expiry date
-
ఎక్స్పైరీ సెలైన్ ఎక్కించేశారు!
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు కాలం చెల్లిన మందులతో చికిత్స చేస్తున్నారు. శుక్రవారం ఓ రోగికి కాలం చెల్లిన సెలైన్ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎస్.కె.అజారుద్దీన్ జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అతడిని అడ్మిట్ చేసుకుని వైద్యుల సూచన మేరకు అతడికి సెలైన్ పెట్టారు. అక్కడే ఉన్న అజారుద్దీన్ సోదరుడు ఆసిఫ్..సెలైన్ సరిగ్గా ఎక్కడం లేదని దానిని పరిశీలించగా ఎక్స్పైరీ డేట్ చూసి షాక్ అయ్యాడు.ఈ ఏడాది మార్చితోనే సెలైన్ కాలపరిమితి ముగిసినట్లు గుర్తించిన వెంటనే అక్కడి వైద్యులు, సిబ్బందిని నిలదీశాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మీడియా ఆస్పత్రి ఆవరణలోని ఓ మెడిసిన్ ట్రాలీలోని మందులను పరిశీలించగా, మూడు వాయిల్స్ కాలం చెల్లినవి కనిపించాయి. అక్కడి నుంచి ఇంజెక్షన్ ఓపీకి వెళ్లి చూడగా అందులో సైతం ఓ వాయిల్ 3 నెలల ముందే గడువు ముగిసినట్లు కనిపించింది.దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ వంశీ మాధవ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. కాగా, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రాత్రి డీసీహెచ్ సురేశ్, డీఎంహెచ్‌వో రాజేందర్ సందర్శించారు. కాలంచెల్లిన మందులు వాడటంపై కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని తని ఖీ చేసినట్లు తెలిపారు. అజారుద్దీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
కాలం చెల్లిన శాటిలైట్‌ను ధ్వంసం చేసిన ఇస్రో
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): కాలం చెల్లిన జీశాట్–12 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనే పేల్చివేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. 2011 జులై 15న పీఎస్ఎల్వీ సీ17 రాకెట్ ద్వారా జీశాట్–12 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. సుమారు 12 ఏళ్లపాటు సేవలందించింది. శుక్రవారంతో ఈ ఉపగ్రహానికి కాలం చెల్లింది. దీంతో, అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోకుండా ధ్వంసం చేసినట్లు ఇస్రో పేర్కొంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను తొలగించే పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఇస్రో స్వయంగా ఆ ప్రక్రియను చేపడుతోంది. -
ఎక్స్పైరీ డేట్ ఎందుకు? ఆ తర్వాత వాడితే ఏమవుతుందో తెలుసా!
వివిధ రకాల ఉత్పత్తులపై ఎక్స్పైరీ డేట్ ఎందుకు వేస్తారు? కాలం చెల్లిన తర్వాత వాటిని వాడితే ఏమౌతుంది? కొన్ని రకాల ఆహారపదార్థాల పైన యూజ్ బై లేదా బెస్ట్ బిఫోర్ అని రాసి ఉంటుంది. దాని అర్థం ఆ తేదీ దాటిని తర్వాత వాటిని వినియోగించకూడదా? ఒకవేళ వాడితే ఏమవుతుంది? తెలుసుకుందామా..? ఇంటి అవసరాల కోసం మనం ఒకోసారి కొన్ని నెలలకు సరిపడా అన్ని రకాల కిరాణా సామాన్లు ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే కొద్దిరోజుల తర్వాత వాటిలో కొన్నింటికి ఎక్స్పైరీ డేట్ చూసి, అయ్యో, ఇది ఈ తేదీలోగా గమనిస్తే వాటిని అలాగే వాడుతున్నారా, లేక ఎక్స్పైరీ అయిపోయాయని పాడేస్తున్నారా తెలుస్తుంది. మన ఇండ్లల్లో కూడా తాతాల కాలం నుంచే కారం, పసుపు, చింతపండు అని ఎన్నో రకాల పదార్థాలను ఒకేసారి కొనుగోలు చేసి వాటినే భద్రంగా దాచుకొని సంవత్సరాల పాటు వాడటం మనకు తెలుసు. మరి ఇంతకాలంగా లేనిది ఇప్పుడు ఇప్పుడు ప్రతీదానికి ఈ ఎక్స్పైరీ తేదీతో సంబంధం ఏమిటి? ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తే ప్రతి దానిపై ధరతో పాటు ఎప్పుడు తయారు చేశారు(Manufacture Date), అది ఎప్పటిలోగా వాడాలో తెలిపే ఎక్స్పైరీ డేట్ ముద్రించి ఉంటుంది. అయితే ఏదైనా వస్తువు దాని కాలపరిమితి దాటిపోయింది అంటే అది పూర్తిగా పాడైపోయింది ఇక వినియోగించకూడదు అని కాదు. ఆ పదార్థం ప్యాకింగ్ చేసేటపుడు ఏదైతే తాజాదనం ఉంటుందో ఆ తేదీ దాటిన తర్వాత తిరిగి అదే తాజాదనం ఉండదు అని అర్థం. చదవండి: Health: పెళ్లి సంబంధాలు చూస్తున్నారు... కానీ ఆ సమస్య! పిల్లలు పుట్టే అవకాశాలు!? వాస్తవానికి ఏ వస్తువైనా మనం భద్రపరుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఉండి, ప్యాకింగ్ సరిగా లేకుంటే అది కూడా వెంటనే పాడవవచ్చు. ఉప్పులాంటి పదార్థాలను సంవత్సరాల కొద్దీ వాడుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ లాంటివి కూడా సరిగ్గా భద్రపరిస్తే సంవత్సరం వరకూ నిల్వ ఉంటాయి. ఏదైనా వస్తువు చెడిపోయింది అంటే అది దాని నుంచి వచ్చే వాసన, దాని స్వభావాన్ని చూసి మనం పసిగట్టవచ్చు. అలా అని ఇకపై ఎక్స్పైరీ డేట్ ఉన్నవన్నీ తినేయకండి. ఎందుకంటే, సాధారణంగా ఆహార పదార్థాలు కొద్ది కాలం వరకు మాత్రమే బాగుంటాయి. గడువు ముగిసే కొద్ది ఆహార పదార్థాలు పాడవుతాయి. మందుల విషయంలో ఎక్స్పైరీ తేదీని జాగ్రత్తగా గమనించాలి. ఆ తేదీ దాటిపోయిన తర్వాత వాడటం వల్ల ఆ మందు సమర్థంగా పని చేయకపోవచ్చు లేదా దానివల్ల మరింత ప్రమాదం ఏర్పడవచ్చు. అందువల్ల మందుల విషయంలో మాత్రం ఎక్స్పైరీ తేదీ దాటకముందే వాడటం మంచిది. -
గడువు తీరిన బీర్ల విక్రయం!
పరిగి : కొంతమంది మద్యం దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన బీర్లు విక్రయిస్తూ యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై విని యోగదారులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం సాయంత్రం పరిగికి చెందిన కొందరు పరిగిలోని న్యూ పరిగి వైన్స్‌లో బీర్లు కొనుగోలు చేశారు. వీటిపై డేట్ చూడగా గడువు ముగిసినట్లు గుర్తించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే కాలం చెల్లిన బీర్లు అమ్మారంటూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్యం దుకాణం వద్దకు చేరుకున్న అధికారులు కాటన్ బీర్లకు సంబంధించిన విక్రయ గడువు ముగిసినట్లు గుర్తించారు. 12 బీరు సీసాలను ఎక్సైజ్ ఠాణాకు తరలించి దుకాణం సీజ్ చేశారు. ఈ మేరకు వైన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం స్టాక్ వివరాలు నమోదు చేసే ఎక్సైజ్ అధికారులు దీన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. లాక్డౌన్ సమయంలోనూ దుకాణంలో ఉన్న మద్యం నిల్వలు తరలించారని ఆరోపణలు వచ్చినా.. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవరించారని మండిపడుతున్నారు. -
బ్యూటీరియా
మేకప్ చేసుకుంటున్నారు బాగానే ఉంది. వాటి ఎక్స్పైరీ డేట్లు చూస్తున్నారా? పోనీ.. వాడిన బ్రష్‌లను, స్పాంజ్‌లను ఎన్నడైనా శుభ్రం చేశారా? లేదంటున్నారా! అయితే మీరు చిక్కుల్లో పడినట్లే. ఎందుకంటే.. ఇలాటి వాటిల్లో హానికారక బ్యాక్టీరియాలు బోలెడు ఉండిపోతాయి అంటోంది ఓ తాజా అధ్యయనం! మేకప్‌కు ఉపయోగించే వాటిల్లో కనీసం 90 శాతం వాటిల్లో స్టాఫైలోకాకస్ ఔరియస్, ఈ–కోలీ, సిట్రో బ్యాక్టర్ ఫ్రెండీ వంటి హానికారక బ్యాక్టీరియా ఉంటుందని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆస్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నారు. ఇవన్నీ ఒకసారి వాడిన మేకప్ సామగ్రిలో మాత్రమే ఉండేవే అయినప్పటికీ, అలా ఉన్నట్లు తెలియకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశముందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్త అమ్రీన్ బషీర్ తెలిపారు. అధ్యయనం కోసం తాము లిప్‌స్టిక్, లిప్‌గ్లాస్, ఐ లైనర్, మస్కారాలను ఎంచుకున్నామని, వీటిల్లో నీటి మోతాదు ఎంత ఎక్కువ ఉంటే బ్యాక్టీరియా సంతతి అంత ఎక్కువగా ఉన్నట్లు తెలిసిదని చెప్పారు. ఫౌండేషన్, కాంటూరింగ్ల కోసం వాడే బ్లెండర్ స్పాంజిల్లో పరిస్థితి మరీ దారుణమని అన్నారు. మొత్తమ్మీద తాము 467 ఉత్పత్తులను పరిశీలించామని వీటిల్లో 96 లిప్‌స్టిక్‌లు కాగా, 92 ఐ లైనర్లు, 93 మస్కారా ప్యాకెట్లతోపాటు 107 లిప్ గ్లాస్లు, 79 బ్లెండర్ స్పాంజిలు ఉన్నాయని వివరించారు. మేకప్ ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులు అస్సలు ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ఒక ప్రశ్నపత్రం ద్వారా తాము మేకప్ సామాగ్రిలో బ్యాక్టీరియా ఎలా చేరుతోందో తెలుసుకునే ప్రయత్నం చేశామని, అందుకు వాడకందారులదే ఎక్కువ బాధ్యతని తేలిందని అన్నారు. ప్రతి మేకప్ సామగ్రికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని, వినియోగదారులు పట్టించుకోకపోవడం వల్ల ఆ సమయం తరువాత బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుందని అమ్రీన్ వివరించారు. మీరు ఉండే ప్రాంతా న్ని బట్టి ఈ విషయాన్ని తయారీదారులు తెలియజేసే పద్ధతి ఉంటుంది. అమెరికాలోనైతే ప్యాకేజింగ్‌పైనే ఈ సమాచారం ప్రింట్ చేస్తారు. 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం చాలామంది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తరువాత కూడా మేకప్ సామగ్రిని చెత్తబుట్టలోకి పడేయడం లేదని వెల్లడైంది. బ్లెండర్ స్పాంజిల విషయంలో తేలిందేమిటంటే.. 93 శాతం మంది వీటిని ఎప్పుడూ శుభ్రం చేసుకోరూ అని! నేలపై పడిన తరువాత కూడా వాటిని అలాగే వాడేస్తామని 65 శాతం మంది ఒప్పుకున్నారు. వీలైనంత వరకూ ఈ బ్లెండర్ స్పాంజిలను గోరువెచ్చటి నీటిలో, సబ్బులతో శుభ్రం చేసుకోవడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పరిశోధన వివరాలు అప్లయిడ్ మైక్రోబయాలజీ తాజాసంచికలో ప్రచురితమయ్యాయి. -
పసి ప్రాణాలతో చెలగాటమా?
యాదగిరిగుట్ట : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేయాలి.. అం దుకోసం ప్రతి కేంద్రానికి పౌష్టికాహారం, కోడి గుడ్లు, పాల ప్యాకెట్లు తదితరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పదేపదే చెబుతు న్నా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. పౌష్టికాహారం అందించి పసి పిల్లల ఎదుగుదలకు చర్యలు చేపట్టాల్సిన కేంద్రాలు.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని వెలుగు చూస్తున్న నిజాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆకస్మిక తనిఖీలకు వచ్చిన అధికారులు.. కేంద్రాల్లో బయటపడుతున్న గడువు ముగిసిన పాలప్యాకెట్లు, కుళ్లిపోయిన కోడిగుడ్లు చూసి నివ్వెరపోతున్నారు. తనిఖీల్లో నిజాలు... యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, చొల్లేరు, మ ర్రిగూడెం, ఆహ్మద్‌నగర్, పెద్దకందుకూర్‌లోని అం గన్వాడీ కేంద్రాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మేడ్చ ల్, యాదాద్రి భువనగిరి రిజినల్ ఆర్గనైజర్ మల్లేపల్లి సువర్ణరెడ్డి సోమవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన కుర్కురే, పాల ప్యాకెట్లు, ఇతర స్నాక్స్ ప్యాకెట్లు లభ్యమయ్యా యి. మూడు రోజుల క్రితం ఆలేరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లోనూ కుళ్లిపోయిన కోడిగు డ్లు, గడువు తీరిన పాల ప్యాకెట్లు బయటపడ్డ విష యం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అంగన్వా డీ టీచర్లు, సిబ్బంది కాలం చెల్లిన పాల ప్యాకెట్లు, ఇతర పౌష్టికాహారాలను పడేస్తున్నారు. పెద్దకందుకూర్‌లో 2018 మే 2నుంచి ఉన్న 30పాల ప్యాకె ట్లు, చొల్లేరు కేంద్రంలో 2017 డిసెంబర్ 17లో ఇవ్వాల్సిన పాల ప్యాకెట్లు, గడువు ముగిసిన కురుకురేలతో పాటు స్నాక్స్ లభించాయి. ప్రాణాలతో చెలగాటమే... ఇటీవల కాలంలో అంగన్వాడీ కేంద్రాల్లో గడువు ముగిసి, కాలం చెల్లిన పాలు, గుడ్డు, కుర్కురే వం టి ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. వీటినే చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్నా రు. దీంతో వారి ఆరోగ్యానికి ముప్పు వాటి ప్ర మాదం లేకపోలేదు. వీటిని సరాఫరా చేసే కాంట్రాక్టులు నాణ్యమైనవి ఇస్తున్నారా.. లేక కాలం చెల్లినవి ఇస్తున్నారా? అనే విషయాలను కూడా స్థానికంగా కేంద్రాల్లో ఉండే టీచర్లు గమణించకపోవడం విడ్డూరంగా ఉందని తనిఖీలకు వచ్చిన అధికారులు అంటున్నారు. తనిఖీలకు వచ్చిన అధికారులకు ఫోన్లు! అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలకు వచ్చిన అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. మన వారే.. పట్టించుకోవద్దంటూ హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇటీవల కాలం చెల్లిన కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు లభ్యమైన విషయం బటయకు పొక్కకుండా కాపాడేందుకు అంగన్వాడీ టీచర్ల వద్ద వారి పై స్థాయి అధికారులు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉపేక్షించేది లేదు మూడు రోజులుగా ఆలేరులోని అన్ని సెక్టార్లలో తనిఖీలు చేస్తున్నాను. ఈ తనిఖీల్లో చెప్పలేని నిజాలు వెలుగుచూస్తున్నాయి. కుళ్లిపోయిన కోడి గుడ్ల, గడువు ముగిసిన పాల ప్యాకెట్లు, కుర్కురేలతో పాటు ఇతర స్నాక్స్ బయట పడుతున్నాయి. గడువు ముగిసిన వస్తువులను గుర్తించడంలో అంగన్వాడీ సిబ్బంది విఫలమవుతున్నారు. కేం ద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షిం చేది లేదు. కింది స్థాయి సిబ్బంది అయినా పై స్థాయి అధికారులైన చర్యలు తప్పవు. –మల్లెపల్లి సువర్ణ, స్త్రీ, శిశు సంక్షేమ రీజినల్ ఆర్గనైజర్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లా -
ఆ బిస్కెట్లు తిన్న చిన్నారులు...?
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు అందించే ఆహార పదార్థాల విషయంలో భారీగా అవినీతి జరుగుతోంది. తాజాగా భుదాయ్లోని ఆశ్రమ పదహతి విద్యాలయలో చిన్నారులకు గడువు ముగిసిన బిస్కెట్లను అధికారులు అందించారు. వీటిని తిన్న చిన్నారుల్లో తీవ్ర అస్వస్థతో ఆసుపత్రి పాలయ్యారు. చాలామంది చిన్నారులు వాంతులు, విరోచనాలు, కపుడు నొప్పతో బాధపడుతున్నారు. చిన్నారులకు గడువు ముగిసిన బిస్కెట్లను అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆశ్రమ్ పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తోందని.. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ విహాక్ తెలిపారు. -
గడువు తీరితే గండమే..!
- గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్పైరీ ఉంటుంది - గుర్తించి వెంటనే మార్చుకోవాలి పటాన్చెరు : మనం వినియోగించే ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తినే పదార్థాల నుంచి వేసుకునే మందులు ఇలా ప్రతి దానికి కాల పరిమితి ఉంటుంది. మరి నిత్యం వంట గదిలో ఉండే గ్యాస్ సిలిండర్ గురించి మీకు తెలుసా? దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని? కాలం తీరిన సిలిండర్ వినియోగిస్తే ప్రమాదకరమని తెలుసా? ఎక్స్పైర్ డేట్ ఎలా గుర్తించాలి? గ్యాస్ సిలిండర్‌పైన ఉన్న రింగ్ కింద నిలువుగా మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వైపు గ్యాస్ సిలిండర్ గడువు తేదీ ముంద్రించి ఉంటుంది. సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజించి మూడు నెలలకు ఒక ఆంగ్ల అక్షరం చొప్పున ఏ,బీ,సీ,డీగా గుర్తిస్తారు. జనవరి నుంచి మార్చి వరకు ‘ఏ’తో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ‘బీ’తో, జులై నుంచి సెప్టెంబర్ వరకు ‘సీ’తో, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ‘డీ’తో గుర్తిస్తారు. ఉదాహరణకు మీ సిలిండర్‌పై ‘డీ15’ అని ఉంటే డిసెంబర్ 2015 వరకు వినియోగించాలి. ఆ తేదీ దాటితే గడువు తీరినట్లే. గడువులోగా వాడితేనే మంచిది సిలిండర్ తీసుకున్న తర్వాత కొంత మంది వాటిని వినియోగించకుండా నెలల తరబడి నిర్వ ఉంచుతుం టారు. మరికొందరు ప్రత్యేక అవసరాల కోసం సిలిండర్లు బ్లాక్‌లో తీసుకుని వాడుతుంటారు. సందర్భం ఏదైనప్పటికీ వాటిపై ఉండే గడువు తేదీలోగా వాడితే మంచిది. కాలం చెల్లిన సిలిండర్లు వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి సిలిండర్లను గుర్తించి సంబంధిత డీలర్‌కు సరెండర్ చేయాలి. సిలిండర్ తీసుకున్న తేదీకి, దానిపై ఉన్న తేదీకి మధ్య కనీసం నాలుగు నెలల సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద ఉన్న తేదీలోగానే సిలిం డర్ వినియోగించాలి ఖాళీ సిలిండర్‌కూ కాల పరిమితి సిలిండర్లోని గ్యాస్ వాడకానికే కాకుం డా ఖాళీ సిలిండర్‌కు కూడా నిర్దిష్ట కాల పరిమితి ఉం టుంది. ఈ విషయం మాత్రం విని యోగదారులకు సంబంధం లేనిది. ఖాళీ సిలిండర్ కాలపరిమితి ఏడేళ్లు. తయారీదారులు తమ వద్ద రికార్డుల్లో లేని బ్యాచ్ నంబర్ల ప్రకారం ఏడేళ్లు తాడిన సిలిండర్లను డీలర్ల నుంచి వెనక్కు తెప్పించి ప్రత్యేక పరికరాలతో పరీక్షిస్తారు. నాణ్యత సరిగ్గా ఉంటే మరో ఐదేళ్ల పాటు విని యోగిస్తారు. లేకుంటే వాటిని నాశనం చేస్తారు. -
గ్యాస్ సిలెండర్కీ ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుంది!
గత రెండు నెలల కాలంలో గ్యాస్ సిలెండర్లు పేలిన ఘటనలు వార్తల్లో చాలా కనిపించాయి. వేసవి కాలంలో ఇటువంటి ప్రమాదాలు మరింత పెరుగుతుంటాయి. ఇలాంటివి విన్నప్పుడు వంటింట్లోకి వెళ్లాలంటే అడుగులు కాస్త తడబడతాయి. అయితే అంత భయపడాల్సిన పని లేదు. గ్యాస్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చు. గ్యాస్ సిలెండర్‌కు ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుందని చాలామందికి తెలియదు. అదే అసలు సమస్య. సిలెండర్ పైన సంవత్సరాన్ని సూచించే అంకెతో పాటు ఎ,బి,సి,డి అనే అక్షరాలు ఉంటాయి. ఎ అంటే మార్చి, బి అంటే జూన్, సి అంటే సెప్టెంబర్, డి ఉంటే డిసెంబర్ వరకు అని అర్థం. ఆ నెల దాటితే వాడటం ప్రమాదమే. కాబట్టి కచ్చితంగా కాల పరిమితి చూసుకుని తీసుకోండి. సిలెండర్ తీసుకునేటప్పుడు సీలు తీసి, పరీక్షించి ఇవ్వమని తెచ్చిన వ్యక్తిని అడగండి. లీకేజీ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. వంటగదిలోకి గాలి, వెలుతురు బాగా రావాలి. సిలెండర్‌ను షెల్ఫ్‌లో పెట్టి తలుపులు మూయడం లాంటివి చేయకండి. కాస్త చల్లదనం ఉండే చోటే పెట్టండి. కొంతమంది సిలెండర్‌ను కింద పెట్టి, ఆ పక్కనే స్టౌ పెట్టి వండేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. స్టౌ ఎప్పుడూ సిలెండర్ కంటే ఎత్తులోనే ఉండాలి. రబ్బర్ ట్యూబ్‌ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దాని దగ్గరగా ఎటువంటి వేడి వస్తువులూ పెట్టకూడదు. ఐదేళ్లకోసారి ట్యూబ్‌ను తప్పకుండా మార్చాలి. తక్కువ రేటు పొయ్యిలు వాడితే వాటి భాగాలు త్వరగా పాడవుతాయి. ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మంచి స్టౌ వాడాలి. దాన్ని కూడా సంవత్సరానికోసారి పరీక్ష చేయించాలి. గ్యాస్ ఏజెన్సీవాళ్లను పిలిస్తే వాళ్లే వచ్చి చేస్తారు. వంట పూర్తి కాగానే స్టౌ కట్టేసి ఊరుకోకుండా, రెగ్యులేటర్‌ని తప్పకుండా ఆఫ్ చేయండి. -
డేట్ దాటితే డేంజరే!
* వంట గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్పైరీ డేట్ * వినియోగదారులూ జాగ్రత్త మండపేట రూరల్ : ఎక్స్పైరీ డేట్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మెడిసిన్, ఇంజక్షన్లు, కూల్ డ్రింక్స్, తినుబండారాలు, ఎక్స్ట్రాఎక్స్ట్రా... అయితే మనం నిత్యం వాడే గ్యాస్ సిలిండర్‌కూ ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే సంగతి మీకు తెలుసా..? చాలా మందికి తెలియదు కదూ... అయితే ఈ కథనం చదవండి... చాలా వరకు మనం ఇంటికి వచ్చిన సిలిండర్‌ను పూర్తిగా గమనించం... గమనిస్తే సిలిండర్ రింగ్ కింది భాగంలో వాటి తయారీ తేదీ, కాలపరిమితి ముగిసే తేదీ(ఎక్స్పైరీ డేటు) కూడా ముద్రిస్తారు. ఆ తేదీలను ఏ,బీ,సీ,డీలుగా విభజిస్తారు. అంటే జనవరి - మార్చి(ఏ), ఏప్రిల్- జూన్(బి), జూలై- సెప్టెంబర్(సీ), అక్టోబర్- డిసెంబర్(డి)గా ముద్రిస్తారు. ఉదాహరణకు సిలిండర్ కాలపరిమితి 2014 మే నెలతో ముగుస్తుందనగా, దానిపై బీ-14 అని ముద్రిస్తారు. ప్రమాదం సుమా! కాలపరిమితి ముగిసిన సిలిండర్లు వాడడ ం వల్ల అవి పేలి ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. ఇలా కాలపరిమితి ముగిసిన సిలిండర్లను కంపెనీలు ముందుగానే గుర్తించి వాటిని పక్కన పెడతాయి. అలా కాకుండా పొరపాటున కాలపరిమితి ముగిసిన సిలిండర్లు వస్తే వాటిని గుర్తించి డెలివరీ బాయ్‌కు సమాచారమివ్వాలి. వారొచ్చి కొత్త సిలిండర్‌ను అందజేస్తారు. గ్యాస్ వినియోగంలో కొన్ని మెళకువలు... గ్యాస్ వినియోగంలో కొద్దిపాటి మెళకువలు పాటిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. సిలిండర్‌కు స్టౌకి తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకే సిలిండర్‌కు రెండు స్టౌలు ఉంచకూడదు. సిలిండర్‌ను కబ్ బోర్డులో పెట్టినట్టయితే తగినంత గాలి తగిలేలా చూసుకోవాలి. వంటగది కిటికీలు తెరిచే ఉంచుకోవాలి. వంట చేసేటప్పడు మినహా మిగిలిన సమయంలో రెగ్యులేటర్ ఆఫ్‌లో చేయాలి. రెగ్యులేటర్ నుంచి స్టౌవ్‌కి గ్యాస్ సరఫరా చేసే ట్యూబ్‌కు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తలు పాటిస్తే పెనుప్రమాదాలు జరగకుండా చేయవచ్చు. -
మందుల ఆయువు ముందే మూడుతోంది..
కాకినాడ క్రైం :ప్రతి ఔషధానికీ ‘ఎక్స్పైరీ డేట్’ (అది నిరుపయోగంగా మారే తేదీ) ఉంటుంది. ఆ తేదీలోగా నే దాన్ని వాడితేనే అది పని చేస్తుంది. అయితే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంతోప్రజలకు ఉచితంగా అందాల్సిన లక్షల విలువైన మందులు ఆ తేదీతో నిమిత్తం లేకుండానే నిరుపయోగమైపోతున్నాయి. బూజు పట్టి పనికి రాకుండా పోతున్నాయి.గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ప్రభుత్వం ఉచితంగా మందులిస్తోంది. దానిలో భాగంగా ఫై సల్ఫేట్ అండ్ ఫోలిక్ యాసిడ్ సిరప్ 60 మిల్లీ లీటర్ల బాటిళ్లను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు అందజేసింది. 2013 జూలైలో తయారైన ఈ మందు 2015 జూన్ వరకు పనిచేస్తుంది. దీని ధర బయటి మార్కెట్లో రూ. 40 పైగా ఉంటుంది. అలాంటి సిరప్ బండిళ్లను జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలోని కారు షెడ్లో పడేశారు. ఏడాది నుంచి అవి అక్కడే ఉన్నట్టు సిబ్బంది చెబుతున్నారు. నెలల తరబడి అక్కడే ఉండడంతో వాటికి చెదలు పట్టి పాడయ్యాయి. ఒక్కోదానిలో 100 బాటిళ్ల చొప్పున ఉండే సుమారు 50 అట్టపెట్టెలకు అలా చెదలు పట్టించారు. ఆ మందుల ధర రూ.రెండు లక్షలు పైబడి ఉంటుంది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ విధంగా వ్యవహరిస్తున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలోని మెడికల్ స్టోర్స్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలకు మందులు సరఫరా చేస్తుంటారు. మందులు నిల్వ చేసేందుకు గోడౌన్ లేకే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోందని సిబ్బంది పేర్కొంటున్నారు. గోడౌన్ లేనంత మాత్రాన కారు షెడ్లలో, ఆరు బయట పడేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫార్మసిస్టు ఎక్కడ...? జిల్లాలో 109 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 23 క్లస్టర్లు, 20 అర్బన్ హెల్త్ సెంటర్లు, 805 సబ్ సెంటర్లున్నాయి. వాటికి డీఎంహెచ్ఓ కాార్యాలయంలోని మెడికల్ స్టోర్సు నుంచి మందులు సరఫరా చేస్తుంటారు. ఇంతవరకూ ఇక్కడ ఫార్మసిస్టు పోస్టు లేకపోవడం గమనార్హం. ఫార్మసిస్టు లేకుండా మందులు విక్రయించకూడదని బయటి మందుల షాపులను హెచ్చరించే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పరిరక్షించే వైద్య, ఆరోగ్య శాఖకు ఫార్మసిస్టును నియమించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ఫార్మసీ సూపర్వైజర్ పోస్టు మాత్రమే ఉంది. అది కూడా ఏడాది నుంచి ఖాళీగా ఉంది. దీంతో విరవ పీహెచ్సీ ఫార్మసిస్టు ఇక్కడ వారానికి మూడు రోజులు విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా స్టోర్స్‌లో మందులు నిల్వ చేసే ప్రాథమిక సిబ్బందికి లేకపోవడంతో లక్షల విలువైన మందులు వ్యర్థమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగుచర్యలు తీసుకోవాలిన ప్రజలు, వైద్య నిపుణులు కోరుతున్నారు. -
వాయనం: ‘లేబుల్’ చూసే కొంటున్నారా?
ఒకప్పుడు సరుకులు కొనాలంటే కిరాణా కొట్టుకు వెళ్లి, ఏది ఎంత కావాలో చెబితే... దుకాణదారుడు కాగితపు సంచుల్లో వేసి ఇచ్చేవాడు. తెచ్చి వాడుకునేవాళ్లం. డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చాక ఈ పద్ధతి మారిపోయింది. ఈ స్టోర్స్ లేని పల్లెటూళ్లలో తప్ప ఎక్కడా ‘లూజ్’ కొనుక్కోవడం లేదు. స్టోర్‌కి వెళ్లడం, షాపంతా తిరుగుతూ నచ్చినవాటిని ఏరుకోవడం, అంతా అయ్యాక బిల్లు చెల్లించి వచ్చేయడం! ఈ పద్ధతి అందరికీ బాగా నచ్చింది. ఎందుకంటే... ఉన్న వాటిలో బెస్ట్ ఎంచుకోవచ్చు. మనకు నచ్చిన ధరలోనే తీసుకోవచ్చు. అయితే నచ్చినవి తెచ్చేసుకోవడమేగానీ... అవి సురక్షితమో కాదో గమనిస్తున్నామా? అంటే... అవి ఎప్పుడు తయారయ్యాయి, ఏయే పదార్థాలతో తయారయ్యాయి, ఎంతకాలం నిల్వ ఉంటాయి వంటివన్నీ చెక్ చేసుకుంటున్నామా? లేదు. ఈ అలవాటు ఎనభై ఆరు శాతం మందికి లేనేలేదని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇది చాలా తప్పు, ప్రమాదకరం కూడా! వస్తువులు కొనేటప్పుడు వారంటీ, గ్యారంటీ ఎలా చూస్తామో... తిను బండారాలు, దినుసులు, మందులు కొనేటప్పుడు చూసి తీరాల్సినవి కొన్ని ఉన్నాయి. మొదట చూడాల్సింది ఎక్స్‌పయిరీ డేట్. ఆ తేదీ ఇంకా కనీసం మూడు నాలుగు నెలలు ఉంటేనే కొనాలి. లేదంటే కొనకపోవడమే మంచిది. కొన్నిటికి డేట్ ఇవ్వకుండా... ‘బెస్ట్ బిఫోర్ సిక్స్ మన్త్స్, ఒన్ ఇయర్’ అంటూ రాస్తాడు. అలాంటప్పుడు తయారీ తేదీ (మానుఫ్యాక్చరింగ్ డేట్) చూసుకుని, అక్కడ్నుంచి లెక్కపెట్టుకోవాలి. తర్వాత చూసు కోవాల్సింది... తిను బండారాలను వేటితో తయారు చేశారు అని. డైటింగ్ చేస్తున్న వాళ్లు, చక్కెర వ్యాధిగ్రస్తులు, కొన్ని రకాల అలర్జీలు ఉన్నవాళ్లయితే ఇంగ్రీడియెంట్స్ చూడకుండా అస్సలు కొనకూడదు. ఎందుకంటే వాటిలో మనకు పడనివి ఏవైనా ఉన్నాయి అనుకుంటే... కొనడం మానేయవచ్చు. పైగా పోషకాలు ఏమున్నాయనేది కూడా తెలుసుకోవడం మంచిదే కదా! అందుకే ఏయే పదార్థాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఇక మందులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు కొన్నిసార్లు కాంబినేషన్స్ చెబుతారు. వాటిని చెక్ చేసుకోవాలి. అలానే... డాక్టర్ ఎంత పవర్ ("mg') చెప్పారో అంతే ఉందా, ఎక్కువ తక్కువ ఉందా అని కూడా చూసుకోవాలి. కాస్మొటిక్స్ కూడా అంతే. ఎక్స్‌పయిరీ డేట్లు చూడకుండా కొనేస్తే... అందం పెరగడం పోయి ఉన్నది కాస్తా పాడవుతుంది. ర్యాషెస్, అలర్జీలు వంటివి వచ్చి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు టైమ్ వేస్ట్ అనుకోకుండా ‘లేబుల్స్’ తప్పక పరిశీలించండి. అయినా ఆరోగ్యం కంటే విలువైనది ఏముంది చెప్పండి! ఆదా + ఆరోగ్యం! దోశె వేస్తాం. రుచి బాగుంటుంది కదా అని చెంచాతో చుట్టూ నూనె పోస్తాం. చపాతీ చేస్తాం. బాగా కాలుతుంది కదా అని కాస్త నూనెను తగిలిస్తాం. అది కాస్త అని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఎక్కువ వేస్తుంటాం. చెంచాతో పోస్తే ఎంత పోస్తున్నామో తెలియదు. దాంతో తినాల్సిన దానికంటే ఎక్కువ నూనెను తినేస్తాం. అంటే... మన ఆరోగ్యాన్ని చేతులారా మనమే పాడు చేసుకుంటున్నామన్నమాట! తెలియకుండా జరిగిపోయే ఈ తప్పును ఆపడానికే ‘కుకింగ్ స్ప్రే’లను కనిపెట్టారు. వేరుశెనగ, సన్‌ఫ్లవర్, ఆలివ్ తదితర నూనెలతో పాటు వెన్న, నెయ్యి లాంటివి కూడా ఇప్పుడు ‘స్ప్రే’ల రూపంలో దొరుకుతున్నాయి. వీటి వల్ల ఉపయోగం ఏంటనే కదా! ఉంది. చాలా ఉంది. అసలు స్ప్రేలను తక్కువ ద్రవాన్ని ఎక్కువ ప్రదేశంలో చల్లేందుకు కనిపెట్టారు. వంట నూనెను కూడా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే... ఒక్కసారి స్ప్రే చేయగానే నూనె దోశె/చపాతీ అంతటా పరచుకుంటుంది... అది కూడా అతి తక్కువ పరిమాణంలో. ఆదాకి ఆదా... ఆరోగ్యానికి ఆరోగ్యం! వీటి ధర 250 రూపాయల నుంచి మొదలువుతుంది. పరిమాణాన్ని బట్టి, నూనెను బట్టి ధర మారుతూ ఉంటుంది. ఆన్లైన్లో అయితే కాస్త తక్కువలో కొనుక్కోవచ్చు! -
సిలిండర్‌కు ఎక్స్పైరీ డేట్ ఇలా తెలుసుకోవాలి...
గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే విషయం తెలియడం ఎంత ముఖ్యమో ఆ ఎక్స్పైరీ డేట్‌ని ఎలా తెలుసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా సులభం, సిలిండర్ మీదనే ఉంటుంది. ఇక్కడ ఫొటోలు చూడండి... ఇంగ్లిష్ అక్షరం ‘డి-06’ అని నల్లరంగులో పెయింట్ చేసిన అక్షరాలున్నాయి గమనించారా? అంటే ఈ సిలిండర్‌ని ఉపయోగించే కాలం 2006వ సంవత్సరం డిసెంబర్‌తో ముగుస్తుంది అని అర్థం. అలాగే ‘డి-13’ అని ఉన్న సిలిండర్ కాలపరిమితి 2013వ సంవత్సరం డిసెంబర్‌తో ముగుస్తుంది. ఇక్కడ సూచించిన ఇంగ్లిష్ అక్షరం ‘డి’ని డిసెంబర్‌గా అర్థం చేసుకోవచ్చు కానీ ఇది ఆ నెల పేరులో మొదటి అక్షరానికి సూచిక కాదు. గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీని నిర్దేశించడానికి ఏడాదిని నాలుగు క్వార్టర్లుగా విభజిస్తారు. ఇంగ్లిష్ అక్షరంతో పాటు ఆ ఏడాదిలో చివరి రెండు అంకెలను సూచించే ఈ విధానాన్ని అల్ఫా న్యూమరికల్ సిస్టమ్ అంటారు. ‘ఎ’ అంటే ఏడాదిలో మొదటి మూడు నెలల కాలం, ‘బి’ అంటే ఏప్రిల్‌నుంచి జూన్, ‘సి’ అంటే జూలై నుంచి సెప్టెంబరు, ‘డి’ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అన్నమాట. ఉదాహరణకు ఒక సిలిండర్ మీద ఇంగ్లిష్ అక్షరం ‘ఎ-14’ అని ఉంటే దాని కాలం 2014వ సంవత్సరం మార్చి నెలతో ముగుస్తుందని తెలుసుకోవాలి. ఇదంతా చెప్పడం ఎందుకంటే... సిలిండర్ పేలుడు ప్రమాదాలు ఎక్కువగా ఎక్స్పైరీ ముగిసిన సిలిండర్లతోనే వస్తుంటాయి. ఇకపై మీ ఇంటికి వచ్చిన గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు దాని బరువుతోపాటు సిలిండర్ కాలపరిమితిని కూడా పరీక్షించండి.