సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు అందించే ఆహార పదార్థాల విషయంలో భారీగా అవినీతి జరుగుతోంది. తాజాగా భుదాయ్‌లోని ఆశ్రమ పదహతి విద్యాలయలో చిన్నారులకు గడువు ముగిసిన బిస్కెట్లను అధికారులు అందించారు. వీటిని తిన్న చిన్నారుల్లో తీవ్ర అస్వస్థతో ఆసుపత్రి పాలయ్యారు. చాలామంది చిన్నారులు వాంతులు, విరోచనాలు, కపుడు నొప్పతో బాధపడుతున్నారు.
చిన్నారులకు గడువు ముగిసిన బిస్కెట్లను అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆశ్రమ్ పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తోందని.. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ విహాక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment