరోసారి ధరలను 4–5 శాతంమేర హెచ్చించనున్నట్లు తెలియజేసింది. అయితే ద్రవ్యోల్బణం దిగివస్తుందని వేచిచూస్తున్నట్లు డాబర్ పేర్కొంది. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలను 3–4 శాతం మధ్య పెంచిన కంపెనీ ద్రవ్యోల్బణం తగ్గకుంటే మార్చి నుంచి మళ్లీ ప్రొడక్టుల ధరల పెంపును చేపట్టవచ్చని సంకేతమిచ్చింది. ఇటీవల 9 శాతాన్ని దాటిన ద్రవ్యోల్బణం ఆందోళనలకు తావిస్తున్నదని, ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు వ్యయనియంత్రణలను పాటిస్తున్నామని డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలియజేశారు. కెవిన్‌కేర్ సైతం సై వ్యక్తిగత సంరక్షణా ఉత్పత్తుల కంపెనీ కెవిన్‌కేర్ సైతం ద్రవ్యోల్బణం ధాటికి ధరలను పెంచకతప్పడంలేదని తెలియజేసింది. వచ్చే నెల నుంచి షాంపూలు, చర్మ సంరక్షణ ప్రొడక్టుల ధరలను 2–3 శాతం మధ్య హెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 3 శాతం వరకూ ఉత్పత్తుల ధరలను పెంచింది. షాంపూల విభాగంలో ప్రధానంగా నాన్సాచెట్స్ ప్రొడక్టుల ధరలనే పెంచనున్నట్లు కెవిన్‌కేర్ సీఈవో వెంకటేష్ విజయ రాఘవన్ పేర్కొన్నారు. కోవిడ్–19 సవాళ్లతో సరఫరాల అంతరాయాలు, తదితరాల కారణంగా గోధుమల ధరలు వార్షికంగా 20 శాతం పెరిగినట్లు పరిశ్రమరంగ నిపుణులు తెలియజేశారు. ఇక ముడిపామాయిల్ ధరలు 36 శాతంౖò జంప్‌చేసినట్లు పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడంతో గత 45 రోజుల్లో అదానీ విల్మర్ వంట నూనెల ధరలలో కోత పెట్టింది. సోయాబీన్ నూనెల లీటర్ ధరలను రూ. 175 నుంచి రూ. 155కు కుదించింది. ఇదేవిధంగా వంట నూనెల ధరలను సైతం రూ. 170 నుంచి రూ. 150కు దించింది. చదవండి: వంట నూనెల ధరలు తగ్గాయ్ -
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..?
లక్నో: పారి, పిహు, విధి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. కలిసిమెలసి ఉండేవారు. ఆడుతూపాడుతూ.. అమ్మానాన్నతో కలిసి సంతోషంగా జీవించేవారు. జింకపిల్లలా చెంగుచెంగున పరుగులు తీసే చిన్నారులు.. ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. చిన్నారుల మృతి వారి తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్తులను కూడా కలచి వేసింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలా మరణించారో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్, బరేలీకి చెందిన నవీన్ కుమార్ సింగ్‌కు పారి, పిహు, విధి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజులు క్రితం వరకు కూడా ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం ఈ అమ్మాయిలు బిస్కెట్లు, చిప్స్ కొనుక్కుని తిన్నారు. ఆ తర్వాత ఉన్నట్లుండి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. (చదవండి: వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!) ఇది గమనించిన చిన్నారుల తండ్రి నవీన్ కుమార్ వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే హాస్పిటల్‌కు వెళ్లేలోపే పారి, పిహు మరణించారు. చికిత్స పొందుతూ విధి మృతి చెందింది. చిన్నారులకు ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతి గురించి పోలీసులకు తెలియడంతో వారు.. సంఘటన స్థలానికి చేరుకుని.. అంత్యక్రియలు ఆపేశారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం ఇదే!) ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అటాప్సీ పరిక్షలో వెల్లడయ్యింది. ప్రస్తుతం పోలీసులు చిన్నారుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు బాలికలు తిన్న బిస్కెట్లు, చిప్స్ శాంపిల్స్‌ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. చదవండి: వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు -
బెక్టర్స్ ఫుడ్.. బంపర్ లిస్టింగ్
ముంబై, సాక్షి: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ప్రీమియం బిస్కట్ల కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్.. స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 288కాగా.. ఎన్ఎస్ఈలో రూ. 500 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 74 శాతం(రూ. 212) ప్రీమియంకాగా.. ప్రస్తుతం రూ. 585 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 600 వద్ద గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో రూ. 501 వద్ద లిస్టయ్యింది. ఇష్యూకి అన్ని వర్గాల నుంచీ బిడ్స్ వెల్లువెత్తడంతో 198 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 29 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 540 కోట్లు సమీకరించింది. ఐపీవో ప్రారంభానికి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవో నిధులను విస్తరణతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (2020: ఐపీవో నామ సంవత్సరం) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి అన్ని వర్గాల నుంచీ బిడ్స్ వెల్లువెత్తాయి. ఇష్యూ చివరి రోజు గురువారానికల్లా 198 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 1.32 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 262 కోట్ల షేర్లకుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రధానంగా సంపన్న వర్గాల నుంచి 621 రెట్లు అధికంగా దరఖాస్తులు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 29 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 177 రెట్లు అధికంగా బిడ్స్ లభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. రూ. 288 ధరలో బెక్టర్ ఫుడ్ పబ్లిక్ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా కంపెనీ రూ. 540 కోట్లు సమీకరించింది. ఐపీవో ప్రారంభానికి ముందురోజు సోమవారం(14న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవో నిధులను విస్తరణతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూ నేడు(15న) ప్రారంభమైంది. 17న(గురువారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా రూ. 540 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు వాటాలను విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, తదితర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్ కింగ్ ఐపీవో.. స్పందన సూపర్) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (బర్గర్ కింగ్ లిస్టింగ్.. అ‘ధర’హో) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బిస్కెట్ కప్‌లో చాయ్: తాగి తినొచ్చు..!
చెన్నై: చాయ్ విత్ బిస్కెట్స్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్. మనలో చాలా మంది ఉదయం చాయ్-బిస్కెట్‌తోనే ప్రారంభమవుతుంది అంటే అతిశయోక్తి కాదు. బయట టీ కోట్ల దగ్గర చాయ్ తాగేటప్పుడు కూడా బిస్కెట్ తినడం చాలా మందికి అలవాటు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మధురై టీ కొట్టు యాజమాని ఓ వెరైటీ కాంబినేషన్‌ని తీసుకొచ్చారు. సాధారణంగా టీని గాజు గ్లాస్, కాగితపు కప్పు, పింగాణి కప్పులో పోస్తారని తెలుసు. అయితే ఈ టీ కొట్టు యాజమాని మాత్రం వెరైటీగా బిస్కెట్ టీ కప్పులు తీసుకొచ్చాడు. అంటే బిస్కట్స్‌తో తయారు చేసిన కప్పులు అన్నమాట. మధురైలోని ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ చాక్లెట్-రుచిగల బిస్కెట్‌తో తయారు చేసిన తినే కప్పుల్లో తక్కువ మొత్తంలో టీని అందిస్తోంది. అంటే మీరు మీ టీని తాగవచ్చు, ఆపై కప్పు తినవచ్చు. దీని వల్ల వ్యర్థాలు ఉండవు.. మనకు భిన్నమైన అనుభూతి. ది బెటర్ ఇండియా వీడియో రిపోర్ట్ ప్రకారం ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ 1909 నుంచి ఉంది. అక్టోబర్ 2019 లో భారత ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నెమ్మదిగా తొలగించి 2022 నాటికి పూర్తిగా నిషేధించాలని భారత్ యోచిస్తోంది. వీటిలో ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, సీసాలు, స్ట్రాలు వంటి రోజువారీ వినియోగ వస్తువులు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అనేక మంది వ్యాపారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో టీ స్టాల్ యజమాని వివేక్ సబాపతికి వినూత్న ఆలోచన వచ్చింది. పర్యావరణ అనుకూలమైన టీ కప్పులు కోసం శోధిస్తున్నప్పుడు బిస్కెట్ కప్పులపై సబపతి దృష్టి పడింది. అలా దాన్ని అమల్లోకి తెచ్చారు. (చదవండి: నోట్లో ‘కుకీసు’కుందాం) ఇక ఈ తినదగిన బిస్కెట్ టీ కప్పు ధర 20 రూపాయలు మాత్రమే. ఈ వినూత్న ప్రయోగం టీ ప్రియులకు కూడా బాగా నచ్చింది. జూలై నెలలో ప్రారంభించినప్పటి నుంచి జనాలు బిస్కెట్ కప్పులో అందించే టీని తాగడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ కప్‌లో సుమారు 60 మిల్లీలీటర్ల టీ పడుతుంది. అయితే ఈ బిస్కెట్ కప్పులో పోసిన టీని పది నిమిషాల్లోనే తాగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కప్పు మెత్తగా అయ్యి చిరిగిపోతుంది. ఇక ఈ బిస్కెట్ కప్పులో మరిన్ని ఫ్లేవర్స్ తీసుకురావాలని భావిస్తున్నారు సభాపతి. ఒక్కసారి పరిస్థితులు చక్కబడితే దానిపై దృష్టి పెడతామని తెలిపారు. -
బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. వచ్చే వారం ఐపీవో చేపట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల గ్లోబల్ దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్సన్ సాధించిన నేపథ్యంలో బెక్టర్స్ ఫుడ్ సన్నాహాలు వేగవంతమైనట్లు తెలియజేశాయి. బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు కంపెనీ బన్స్ సరఫరా చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ బెక్టర్స్ క్రీమికా పేరుతో ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. 2018లోనూ.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ త్వరితగతిన అనుమతులు సంపాదించింది. ఒక ప్రయివేట్ రంగ కంపెనీగా 29 రోజుల్లోనే గ్రీన్‌సిగ్నల్ సాధించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ నెల 15కల్లా ఐపీవో ప్రారంభమయ్యే వీలున్నట్లు తెలియజేశాయి. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. తాజా ఇష్యూలో భాగంగా సీఎక్స్ పార్టనర్స్, గేట్‌వే పార్టనర్స్ కంపెనీలో కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దిగ్గజాలతో పోటీ లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బంపర్ ఆఫర్: ఏడాదికి 38 లక్షల జీతం
లండన్: నెలకు మూడు లక్షల రూపాయలకు పైగా జీతం.. ఏడాదికి 35 సెలవులు.. ఇవి కాక బోనస్‌లు, ఇంక్రిమెంట్లు. ఆఫర్ టెంప్టింగ్గా ఉంది.. పని ఎంత కష్టమో అనుకుంటున్నారా. అది మరీ సులభం. కేవలం బిస్కెట్లు టేస్ట్ చేసి.. ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. ఇందుకు గాను ఏడాదికి అక్షరాల 38 లక్షల రూపాయల జీతం చెల్లించేందుకు సిద్ధం అంటూ ఓ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఇంకేముంది కుప్పల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయట. కంపెనీ అడ్రెస్ ఇవ్వండి మేం కూడా అప్లై చేస్తాం అంటారా వెయిట్. ఇది మన దగ్గర కాదు. యూకేకు చెందిన స్కాటిష్ బిస్కెట్ సంస్థ బోర్డర్ బిస్కెట్స్ ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. అదే బిస్కెట్ రుచి చూసే పని. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన మాస్టర్లకు బిస్కెట్ రుచి చూసినందుకు గాను సంవత్సరానికి 40 వేల పౌండ్లు చెల్లించనున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దీని విలువ సుమారు 40 లక్షలుగా ఉండనుంది. అంటే నెలవారీగా 3 లక్షల రూపాయలకు పైగా జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగం కోసం, మీకు ప్రత్యేక ప్రతిభ ఉండాలి. (చదవండి: తొమ్మిదేళ్లుగా మెతుకు ముట్టడు) ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి పరీక్షలు నిర్వహిస్తారు, బిస్కెట్లపై మంచి పరిజ్ఞానం ఉండాలి. ఇది మాత్రమే కాక, నాయకత్వ నైపుణ్యాలు, సమాచార మార్పిడిలో మంచి అవగాహన ఉండాలి. దాంతో పాటు కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచడానికి కావాల్సిన సూచనలు ఇచ్చే వారికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. బేకరీ ఉత్పత్తులు, ప్రక్రియలతో శాస్త్రీయ, ఆచరణాత్మక అనుభవం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వంటి ఐటి నైపుణ్యాలు ఉండాలని తెలిపారు. వీటితో పాటు యూకే చట్టాలు, సాంకేతికత, పరిశ్రమ సంకేతాల గురించి తగిన అవగాహన ఉన్న వ్యక్తి అవసరం అని కంపెనీ తెలిపింది. సెలక్టయిన వ్యక్తికి సంవత్సరానికి 35 రోజుల సెలవు, బోనస్ పథకం, 1000 కి పైగా రిటైలర్లలో డిస్కౌంట్, ఉచిత ఆన్లైన్ వ్యాయామ కార్యక్రమాలు, ఉచిత బిస్కెట్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. -
చిన్నారుల మృతి కేసు: దర్యాప్తు ముమ్మరం
-
చిన్నారుల మృతి కేసు: దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: రోజ్ బిస్కెట్లు తిని పిల్లలు మృతి చెందిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ రోజ్ బిస్కెట్ల తయారీ కంపెనీలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బిస్కెట్లకు సంబంధించిన శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. బిస్కెట్లు తయారీ యూనిట్‌ని అధికారులు సీజ్ చేశారు. బిస్కెట్లు తిని పిల్లలు అస్వస్థతకు గురికావడం అర్థం కావట్లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బిస్కెట్లను మార్కెట్ నుంచి వెనక్కి రప్పిస్తున్నామన్నారు.బిస్కెట్లలో లోపం ఎలా జరిగిందో అర్థం కావట్లేదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే విషయాలు బయటపడతాయని అధికారులు వెల్లడించారు. (చదవండి: బిస్కెట్లా?.. విష ప్రయోగమా?) ‘బిస్కెట్’ ఘటనలో మూడో చిన్నారి మృతి.. కర్నూలు జిల్లా ఆళ్ల గడ్డ మండలం చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఈ నెల 13న బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురైన మూడో చిన్నారి కూడా మృత్యువాత పడింది. ఘటన జరిగిన రోజు హుస్సేన్‌బాషా(6),తర్వాతి రోజు హుస్సేన్‌బీ(4) అనే ఇద్దరు మృతి చెందగా, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడో బాలిక జమాల్‌బీ(8) బుధవారం మరణించింది. -
బిస్కెట్లా?.. విష ప్రయోగమా?
ఆళ్లగడ్డ: మండలంలోని చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి టీ తాగి, బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై హుస్సేన్‌బాష (6) అనే చిన్నారి మృతి చెందగా..మరో ఇద్దరు ఆసుపత్రులో చేరిన విషయం విదితమే. వీరిలో హుస్సేన్‌బీ (4) అనే చిన్నారి కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మరో చిన్నారి జమాల్‌మీ మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బిస్కెట్లు వికటించడం ఏంటన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఘటనపై పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టులో తయారైన బిస్కెట్ల ప్యాకెట్‌పై మరో 18 నెలల గడువు ఉంది. అందులో కల్తీ ఉంటే అస్వస్థతకు గురవడం తప్పా మరణాలు సంభవించే పరిస్థితి చాలా అరుదని అధికారులే అంటున్నారు. దీంతో బిస్కెట్లలోనే ఎవరైనా విషం కలిపారా? లేక పాలు / టీలో విష ప్రయోగం జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి : (చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు ) హోల్‌సేల్ దుకాణం సీజ్ చింతకొమ్ముదిన్నెలోని చిల్లర దుకాణానికి బిస్కెట్లు సరఫరా చేసిన ఆళ్లగడ్డ పట్టణంలోని సాయిరాం ఎంటర్ప్రైజెస్ హోల్‌సేల్ దుకాణాన్ని పోలీసుల సూచన మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఆహార భద్రత అధికారులు వచ్చి పరిశీలించే వరకు దుకాణాన్ని మూసేయడంతో పాటు అందులో ఉండే బిస్కెట్లు బయటకు వెళ్లకుండా సీజ్ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. చిన్నారుల మృతి ఘటనపై తహసీల్దార్ రవి, ఐసీడీఎస్ అధికారిణి సుశీల సోమవారం తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారులు బిస్కెట్లు కొనుగోలు చేసిన దుకాణం నిర్వాహకునితో పాటు గ్రామంలో పలువురితో మాట్లాడి వివరాలు సేకరించారు. చిన్నారుల మృతి ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ విషయంపై ఆహార భద్రత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి..దుకాణాన్ని సీజ్ చేయించాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశాం. పోస్టుమార్టం నివేదికలు వస్తే ఎలా మృతి చెందారన్న విషయం బయటకు వస్తుంది' అని ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు తెలిపారు